first class air travel
-
ఫస్ట్ క్లాసు ప్రయాణాలొద్దు: పాక్ కేబినెట్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ నిధులను విచక్షణారహితంగా వాడటంపై నిషేధం విధించింది. దేశాధ్యక్షుడు, ప్రధాని సహా ప్రభుత్వాధికారులు, నేతలు ఎవరైనా సరే విమానాల్లో ఫస్ట్‌క్లాస్ ప్రయాణాలు చేయకూడదని ఆదేశించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌధురి తెలిపారు. అధికారిక బంగ్లాను కాదని, మిలిటరీ సెక్రెటరీ నివాసంలోని ఓ చిన్న పోర్షన్‌లోనే ఇమ్రాన్ నివాసముంటున్నారు. 2 వాహనాలు, ఇద్దరు సిబ్బందిని మాత్రమే నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడు, ప్రధాని, ప్రధాన న్యాయమూర్తి, సెనేట్ చైర్మన్, జాతీయ అసెంబ్లీ స్పీకర్, రాష్ట్రాల సీఎంలు ఇకపై క్లబ్/బిజినెస్ క్లాస్‌లోనే ప్రయాణం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చౌధురి వెల్లడించారు. విదేశీ పర్యటనలకు, దేశంలో పర్యటించేందుకు ప్రత్యేక విమానాన్ని వినియోగించడాన్ని ఇకపై నిలిపివేయాలని ప్రధాని నిర్ణయించారు. ఆర్మీ చీఫ్ మొదటి తరగతికి బదులు బిజినెస్ క్లాస్‌లోనే వెళ్లాలి. ప్రభుత్వ నిధులను యధేచ్ఛగా కేటాయించే అధికారం అధ్యక్షుడు, ప్రధాని, ఇతర అధికారులకు ఇకపై ఉండదు. -
అధికారులకు ఫస్ట్‌క్లాస్ విమానయానం కట్
దేశ ఖజానా పరిస్థితి చాలా దారుణంగా ఉందని, అందువల్ల దుబారాను వెంటనే తగ్గించాలని కేంద్ర ఆర్థికశాఖ ఆదేశించింది. ప్రభుత్వాధికారులు ఇకమీదట పొదుపు చర్యలు పాటించి తీరాల్సిందేనని కుండ బద్దలుకొట్టింది. ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేయడం, ఫస్ట్ క్లాస్ విమానాల్లో ప్రయాణించడం ఇక మానుకోవాలని స్పష్టం చేసింది. ప్రణాళికేతర వ్యయాన్ని కనీసం 10 శాతం మేర తగ్గించాలన్న లక్ష్యాన్ని ఆర్థిక శాఖ విధించింది. జూలై నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 12.19 లక్షల కోట్ల ప్రణాళికేతర వ్యయం అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో, అనవసర వ్యయాలను కచ్చితంగా తగ్గించాలని ఓ మెమోలో తెలిపింది. విదేశాలకు వెళ్లేటప్పుడు ప్రభుత్వాధికారులు ఫస్ట్ క్లాస్ విమానాల్లో ప్రయాణించకూడదని, ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేయకూడదని.. వీటిపై నిషేధం ఉందని తెలిపారు. అలాగే ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు, సదస్సులు కూడా నిర్వహించకూడదన్నారు. వాస్తవానికి సీనియారిటీ ప్రకారం వివిధ తరగతుల్లో ప్రయాణించేందుకు అధికారులకు అర్హత ఉన్నా.. ప్రస్తుత పరిస్థితిని బట్టి వాటిని మానుకోవాలన్నారు.