మంత్రివర్గ సమావేశంలో మోదీ
న్యూఢిల్లీ: మరో రెండు నెలల్లో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వానికి తొలి వంద రోజుల రోడ్‌మ్యాప్‌తోపాటు రాబోయే ఐదేళ్ల రోడ్‌మ్యాప్ రూపొందించాలని మంత్రివర్గ సహచరులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. మోదీ అధ్యక్షతన ఆదివారం ఉదయం ఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. తొలి వంద రోజుల రోడ్‌మ్యాప్, ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను సమర్థంగా ఎలా అమలు చేయాలన్నదానిపై నిపుణులతో, సంబంధిత శాఖల కార్యదర్శులతో సంప్రదింపులు జరపాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు జరిగే తేదీలను నోటిఫై చేసే ప్రక్రియను కేంద్ర కేబినెట్ ప్రారంభించింది. ఎన్నికల సంఘం ప్రతిపాదనలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు మంత్రివర్గం పంపించింది. రాష్ట్రపతి ఆమోదంతో తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 20న వెలువడనుంది. నోటిఫికేషన్ అనంతరం నామినేషన్ల పక్రియ ప్రారంభమవుతుంది. ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వేర్వేరు తేదీల్లో ఏడు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment