hundred days
-
తొలి వంద రోజులకు, వచ్చే ఐదేళ్లకు రోడ్‌మ్యాప్
న్యూఢిల్లీ: మరో రెండు నెలల్లో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వానికి తొలి వంద రోజుల రోడ్‌మ్యాప్‌తోపాటు రాబోయే ఐదేళ్ల రోడ్‌మ్యాప్ రూపొందించాలని మంత్రివర్గ సహచరులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. మోదీ అధ్యక్షతన ఆదివారం ఉదయం ఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. తొలి వంద రోజుల రోడ్‌మ్యాప్, ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను సమర్థంగా ఎలా అమలు చేయాలన్నదానిపై నిపుణులతో, సంబంధిత శాఖల కార్యదర్శులతో సంప్రదింపులు జరపాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు జరిగే తేదీలను నోటిఫై చేసే ప్రక్రియను కేంద్ర కేబినెట్ ప్రారంభించింది. ఎన్నికల సంఘం ప్రతిపాదనలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు మంత్రివర్గం పంపించింది. రాష్ట్రపతి ఆమోదంతో తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 20న వెలువడనుంది. నోటిఫికేషన్ అనంతరం నామినేషన్ల పక్రియ ప్రారంభమవుతుంది. ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వేర్వేరు తేదీల్లో ఏడు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది. -
మాజీ ఎమ్మెల్యే డైరెక్షన్.. తెలుగు తమ్ముళ్ల ఓవరాక్షన్!
ములకలచెరువు : నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన తెలుగు తమ్ముళ్లు ములకలచెరువులో సోమవారం చేపట్టిన సంఘీభావ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్ నేతృత్వంలో చేపట్టిన ఈ ర్యాలీకి పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేదు. దీంతో పోలీసులు ర్యాలీని అడ్డుకున్నా... శంకర్‌యాదవ్ డైరెక్షన్లో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి అలజడి సృష్టించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ దౌర్జన్యకాండకు ఒడిగట్టారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఫలితంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ములకలచెరువు మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంయమనంతో అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా టీడీపీ శ్రేణులు ఈలలు వేస్తూ వారి మీదికొచ్చారు. అల్లరి మూకలు వైఎస్సార్సీపీ నాయకులపై రాళ్లు, చెప్పులతో దాడులు చేశాయి. ఈ దాడుల్లో పోలీసులతోపాటు వైఎస్సార్సీపీ నేతలకూ గాయాలయ్యాయి. సంఘీభావ ర్యాలీ చేపట్టిన శంకర్ అనుచరులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ర్యాలీకి ముందస్తు అనుమతి లేదని నిలిపివేయాలని మదనపల్లి డీఎస్పీ కేశప్ప మాజీ ఎమ్మెల్యే శంకర్‌కు సూచించారు. ‘మీకు చేతనైతే ర్యాలీని ఆపుకోండి.. దేనికైనా సిద్ధం’ అంటూ శంకర్ పోలీసులను రెచ్చగొట్టారు. అంతటితో ఆగని శంకర్.. తన వాహనంతో మండల కేంద్రానికి వచ్చి అనుచరగణంతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవు : డీఎస్పీ బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా పొందాలని డీఎస్పీ కేశప్ప స్పష్టం చేశారు. ఇష్టారాజ్యంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని జన జీవనానికి విఘాతం కలిగిస్తూ.. సభలు, సమావేశాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు తెలుగు తమ్ముళ్ల దాడిలో మహిళలకు గాయాలు యాదమరి(చిత్తూరు జిల్లా): లోకేశ్ పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా యాదమరి మండలంలో చేపట్టిన సంఘీభావ యాత్రలో వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై టీడీపీ నాయకులు టపాకాయలు కాల్చి దాడికి దిగారు. సోమవారం నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు యాదమరి నుంచి దళవాయిపల్లెకు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కావాలనే 14 కండిగ ముస్లింవాడ గ్రామం మీదుగా దళవాయిపల్లె వరకు పాదయాత్ర చేశారు. 14 కండిగ ముస్లింవాడలో వైఎస్సార్సీపీ మైనారిటీ నాయకులు, స్థానిక సర్పంచ్ కుటుంబం కబీర్ ఇంటి ముందు బాణసంచా పేల్చి, వారిని ఇబ్బందులకు గురిచేయాలని భావించారు. ప్రణాళిక ప్రకారం వీధిలో దాదాపు 500 మీటర్ల దూరం బాణసంచా పేర్చి నిప్పు పెట్టారు. చెవులకు చిల్లులు పడేలా శబ్దాలు రావడంతో ఇంట్లో ఏడాది బాబుతో పాటు మహిళలు భయాందోళనలకు గురయ్యారు. దీనిపై స్థానిక మహిళలు తెలుగు తమ్ముళ్లును ప్రశ్నించగా, వారు రెచ్చిపోయి విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. పలువురు మహిళలకు గాయాలయ్యాయి. దీనిపై మైనారిటీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సుమన్ తెలిపారు. -
సముద్రాన్నే నివాసంగా..నీటి అడుగున 100 రోజులు జీవించనున్న మనిషి
పురాణాల్లో వింటుంటాం సముద్రాల్లో నీటి అడుగున జీవించే మనుషుల గురించి. అంతేందుకు మహాభారతంలో దుర్యోధనడు నీటి అడుగున్న ధ్యానం చేయగల ధీరుడని విన్నాం. అవన్నీ వినడమే గానీ నిజంగా ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మాములుగా ఓడల్లో సముద్ర ప్రయాణాలు రోజుల తరబడి జరిగినప్పటికీ అది నీటిపైనే కానీ అడుగున కాదు. ఐతే నీటి అడుగున జీవించగలమా అక్కడ పరిస్థితులను మన శరీరీం తట్టుకోగలదా అనే దానిపై చాలా సందేహాలు శాస్తవేత్తలను మదిలో ప్రశ్నలుగా మిగిలాయి. ఈ నేపథ్యంలోనే ఎలాగైన వాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో ఫ్లోరిడాకు చెందిన ప్రోఫెసర్ జో డిటూరి ఒక అసాధారణమైన ప్రయోగానికి నాంది పలికారు. బయో మెడికల్ ఇంజనీరింగ్ పీహెచ్డీ చేసిన డిటూరి అనేక వ్యాధులను నివారించగల మెడికల్ టెక్నాలజీపై కూడా పలు పరిశోధనలు చేశారు. ఈ మేరకు ఆయన సముద్రాన్ని మూడు నెలలపాటు తన నివాసంగా మార్చుకున్నాడు. అతను సముద్రంలోని 30 అడుగుల లోతుల్లో 100 రోజులు జీవించే ప్రయాగాన్ని నిర్వహించాడు. ఈ ప్రయోగానికి నెఫ్ట్యూన్ 100 అని పేరు పెట్టాడు. ఈ ప్రయోగం కోసం రిటైర్డ్ యూఎస్ నేవీ కమాండర్ ప్రోఫెసర్‌గా ఎంచుకున్నాడు. పనిలో పనిగా మనస్తత్వ వేత్త ఈ ప్రయోగాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తాడు. అంతరిక్ష పర్యాటనకు సమానమైన వాతావరణంలో ఉన్నప్పుడూ మనిషి మానసిక స్థితి, ప్రభావాలు ఎలా ఉంటాయనేద దానిపై వారు పర్యవేక్షిస్తారు. ఈ ప్రయోగం సక్స్స్ అయితే భూమిపై అనుభవించిన ఒత్తిడికి 1.6 రెట్ల ఒత్తిడిని అధిగమించి బతికిబట్టగట్ట గలిగితే ప్రపంచ రికార్డుగా నిలుస్తుంది. వాస్తవానికి మానవ శరీరం నీటి అడుగున ఇంత కాలం ఉండలేదని ప్రోఫెసర్ డిటూరి అన్నారు. కాబట్టి నా శరీరం ఏమౌవుతోందో అనేది అధ్యయనాలకు ముఖ్య భూమికగా ఉపయోగపడుతుంది. అలాగే నా శరీరాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశం పరిశోధనకు ఉపకరిస్తుంది. ఒకవేళ నీటి అడుగున ఒత్తిడిని ఎదుర్కొనగలిగితే తన ఆరోగ్యం మరింత మెరుగుపడే అవకాశాలు ఉంటయని చెబుతున్నారు. ఈ మేరకు డిటూరి ఈప్రయోగాన్ని మార్చి1న ప్రారంభించారు. ఐతే తాను సూపర్ హ్యుమన్‌గా బయటకు వస్తానో లేదో అనేది కాస్త సందేహంగానే ఉందన్నారు. View this post on Instagram A post shared by Joe Dituri (@drdeepsea) (చదవండి: ఇమ్రాన్ ఖాన్ ఇలా కోర్టుకి వెళ్లగానే..అలా ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ..) -
వంద రోజులపాటు మాస్క్ ధరించాలి
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా వంద రోజులపాటు మాస్క్ విధిగా ధరించాలని అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పిలుపునిచ్చారు. అధికార పగ్గాలు చేపట్టాక ప్రకటించే మొదటి కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటని అన్నారు. సీఎన్ఎన్తో ఆయన మాట్లాడుతూ..జనవరి 20వ తేదీన బాధ్యతల స్వీకారం రోజున 100 రోజులపాటు మాస్క్ ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. అదీ ఎల్లకాలం కాదు. కేవలం వందరోజులు మాత్రమే. దీనివల్ల కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతాయి’అని చెప్పారు. మాస్క్ ధరించి దేశభక్తిని నిరూపించుకోండంటూ ఎన్నికల ప్రచార సభల్లో కూడా బైడెన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మాస్క్ ధారణ అంటే కరోనా మహమ్మారిని రాజకీయం చేయడమేనన్న డొనాల్డ్ ట్రంప్ విధానానికి బైడెన్ చర్య పూర్తి వ్యతిరేకం కానుంది. మాస్క్ ధరించడం ద్వారా అత్యంత సులభంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్న ఆరోగ్య నిపుణుల హెచ్చరికలను కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం, ఇప్పటికే 2.75 లక్షల మంది ఈ మహమ్మారికి బలి కావడం తెలిసిందే. కాగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీని అదే పదవిలో కొనసాగాలని కోరినట్లు కూడా బైడెన్ సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గతంలో నిర్వర్తించిన బాధ్యతలనే ఇకపైనా చేపట్టాలని తెలిపినట్లు పేర్కొన్నారు. తన కోవిడ్–19 సలహా బృందంలో సభ్యుడిగాను చీఫ్ మెడికల్ అడ్వైజర్‌గా ఉండాలని కూడా డాక్టర్ ఫౌసీని అడిగానన్నారు. కరోనా టీకా భద్రత, సమర్థతపై వ్యక్తమవుతున్న అనుమానాలు పోగొట్టేందుకు స్వయంగా తానే టీకా వేయించుకుంటానని బైడెన్ అన్నారు. అలా చేయడం తనకు కూడా సంతోషమేనన్నారు. గురువారం ఒక్కరోజే భారీగా మరణాలు, కేసులు నమోదు కావడంతో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కమలా బృందంలో మహిళా మకుటాలు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ తన బృందం మొత్తంలో మహిళలకు పెద్దపీట వేశారు. పాలనా వ్యవహారాల్లో అనుభవం ఉన్న టీనా ఫ్లోర్నాయ్ని చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించారు. అమెరికా పౌరుల రక్షణకు నాన్సీ మెక్ ఎల్డోనీని జాతీయ భద్రతా సలహాదారుగా, డొమెస్టిక్ పాలసీ అడ్వైజర్‌గా రోహిణీ కొసోగ్లులను నియమిస్తున్నట్టు కమలప్రకటించారు. టీనా ఫ్లోర్నాయ్ గత మూడు దశాబ్దాలుగా డెమొక్రటిక్ పార్టీలో వివిధ పదవుల్లో ఉన్నారు. సర్జన్ జనరల్‌గా వివేక్ భారతీయ సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తి(43)ని బైడెన్ సర్జన్ జనరల్‌గా నియమించనున్నట్టు తెలుస్తోంది. ఈ వైద్యుడు బైడెన్ కోవిడ్ అడ్వైజరీ బోర్డులోని ముగ్గురు çసహాధ్యక్షుల్లో ఒకరు. గతంలో 2014 డిసెంబర్ 15న వివేక్ మూర్తి సర్జన్ జనరల్‌గా నియమితులయ్యారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఏప్రిల్ 21, 2017న పదవి నుంచి దిగిపోయారు. బైడెన్ నేతృత్వంలో డాక్టర్ వివేక్ మూర్తి తిరిగి కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. వివేక్ మూర్తి హార్వర్డ్ యూనివర్సిటీలో 1997లో బయోకెమికల్ సైన్సెస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండీ చేశారు. -
ప్రపంచాన్ని వణికించిన 100 రోజులు
ఎవరు అనుకున్నారు..ఈ ఏడాది ప్రపంచం స్తంభించిపోతుందని.. కంటికి కనిపించని ఓ పరాన్న జీవి..రాజు, పేద తేడాల్లేకుండా వణికించేస్తుందని.. సగం మానవాళిని ఇళ్లకే పరిమితం చేస్తుందని! ఉద్యోగం.. వ్యాపారం.. విహారం.. వినోదంఅన్నీ ఆగిపోతాయని.. అయినా చైనాలో పుట్టి ప్రపంచాన్ని కబళించేస్తున్న కరోనా మహమ్మారి.. స్వైర విహారం కొనసాగుతూనే ఉంది. గత డిసెంబర్ 31న చైనా తొలిసారిగా వైరస్ గురించి ప్రకటించింది. జనవరి 1న వూహాన్ సీఫుడ్ మార్కెట్‌ను షట్‌డౌన్ చేశారు.. ఈ వంద రోజుల్లో ఏం జరిగింది? డిసెంబర్ 31, 2019.. ఒక పక్క ప్రపంచం కొత్త సంవత్సరం ఆహ్వానించడానికి సిద్ధమవుతుండగా.. చైనా ప్రభుత్వ వెబ్సైట్లో ఓ వార్త ఫ్లాష్ అయ్యింది. ‘కారణం తెలియకుండానే కొందరికి న్యుమోనియా సోకింది’ అన్న ఆ వార్తను అప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. చైనా దక్షిణ ప్రాంతంలో సముద్రజీవుల మాంసం విక్రయించే మార్కెట్లో ఓ మధ్య వయస్కురాలితో పాటు మరో 30 మందిలో కనిపించిన ఆ న్యుమోనియా లక్షణాలపై ఆరోగ్య శాఖ అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదిక పంపారు. మరిచిపోయారు.. పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా, పసఫిక్ మహా సముద్ర ప్రాంతంలో మసూచీ, అఫ్గానిస్తాన్‌లో డెంగీ వంటి దాదాపు 12 వ్యాధుల నివేదికలతో బిజీగా ఉన్నడబ్ల్యూహెచ్వో.. చైనా నివేదికపై గుర్తించామన్న ముద్ర వేసేసింది. చైనా బయట ఈ కరోనా లక్షణాలేవీ అప్పటికి కనిపించలేదు కూడా. కానీ ఆ తర్వాత ఒక్కో రోజు గడుస్తుంటే ప్రళయం సరిహద్దులు దాటి.. మన దేశానికి.. మన నగరానికి, మన వీధిలోకి.. మన నట్టింట్లోకి వచ్చేస్తే ఎలా ఉంటుందో ప్రజలందరికీ వంద రోజుల్లోనే అర్థమైపోయింది. చైనా దాటి థాయ్‌లాండ్‌లోకి.. వూహాన్లో వ్యాధికి కారణమేమిటన్న విషయం స్పష్టమైన కొన్ని రోజులకే ప్రాణాంతక కరోనా వైరస్ చైనా సరిహద్దులు దాటుకుని థాయ్‌లాండ్‌లో ప్రత్యక్షమైంది. వూహాన్లో ఉండే 61 ఏళ్ల వ్యక్తి ఒకరిలో జ్వరం లక్షణాలు ఉన్నట్లు బ్యాంకాక్ విమానాశ్రయ అధికారులు థర్మల్ స్కానర్ల సాయంతో గుర్తించారు. ఒకట్రెండు వారాల్లోనే చాలా ఆస్పత్రుల్లో కరోనా లక్షణాలున్న వారు భారీ సంఖ్యలో చేరుతున్నట్లు ౖ వూహాన్లో వెద్యులు గుర్తించారు. జనవరి 20వ తేదీ అంటే.. వైరస్ ఉనికి స్పష్టమైన 20 రోజులకు గువాంగ్డాంగ్ ప్రాంతంలో రెండు కొత్త కేసులు బయటపడ్డాయి. వీరికి వూహాన్‌తో ఏ సంబంధమూ లేదని ప్రకటించారు. దీన్నిబట్టి వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతున్నట్లు స్పష్టమయ్యింది. ఈయూలోని పలు దేశాల్లో.. యూరోపియన్ యూనియన్‌లో ఉండాలా.. వద్ద అన్న అంశంపై నాలుగేళ్లు మల్లగుల్లాలు పడ్డ బ్రిటన్.. ఎట్టకేలకు జనవరి 31న వైదొలగుతున్నట్లు ప్రకటించింది. ఈ సమస్య తీరిందో లేదో యూనియన్‌లోని పలు దేశాల్లో కరోనా కోరలు చాచడం మొదలుపెట్టింది. స్పెయిన్, ఇటలీల్లో తొలి కేసులు నమోదయ్యాయి. చైనాలో 258 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 11 వేల మంది వైరస్ బారిన పడ్డారు. చైనా వెళ్లి వచ్చిన వారిపై అమెరికాలో నిషేధం మొదలైంది. జనవరి నెలాఖరుకల్లా వైరస్ భారతదేశంతో పాటు ఫిలిప్పీన్స్, రష్యా, స్వీడన్, బ్రిటన్లకూ విస్తరించింది. కేరళలో ముగ్గురికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఫిబ్రవరి 4వ తేదీకల్లా చైనాలో 425 మంది ప్రాణాలు కోల్పోగా, 20 వేల మంది వైరస్ బారినపడినట్లు తేలింది. వూహాన్ నివాసి ఒకరు ఫిలిప్పీన్స్‌లో మరణించడంతో చైనా బయట తొలి కరోనా మరణం నమోదైంది. మహమ్మారిగా అవతారం.. వైరస్ ఉనికి బయటపడ్డ 71వ రోజున కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 1.16 లక్షలకు చేరుకుంది. అమెరికా, బ్రిటన్‌లో స్టాక్‌మార్కెట్లు పతనమైపోయాయి. ఇటలీ, స్పెయిన్లలో మరణాల రేటు ఊపందు కుంది. బ్రిటన్‌లో 456 కేసులు నమోద య్యాయి. భారత్ విషయానికి వస్తే.. మార్చి 12న సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యక్తి మరణంతో భారత్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. భారత్‌లో మార్చి 22న ఒక రోజు జనతా కర్ఫ్యూ, ఒక రోజు విరామం తర్వాత మార్చి 24 నుంచి 3 వారాల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించారు. వూహాన్ సీఫుడ్ మార్కెట్ షట్‌డౌన్ జరిగి 100వ రోజున అంటే ఏప్రిల్ 9 నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 15.77 లక్షలకు చేరగా, మరణాలు 93 వేలు దాటాయి. వూహాన్లో పుట్టి.. ప్రపంచాన్ని చుట్టి ► 31 డిసెంబర్ 2019: మొదటిరోజు 31 కేసులు, ► 09 జనవరి 2020 : 10వ రోజు 63 కేసులు, ఒకరి మృతి ► 19 జనవరి 2020: 20వ రోజు 122 కేసులు, 3 మరణాలు ► 29 జనవరి 2020 : 30వ రోజు 6,166 కేసులు, 133 మరణాలు ► 08 ఫిబ్రవరి 2020: 40వ రోజు 37,120 కేసులు 806 మరణాలు ► 18 ఫిబ్రవరి 2020 : 50వ రోజు 75,136 కేసులు 2,007 మరణాలు ► 28 ఫిబ్రవరి 2020 : 60వ రోజు 84,112 కేసులు, 2,872 మరణాలు ► 09 మార్చి 2020: 70వ రోజు 1,13,590 కేసులు, 3,988 మరణాలు ►19 మార్చి 2020: 80వ రోజు 2,42,570 కేసులు, 9,867 మరణాలు ► 29 మార్చి 2020: 90వ రోజు 7,20,140 కేసులు, 33,925 మరణాలు ► 08 ఏప్రిల్ 2020: 100వ రోజు 15,11,104 కేసులు, 88,338 మరణాలు -
వంద రోజులు..వేల వెలుగులు
సాక్షి, విశాఖ సిటీ: ప్రజా సంక్షేమమే లక్ష్యం.. అభివృద్ధే ప్రధానం.. ఇదే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నినాదం. రాజన్న రాజ్యం నిజంగా తిరిగి వచ్చిందన్న నమ్మకాన్ని.. ప్రతీ కుటుంబానికి నవరత్నాల వెలుగులు నింపుతానన్న భరోసాని కేవలం వంద రోజుల పాలనలోనే ఆయన కలిగించారు. ముఖ్యంగా జిల్లా పరంగా చూసుకుంటే ‘విశాఖ వికాసమే నా లక్ష్యం’ అన్నట్టుగా ఆయన జిల్లా వాసులపై వరాలు కురిపించారు. పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ అనేక ప్రాజెక్ట్‌లను కేటాయించారు. దీర్ఘకాలంగా ఉన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. పరిశ్రమలకు చేయూతనిచ్చారు. మరెన్నో సంస్థలకు అండగా నిలిచారు. మొత్తంగా జిల్లా ప్రజలకు ‘నేనున్నా’అంటూ వరాల జల్లు కురిపించారు. తండ్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి గిరిపుత్రులంటే వల్లమాలిన అభిమానం. ఆయన పంథాను కొనసాగిస్తూ గిరిబిడ్డల ఆరోగ్యమే ప్రధానంగా పాడేరు కేంద్రంగా గిరిజన మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. ఏజెన్సీ వాసులు జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీసేందుకు, తమ జేబులు నింపుకునేందుకు గత ప్రభుత్వం జారీ చేసిన బాక్సైట్ తవ్వకాల జీవో 97ను తక్షణమే రద్దు చేయించారు. సబ్బవరం కేంద్రంగా మూడు జిల్లాల జీవనాడి...మహానేత వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై కమ్ముకున్న నీలినీడలను పటాపంచలు చేస్తూ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేశారు. దాదాపు 40 వేల కుటుంబాల జీవితాలను బాగుచేసే ఉద్దేశంతో రెండున్నర దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సింహచలం దేవస్థానం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం కమిటీ వేశారు. అధికారం చేపట్టిన వెంటనే పింఛన్ మొత్తం పెంచి..వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ బాధితులకు అండగా నిలిచారు. రోడ్డున పడ్డ దాదాపు వేలాది మంది కార్మిక కుటుంబాలను ఆదుకునే దిశగా భీమిలి సమీపంలోని చిట్టివలస జ్యూట్ మిల్లు కార్మికులను ఆదుకున్నారు. వారి సమస్యలను కేవలం 45 రోజుల్లో పరిష్కారించారు. ఇక నగరాభివృద్ధికి కేంద్ర బింధువైన విశాఖపట్నం మెట్రోరీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఎ)కు పునర్జీవం పోశారు. చైర్మన్, కమిషనర్లను తక్షణమే నియమించి సంస్థను గాడిలో పెట్టారు. నగరానికి మరిన్ని సొగబులు అద్దె దిశగా అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ఇక రైతు, గిరిజన, మత్స్యకార, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఆర్టీసీ ఉద్యోగులు కల నెరవేర్చారు. అంగన్వాడీ, ఆశ, మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచి వారి కుటుంబాలకు కొండంత అండగా నిలిచారు. ఇంకా అనేక సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది మంది ప్రజలకు లబ్ధి చేకూర్చుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా వంద రోజుల పాలన ‘చరిత్ర’ సృష్టించింది అనడంలో అతిశయోక్తి లేదు. లక్షన్నర మంది మత్స్యకారులకు భరోసా.. సముద్రంలోకి వేటకు వెళితే బతుకులపై భరోసా లేదు. అనుకోని ప్రమాదం జరిగితే కుటుంబాలకు దిక్కులేదు. ఆదుకునే నాథుడు లేడు. వేట నిషేధ సమయంలో పూట గడిచే పరిస్థితి లేదు. ఇలా మత్స్యకారుల జీవనం అగమ్యగోచరం. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వీరిని ఆదుకునేందుకు వరాలు కురిపించింది. నగరంలోని హార్బర్లో ప్రత్యక్షంగా..పరోక్షంగా జీవనం సాగిస్తున్న దాదాపు 20 వేల మందితో పాటు విజయనగరం, శ్రీకాకుళం నుంచి వలస వచ్చి బతుకుతున్న దాదాపు 7 వేల మందికి, జిల్లాలో ముత్యాలమ్మపాలెం, పరవాడ, పూడిమడక, కొత్త జాలారిపేట, పెదజాలరిపేట, భీమిలి, చేపలుప్పాడ, బంగారమ్మపాలెం, రేవు పోలవరం, తీనార్ల, రాజయ్యపేట ప్రాంతాల్లోని వేలాది మంది మత్స్యకారుల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టారు. వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైతే రూ.10లక్షల పరిహారం, వేట నిషేధ కాలంలో గతంలో ఉన్న రూ.4 వేలను రూ.10వేలకు పెంపు, డీజిల్‌పై రాయితీ గతంలో ఉన్న రూ.6.80 ని రూ.12.14 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 132 కిలోమీటర్ల మేర ఉన్న తీరప్రాంతంలోని 63 మత్స్యకార గ్రామాల్లో నివాసం ఉంటున్న 1.50 లక్షల మంది ఫలం పొందుతారు. వేట నిషేధ సమయంలో దాదాపు 20 వేల మందికి పరిహారం అందనుంది. 40 వేల కుటుంబాలకు సాయం.. సింహాచలం దేవస్థానం పంచగ్రామాల భూసమస్య పరిష్కారం అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 40 వేల కుటుంబాలు మేలు పొందుతాయి. ఈ సమస్య పరిష్కారం కోసం జూన్ మొదటివారంలో జరిగిన తొలి కేబినేట్ సమావేశంలో సీఎం మంత్రులతో చర్చించారు. అనంతరం జూలై 17 అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే అదీప్‌రాజ్ భూ సమస్య పరిష్కారం గురించి ప్రశ్న లేవనత్తగా.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. అదే నెల 26న సమస్య పరిష్కారం కోసం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యవేక్షణలో కలెక్టర్ చైర్మన్‌గా ప్రత్యేక కమిటీని నియమించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏర్పాటైన ఈ కమిటీ త్వరలో పని ప్రారంభిస్తుంది. పోలీసులకు వారాంతపు సంతోషం.. పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరితే కుటుంబంతో గడిపే అవకాశం లేనట్లే. వారాంతపు సంతోషాన్ని విడనాడాల్సిందే. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందుకు భిన్నంగా ఆలోచించారు. పోలీసులకు వారంలో ఒక రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పోలీసు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. జిల్లా/నగర వ్యాప్తంగా పోలీసులకు వారంతపు సెలవు అమలవుతుంది. తద్వారా జిల్లాలో 2,500 మంది, నగరంలో 3 వేల మంది పోలీసులు వారంలో ఒకరోజు పూర్తిగా కుటుంబంతో గడుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1300 మంది హోంగార్డులకు ఈ సెలవు వర్తించడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఆటోవాలాకు ఆనందం.. ఓ వైపు ఆర్థిక కష్టాలు.. మరోవైపు వెంటాడే ఆర్టీఏ కేసులు.. ఇంకోవైపు ఆటో మరమ్మతులు ఇలా ఆటో కార్మికుల కష్టాలకు కొదవలేదు. జిల్లాలో ప్రతిపక్షనేత హోదాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా ఆటోకార్మికులు తమ గోడు చెప్పుకున్నారు. దీనిపై ఆలోచన చేసిన సీఎం ఆటో కార్మికులందరితో పాటు సొంత వాహనం కలిగిన ట్యాక్సీ కార్మికులకు కూడా ఏటా రూ.10 వేలు అందిస్తామని భరోసా ఇచ్చారు. తద్వారా జిల్లాలోని దాదాపు 42 వేల మంది ఆటో కార్మికులు ఈ ప్రతిఫలం పొందనున్నారు. అలాగే మరో 6 వేల మంది ట్యాక్సీవాలాలు ఈ నగదు అందుకోనున్నారు. అందరికీ ఆరోగ్యం.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్ష. అలాంటి దైన్యం నుంచి పేదలను విముక్తి చేసింది డాక్టర్ వైఎస్సార్ పాలన. మళ్లీ ఆ పాలన గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వంద రోజుల పాలనలో ఆరోగ్యశాఖపై ప్రత్యేక కసరత్తు చేశారు. ఆరోగ్యశ్రీకి ఊపిరి పోస్తూ రూ.1000 వైద్య ఖర్చు దాటితే ఈ పథకం వర్తించేలా మార్గదర్శకాలు రూపొం దించారు. అదే సమయంలో వార్షికాదాయం రూ.40 కాకుండా రూ.5 లక్షలు ఉన్నవారిని ఈ పథకంలోకి ప్రవేశపెట్టారు. దీంతో జిల్లాలో 12,87,187 మంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నారు. అంగన్వాడీలకు మరింత లబ్ధి.. అప్పుడు రూ.10,500 వేతనంతో అంగన్వాడీ కార్యకర్తలు పని చేస్తున్నారు. ఆ సమయంలో తమకు వేతనాలు పెంచాలని జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. వారి వినతిని పరిశీలించిన ఆయన అధికారంలోకి రాగానే.. అంగన్వాడీలందరికీ రూ.11,500 వేతనం చేస్తూ జీవో జారీ చేశారు. దీనివలన జిల్లాలోని 25 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 4,952 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 4,786 మంది సిబ్బందికి మేలు జరిగింది. పారిశుధ్య కార్మికుల బతుకులు బాగు.. మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. గత ప్రభుత్వాలు కార్మికుల బాగోగులు పట్టించుకోలేదు. వారి ఆలోచనకు భిన్నంగా సీఎం వైఎస్ జగన్ కార్మికులను ఆదుకున్నారు. వారి బతుకుల బాగును కాంక్షిస్తూ హెల్త్ అలవెన్స్‌లను ఇవ్వడంతో పాటు వేతనాలను పెంచారు. అలవెన్స్ కింద రూ.6వేలు ఇవ్వడంతో పాటు వేతనాలను రూ.18 వేలకు పెంచారు. తద్వారా జీవీఎంసీ పరిధిలోని 5,130 మంది, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో 200 మంది కార్మికులకు లబ్ధి చేకూరింది. బాక్సైట్ ముప్పు తొలగింది.. టీడీపీ ప్రభుత్వం అక్రమార్జన కోసం జీవో నంబర్ 97 ద్వారా బాక్సైట్ తవ్వకాలకు తెరతీసే ప్రయత్నం చేసింది. అయితే గిరిజనులతో పాటు ప్రజాసంఘాలు ఈ జీవోను తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో అప్పటి ప్రభుత్వం తాత్కాలికంగా తవ్వకాల కుట్రకు బ్రేక్ వేసింది. కానీ జీవోను రద్దు చేయకుండా ఏజెన్సీ గుండెలపై భారాన్ని అలాగే ఉంచింది. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆ జీవోను రద్దు చేస్తూ బాక్సైట్ తవ్వకాల ఆలోచనే లేకుండా చేసి గిరిజనులకు భారీ ఊరట కలిగించారు. సుజల స్రవంతికి జీవం.. ఉత్తరాంధ్ర జిల్లాల భూములను సస్యశ్యామలం చేసే కలతో మహానేత డాక్టర్ వైఎస్సార్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టారు. సబ్బవరం కేంద్రంగా నిర్మించాల్సిన ఈ ప్రాజెక్ట్ ఆయన మరణానంతరం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తొలి బడ్జెట్లోనే ఈ ప్రాజెక్ట్‌కు ఊపిరి పోసే దిశగా రూ.170.06 కోట్లు కేటాయించారు. కుల వృత్తిదారులకు వెన్నుదన్ను.. సామాజిక న్యాయం చేస్తూ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న సీఎం వైఎస్ జగన్ వివిధ కుల వృత్తిదారులకు ఆర్థికంగా కూడా వెన్నుదన్నుగా నిలిచారు. దర్జీలు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఏటా రూ.10 వేలు అందించాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 76,667 మంది రజకులు, 38,472 మంది నాయీ బ్రాహ్మణులు, 22,584 మంది దర్జీలు లబ్ధి పొందనున్నారు. గంజాయి రవాణాకు చెక్.. రాష్ట్రంలోనే గంజాయి సాగుకు జిల్లాకు రాకూడని పేరుంది. టీడీపీ హయాంలో గత ఐదేళ్లు జిల్లాలోని ఓ మంత్రే స్వయంగా గంజాయి సాగుకు తనవంతు సహకారం అందించారు. ఈ క్రమంలో ఏజెన్సీ ప్రాంతంతో పండిన గంజాయి పంట నగరంలో గుప్పుమంది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ వంద రోజుల్లో నేరుగా గంజాయి సాగు, స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపింది. రవాణాపై ఎక్కడిక్కడ నిఘా పెట్టి స్మగ్లర్లకు చెక్ పెట్టారు. సాగు చేయకుండా గిరిజన ప్రాంతాల్లో వీధి నాటికలు, బుర్రకథలు, అవగాహన సదస్సుల ద్వారా చైతన్య పరుస్తున్నారు. తద్వారా గతంలో 10 వేల ఎకరాల్లో ఉన్న గం జాయి సాగును 4 వేల ఎకరాలకు పరిమితం చేశారు. అంతేకాకుం డా దాన్ని కూడా నాశనం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. వైఎస్సార్ వైద్య కళాశాల.. మన్యానికి ప్రత్యేకం.. పాడేరు: విశాఖ మన్యంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం వైఎస్సార్ వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వైద్య కళాశాల ఏర్పాటుతో గిరిజనుల వైద్యారోగ్య సేవలకు భరోసా లభించనుంది. మన్యానికి ఇప్పటి వరకు వైద్య నిపుణులు అందుబాటులో లేరు. ఏటా గిరిజనులను అనేకమైన ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. రక్తహీనత వల్ల మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయి. మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరించడం లేదు. వైద్యుడిని చూడని గిరిజన పల్లెలు ఎన్నో ఉన్నాయి. రహదారుల సౌకర్యం, రక్షిత మంచినీరు అందుబాటులో లేని వందలాది గిరిజనులు నాటు వైద్యం, సంచి డాక్టర్లపైనే వైద్య సేవలకు ఆధారపడుతున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు వైద్య సేవలను మెరుగుపరిచేందుకు ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటు చేయనుండడంతో ఆదివాసీలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వైద్య కళాశాల ఏర్పాటుతో పాడేరు జిల్లా ఆస్పత్రికి అన్ని విభాగాల వైద్య నిపుణులు అందుబాటులోకి రానున్నారు. ఇక గిరిజనులు వైద్య సేవల కోసం కేజీహెచ్ వరకు పోవాల్సిన అవసరం ఉండదు. సీఎం వైఎస్ జగన్ పాలన అద్భుతం.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వందరోజుల పాలన అద్భుతంగా ఉంది. పేద, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పాలన సాగుతోంది. 100 రోజుల్లోనే 4 లక్షల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, ముస్లిం మైనారిటీలకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులిచ్చి అన్ని కులాలకు సమన్యాయం చేశారు. ఆశ వర్కర్ల నుంచి పారిశుధ్య కార్మికుల వరకు జీతాలు పెంచి వారికి భరోసా కల్పించారు. ప్రజలంతా వందరోజుల్లో సుఖసంతోషాలతో ఉన్నారు. అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా వంద రోజుల పాలన సాగింది. – ఎంవీవీ సత్యనారాయణ, ఎంపీ, విశాఖపట్నం చక్కని పాలనతో ఆకట్టుకుంటున్నారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన చక్కని పాలనతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా అవినీతి రహిత పాలన వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పాయి. నవరత్న పథకాల హామీలు నెరవేర్చేందుకు ఆయన నిధులు కేటాయించడంతో ప్రజలకు సంపూర్ణ నమ్మకం ఏర్పడింది. పేదలందరికీ ఏదో ఓ రూపంలో లబ్ధి చేకూర్చడం హర్షించదగ్గ విషయం. – ఎస్.చంద్రశేఖర్, అయ్యప్పనగర్ సంతృప్తినిచ్చిన వందరోజుల పాలన.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోంది. అవినీతి లేని పాలనకు ప్రాధాన్యమిస్తున్నారు. దశలవారీగా మద్యపాన నిషేధం, రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా దోపిడీని అరికట్టేందుకు ముఖ్యమంత్రి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఎంపీగా తాము పని చేస్తున్నందుకు గర్వంగా ఉంది. పార్లమెంట్లో ఎన్నో అంశాలపై మాట్లాడేందుకు అవకాశం దక్కింది. ముఖ్యంగా రైల్వే సమస్యలపై సంబంధిత శాఖామంత్రి స్పందించి కోరిన వినతులకు సానుకూలంగా సమాధానాలు పంపించారు. కీలకమైన బిల్లులపై చర్చించేందుకు అవకాశం వచ్చిందంటే అది సీఎం జగన్ చలవే. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలు ఇచ్చిన వినతులకు స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీసుకుంటున్నాం. ఇచ్చే మాటకు కట్టుబడే వ్యక్తిగా సీఎం జగన్‌కు పేరుందని చెప్పేందుకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమే ఉదాహరణ. 100 రోజుల పాలనలో ప్రజలకు చేరువవడంతో సంతోషంగా ఉంది. – బి.సత్యవతి, ఎంపీ అనకాపల్లి బాక్సైట్ తవ్వకాల రద్దు..గిరిజనులకు మేలు గత ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు అనుమతిచ్చిన 97 జీవోకు వ్యతిరేకంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడి ఆదివాసీలకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో రద్దుకు నిర్ణయం తీసుకుని గిరిజనులకిచ్చిన హామీను వెంటనే నెరవేర్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వందరోజుల పాలనలో గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశారు. – గొడ్డేటి మాధవి, ఎంపీ, అరకు -
వంద రోజుల్లో వర్గీకరణ సాధించుకుంటాం: మంద కృష్ణ
సాక్షి, న్యూఢిల్లీ: వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పై 123వ రాజ్యాంగ సవరణ జరుగుతుం దని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు కేంద్రం సానుకూలంగా ఉందని, ఆ అక్కసుతోనే కొం తమంది కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై విమర్శలు చేస్తున్నార న్నారు. ఈ నెల 20 నుంచి 5 రోజు లపాటు మేథోమధన సద స్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 20న వర్గీకరణపై భారీ బహిరంగసభ నిర్వహిస్తామని, దీనికి అన్ని పార్టీల పెద్దలను ఆహ్వానిస్తామని చెప్పారు. -
...సాకారమే మిగిలింది
-
నేటితో కేసీఆర్ సర్కారుకు వంద రోజులు
-
రంగుల కలలు.. సాకారమే మిగిలింది
-
రంగుల కలలు.. సాకారమే మిగిలింది
* నేటితో కేసీఆర్ సర్కారుకు వంద రోజులు * పాలనలో సరికొత్త పంథా.. విధాన నిర్ణయాలతో దూకుడు * ఇప్పటికీ ప్రణాళికలపైనే ప్రధానంగా కసరత్తు * తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేసే యత్నం * ప్రభుత్వం ముందు వందల ఆలోచనలు.. నిర్ణయాల అమలులో పుంజుకోని వేగం.. అన్నీ తానై వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ * అడుగడుగునా తెలంగాణ ముద్ర కోసం తపన * మంత్రులు స్వతంత్రంగా వ్యవహరించలేక పోతున్నారన్న విమర్శలు సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ర్టంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం మంగళవారంతో వంద రోజుల పాలనను పూర్తి చేసుకుంది. బంగారు తెలంగాణ లక్ష్యంగా సరికొత్త అడుగులతో ప్రయాణాన్ని మొదలుపెట్టిన టీఆర్ఎస్ ప్రభు త్వం ఇంకా ప్రణాళికల దశలోనే ఉండిపోయింది. తెలంగాణ ప్రజల్లో రేకెత్తిన కోటి ఆశలను నెరవేర్చడానికి కొంగొత్త ఆలోచనలను తెరపైకి తెస్తూ.. తొలిసారి అధికారం చేపట్టిన ఉద్యమ పార్టీ ఇప్పటికే అనేక విధాన నిర్ణయాలు తీసుకుంది. ఈ విషయంలో తెలంగాణ రథసారథిగా సీఎం కేసీఆర్ తనదైన పంథాను అనుసరిస్తున్నారు. గడచిన మూణ్నెల్లలో సర్కారు ఆలోచనా విధానం, పాలనాశైలి, భవిష్యత్ ప్రణాళికలే తెలంగాణ పునర్నిర్మాణానికి పునాదిగా నిలువనున్నాయి. అయితే ఇప్పటివరకు కేసీఆర్ సర్కారు పూర్తిగా సన్నాహాలకే పరిమితమైంది. పాలనలో తనదైన ముద్ర వేయాలని పరితపిస్తున్నప్పటికీ ఆ దిశగా వేస్తున్న అడుగుల్లో వేగం మాత్రం పుంజుకోలేదు. సీఎం కేసీఆర్ నిర్దేశించుకున్న త్రీడీ(డిఫైన్, డిజైన్, డెలివర్) పాలనా విధానంలో మొదటి రెండు దశలపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. మొత్తంగా ఈ వంద రోజుల్లో విధాన నిర్ణయాలు తీసుకోవడంలో దూకుడు ప్రదర్శించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. వాటి అమలులో మాత్రం ఆ తీరును కనబరచడం లేదు. రాజకీయ సుస్థిరతకే తొలి ప్రాధాన్యం ఇప్పటివరకు రాజకీయ సుస్థిరతకే ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి ప్రాధాన్యమిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు పాస్ మార్కులే(63 సీట్లు) రావడంతో భవిష్యత్తులో ప్రభుత్వానికి ముప్పు లేకుండా ఉండేందుకు పటిష్ట వ్యూహంతో ముందుకెళ్లారు. ఇతర పార్టీలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలను టీఆర్ఎస్లో చేర్చుకుని రాజకీయ సుస్థిరతకు ఢోకా లేకుండా చేసుకున్నారు. వలసలు, ఫిరాయింపులపై ఎన్ని విమర్శలొచ్చినా ఇతర పార్టీల స్థానిక ప్రజాప్రతినిధులనూ తనవైపునకు తిప్పుకొని స్థానిక పాలనలోనూ పట్టు సాధించడంలో కొంత వరకు కేసీఆర్ సఫలీకృతులయ్యారు. పార్టీ బలహీనంగా ఉన్న ఖమ్మం వంటి జిల్లాల్లో టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్రావు లాంటి బలమైన నేతలను టీఆర్ఎస్లోకి తీసుకురావడం ద్వారా భవిష్యత్తు భద్రత కోసం పరితపిస్తున్నట్టుగానే కనిపించింది. ఇప్పటికీ ప్రణాళికలే! తెలంగాణలో అర్హులైన వారికే సంక్షేమ పథకాలు అందిస్తామని, రాజకీయ అవినీతిని కూకటి వేళ్లతో పెకిలిస్తామని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రకటించిన కేసీఆర్.. ఈ వంద రోజుల్లో ఆ దిశగా కసరత్తు చేసేందుకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఆగస్టు 19న ఒకే రోజులో రాష్ర్టవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఇందుకు నిదర్శనం. ఇక ‘మన ఊరు - మన ప్రణాళిక ’ పేరుతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికలు రూపొందించారు. అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడానికి దాదాపు 600 మంది రెవెన్యూ అధికారులతో ఇటీవల పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించారు. తన లక్ష్యసాధనలో భాగస్వాములను చేసేందుకు సర్పంచులు మొదలు మేయర్ దాకా త్వరలో 21 వేల మంది స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణనిచ్చేందుకు కేసీఆర్ నిర్ణయించారు. రుణమాఫీ సహా కీలకమైన అనేక అంశాలన్నింటిపైనా కమిటీల పేరుతో అధ్యయానికే ప్రాధాన్యతనిచ్చారు. వంద రోజుల్లో వివిధ అంశాలపై దాదాపు 35 వరకు కమిటీలను నియమించారంటే ఏ స్థాయిలో ముందస్తు కసరత్తు జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. పాలనంతా కేంద్రీకృతం... ఇక రాష్ర్టంలో పాలన మొత్తం సీఎం కేసీఆర్ చుట్టే కేంద్రీకృతమైంది. సమావేశాలు, సమీక్షలు అన్నీ తానై నిర్వహిస్తున్న కేసీఆర్... మంత్రులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లోనూ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి సమావేశాలు, సమీక్షలు గంటల తరబడి కొనసాగుతున్నాయి. కేసీఆర్ తనకు తెలిసిన అంశాల విషయంలో అధికారులు ఎలాంటి సూచనలు, సలహాలు చేసినా పట్టించుకోకుండా.. తాను అనుకున్న విధంగా విధానాలను రూపొందించాలన్న పట్టుదల కనబరుస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. బడ్జెట్ కసరత్తు మొత్తం పూర్తయ్యాక ముఖ్యమంత్రికి వచ్చిన కొత్త ఆలోచనతో దాన్ని పక్కనపెట్టి.. టాస్క్‌ఫోర్స్ కమిటీలంటూ సలహాదారులు, నిపుణులతో అధ్యయన బృందాలను ఏర్పాటు చేసి కొత్త విధానానికి తెరలేపారు. ఇక తమ శాఖల్లో మంత్రులు స్వతంత్రంగా వ్యవహరించ లేని పరిస్థితి ఉందన్న వాదనలు వినవస్తున్నాయి. అలాగే సీఎం వద్ద సమావేశం ఉందంటూ వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులకు ఆహ్వానం అందుతోంది. సమావేశం ఏమిటో, దేనిపైనో తెలియకుండా.. వెళ్తున్న అధికారులు సీఎం చెప్పింది వినడం మినహా పెద్దగా చెప్పడానికేమీ ఉండడం లేదన్న వ్యాఖ్యలు అధికార వర్గాల్లో వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ వంద రోజుల్లో రాష్ర్ట ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలు, తీసుకున్న విధాన నిర్ణయాల అమలుపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. కత్తిరింపులపైనే దృష్టి.. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఏరివేతపైనా ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. సమగ్ర సర్వే ఉద్దేశం కూడా అదేనని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, భూ పంపిణీ, పక్కా ఇళ్లు వంటి పథకాలు అనర్హులకు చేరకుండా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం స్థానంలో ప్రవేశపెడుతున్న ఫాస్ట్(తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం) పథకం కూడా ఈ కోవలోనిదే. దాదాపు 174 ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు, పక్కా ఇళ్ల అక్రమాలపై సీఐడీ విచారణ కూడా ఆయా పథకాల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగానే రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలంగాణ ముద్ర కేసీఆర్ తన పాలనలో అడుగడుగునా తెలంగాణ ముద్ర కనిపించేలా ప్రయత్నించారు. 1956కు ముందు నుంచి తెలంగాణలో ఉంటున్నవారికే ఫీజు రీయింబర్స్మెంట్ మొదలు గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే వరకు అన్నిటా తనదైన శైలిని కొనసాగించారు. తెలంగాణ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పాఠ్యాంశాల్లో తెలంగాణ చరిత్ర కోసం కమిటీ, ప్రస్తుతమున్న బిజినెస్ రూల్స్‌లో తెలంగాణకు అనుగుణంగా సవరణలు వంటి ముఖ్యమైన నిర్ణయాలన్నింటిలోనూ తెలంగాణ ముద్రనే కనిపిస్తోంది. ఇలాంటి వందలాది ఆలోచనలతో ముందుకు వెళుతున్న కేసీఆర్ వాస్తవంలో మాత్రం వాటినింకా పూర్తి స్థాయిలో అమలులోకి తేలేకపోయారు. ఎంసెట్ అడ్మిషన్లు, రవాణా పన్ను, నంబర్ ప్లేట్ల వ్యవహారం, కళాశాలల గుర్తింపు రద్దు వంటి వివాదాస్పద నిర్ణయాలకు న్యాయస్థానాల్లో బ్రేకులు పడటం కొంత ప్రతికూలంగా మారినప్పటికీ తనదైన తెలంగాణ ముద్ర వేసే విషయంలో కేసీఆర్ రాజీపడకుండా ముందుకు వెళుతున్నారు. ఎన్నికల హామీల అమలుకే పరిమితం కాకుండా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, కళ్యాణ లక్ష్మి, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ వంటి సంక్షేమ పథకాలతో పాటు ఫార్మా, సినీ, వైద్య, విద్య వంటి ఆరు కీలక రంగాలకు సంబంధించి ప్రత్యేక పారిశ్రామిక కేంద్రాలను హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలను ప్రకటించారు. రెండు యూనివర్సిటీలకు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, ప్రొఫెసర్ జయశంకర్ పేర్లను పెడుతూ తెలంగాణ సమాజం తనకు దూరం కాకుండా చూసుకున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోణంలో కృష్ణా, గోదావరి జలాల పునఃపంపకం కోరుతూ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి.