
వంద రోజుల్లో వర్గీకరణ సాధించుకుంటాం: మంద కృష్ణ
సాక్షి, న్యూఢిల్లీ: వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పై 123వ రాజ్యాంగ సవరణ జరుగుతుం దని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు కేంద్రం సానుకూలంగా ఉందని, ఆ అక్కసుతోనే కొం తమంది కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై విమర్శలు చేస్తున్నార న్నారు. ఈ నెల 20 నుంచి 5 రోజు లపాటు మేథోమధన సద స్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 20న వర్గీకరణపై భారీ బహిరంగసభ నిర్వహిస్తామని, దీనికి అన్ని పార్టీల పెద్దలను ఆహ్వానిస్తామని చెప్పారు.