
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని గుజరాత్ స్వతంత్య్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ అన్నారు. తెలంగాణలో వెంటనే వర్గీకరణ చేపట్టాలని కోరారు. చంచల్‌గూడ జైల్లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను ఆయన బుధవారం కలిశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖ కుట్ర పన్ని మంద కృష్ణను జైల్లో పెట్టాయని, అక్రమ కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దళిత హక్కుల కోసం కృష్ణమాదిగ కష్టపడుతున్నారని అన్నారు. దళితులు ఏకమై పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. వివిధ అంశాలపై మంద కృష్ణతో చర్చించినట్లు తెలిపారు. నిరుపేద దళితులకు 3 నుంచి 5 ఎకరాల భూమి పంపిణీ చేయాలని ఆయా ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వర్గీకరణ అంశాన్ని ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్తారా.. అన్న ప్రశ్నను ఆయన దాటవేశారు.
Comments
Please login to add a commentAdd a comment