సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితులకు ఒక చట్టం.. దొరలకు మరో చట్టం నడు స్తోందని ఎమ్మార్పీ ఎస్ వ్యవస్థాపక అధ్య క్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. 21 రోజులుగా చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న మంద కష్ణకు మంగళవారం సికింద్రాబాద్ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాత్రి 9 గంటలకు విడుదలయ్యారు. దీక్ష చేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వక పోయినా ఎమ్మార్పీఎస్ కార్యాలయం వద్ద మంద కృష్ణ రెచ్చగొట్టే ప్రసంగం చేశారని పోలీసులు ఆయనను ఈనెల 2న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆయనకు బెయిల్ లభించడంతో బయటకు వచ్చా రు. ఆయన జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25న అన్ని పార్టీలతో అఖిల పక్షం సమావేశం నిర్వహించి వారి సూచనలు, సలహాల మేరకు భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.
దొరలకో చట్టం.. దళితులకో చట్టం
Published Tue, Jan 23 2018 2:21 PM | Last Updated on Sat, Jul 28 2018 6:26 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment