
హైదరాబాద్: చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. మంద కృష్ణ బావ మృతి చెందడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసింది. అంత్యక్రియలకు హాజరై తిరిగి మంగళవారం ఆయన జైలుకు రానున్నారు.