విష్ణువిశాల్‌కు జతగా మంజిమామోహన్
నటుడు విష్ణువిశాల్ మంచి జోష్‌లో ఉన్నారు. కారణం తెలిసిందే. తాను నిర్మాతగా మారి కథానాయకుడిగా నటించిన వేలైన్ను వందుట్టా వెళ్లక్కారన్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ యువ హీరో తాజా చిత్రానికి సిద్ధమయ్యారు.తనకు హీరోగా అవకాశం ఇచ్చిన దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో చాలా కాలం తరువాత నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం.
సుశీంద్రన్ ఉదయనిధి స్టాలిన్, విష్ణువిశాల్‌తో మల్టీస్టారర్ చిత్రం చేయాలని మొదట భావించారు. అయితే ఆ చిత్ర నిర్మాణం అనివార్యకార్యాల వల్ల వాయిదా పడింది.దీంతో ఇప్పుడు విష్ణువిశాల్ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మలయాళీ భామ మంజిమామోహన్‌ను నాయకిగా ఎంపిక చేశారు. ముఖ్య పాత్రలో నటుడు పార్తిబన్ నటించనున్నారు.
ఇందులో ఈయన విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. పార్తిబన్ ఇంతకు ముందు నానుమ్ రౌడీదాన్ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారన్నది గమనార్హం. ఈ చిత్ర షూటింగ్ ఆగస్ట్‌లో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించనున్నారు. చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక ప్రస్తుతం జరుగుతోందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది