విశాల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘లత్తీ’(తెలుగులో లాఠీ). రానా ప్రొడక్షన్స్ పతాకంపై నటులు నందా, రమణ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి నవ దర్శకుడు వినోద్ కుమార్ దర్శకత్వం వహించారు. నటి సునైనా నాయకిగా నటించింది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆదివారం రాత్రి చెన్నైలోని ప్రసాద్ స్టడియోలో మూవీ టీజర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు.
చదవండి: యాక్టింగ్‌కి బ్రేక్ ఇస్తున్నా.. అయితే..!: నిత్యా మీనన్
ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడు లాఠీతో దెబ్బలు తినలేదన్నారు. అయితే ఈ చిత్రం షటింగ్ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ మినహా దెబ్బలు తిననివారు లేరన్నారు. చిత్ర టీజర్‌లో ‘ఊర్లో ఉండే పోకిరీలు, పొరంబోకులు అందరూ నన్ను చంపడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరూ తప్పించుకోలేరు. రండిరా’ అని తాను చెప్పిన డైలాగు బాగా నచ్చిందన్నారు. నడిగర్ సంఘం నూతన భవనంలో కరుణానిధి, స్టాలిన్ల పేర్లను పొందుపరచాలనే కోరికను ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ వద్ద విశాల్ వ్యక్తం చేశారు.
చదవండి: చివరిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నావ్.. నీళ్లు నమిలిన విజయ్
అనంతరం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. లాఠీ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. విశాల్ కాల్ షీట్స్ కోసం తాము చాలా కాలంగా ప్రయత్నిస్తున్నామని, నందా, రమణ చాలా సులువుగా కాల్ షీట్స్ పొంది చిత్రం చేశారన్నారు. తాను విశాల్ మంచి స్నేహితులమని, కలిసే పాఠశాల, కళాశాలకు వెళ్లావారమన్నారు. ఆ సమయంలో జరిగిన విషయాలను చెప్పకూడదన్నారు. విశాల్ కలిసి చిత్రం చేయాల్సిందని అయితే అది ఇప్పటి వరకు జరగలేదనన్నారు. పోలీస్ అసిస్టెంట్ కమిషనర్‌గా, కమిషనర్‌గా అన్ని పాత్రలు పోషించి ప్రస్తుతం కానిస్టేబుల్ అయ్యారని చమత్కరించారు. విశాల్ నడిగర్ సంఘం భవన నిర్మాణాన్ని పూర్తిచేసి, త్వరగా పెళ్లి చేసుకోవాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment