lathi
-
హాస్పిటల్ బెడ్‌పై తెలుగు క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
'రాజ రాజ చోర' సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సునైన ఆస్పత్రి పాలయ్యారని తెలుస్తోంది. 2005లో కుమార్ వర్సెస్ కుమారి అనే తెలుగు చిత్రంతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది సునయన తెలుగులో సమ్‌థింగ్ స్పెషల్, 10th క్లాస్ సినిమాలు చేసింది. కాదలిల్ విడుంతేన్ అనే సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా నీర్ పార్వై సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు సైతం అందుకుంది. తమిళ బిగ్‌బాస్ 4 సీజన్లోనూ పాల్గొంది. విశాల్‌కు జోడీగా నటించి కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంటే.. తెలుగులో 'రాజ రాజ చోర' సినిమా ద్వారా క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. (ఇదీ చదవండి: నోటికొచ్చింది వాగుతున్న శివాజీ.. మళ్లీ మంచోడిలా కవరింగ్!) సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజా ఒక పోస్ట్ చేసింది. ఆ ఫోటో చూసిన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. చేతికి సెలైన్ పెట్టుకుని ఆస్పత్రి బెడ్‌పై దిగిన ఫొటోను సునైన షేర్ చేసింది. అది కాస్త నెట్టింట వైరల్ అయింది. ఆమెకు ఏమైందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. కానీ ఏ కారణం వల్ల ఆమె ఆస్పత్రిలో చేరారో తెలపలేదు. కానీ త్వరలో మరింత దృఢంగా తిరిగి వస్తానని మాత్రం చెప్పుకొచ్చింది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుతున్నారు. గతంలో హీరోయిన్ సునయన రెండు రోజులుగా కనిపించడం లేదంటూ కోలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారని ప్రచారం జరిగింది. తర్వాత అదంతా డ్రామా అని, ఒక సినిమా కోసం వాళ్లు చేసిన ఫ్రాంక్ వీడియో అని అసలు విషయం తెలిసింది. అప్పట్లో ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. అదే మాదిరి ఇప్పుడు కూడా ఏదైనా సినిమా ప్రమోషన్స్ కోసం చేస్తున్నారా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె తాజా చిత్రం ‘రెజీనా’ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది. View this post on Instagram A post shared by Sunainaa Yeellaa (@thesunainaa) -
గాంధీ వాడిన ఊతకర్ర కథ ఏమిటి? ఇప్పుడు ఎక్కడుంది?
దండి మార్చ్‌కు ముందు.. ఆ తరువాత గాంధీ ఫోటోల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఊతకర్ర. గాంధీ 1930లో దండి మార్చ్‌తో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు చేతిలో ఊతకర్ర చేరింది.ఇంతకీ ఈ ఊతకర్ర కథ ఏమిటి? దీనిని ఎవరు గాంధీకి ఇచ్చారు? 1930, మార్చి 12న తన 60 ఏళ్ల వయసులో మహాత్మా గాంధీ అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుండి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి చారిత్రాత్మక యాత్రకు బయలుదేరారు. అప్పుడు గాంధీ సహచరుడు, స్నేహితుడు కాకా కలేల్కర్ మహాత్మునికి ఊతమిచ్చేందుకు ఒక కర్ర అవసరమని భావించారు. గాంధీ సాగించే అంత సుదీర్ఘ నడకలో ఆ కర్ర ఉపయోగకరంగా ఉండవచ్చనుకున్నారు. ఈ ఊతకర్రను తీసుకుని గాంధీ 24 రోజుల పాటు ప్రతిరోజూ పది మైళ్లు నడిచేవారు. ఈ నేపధ్యంలోనే ఆ ఊతకర్రకు అంత ప్రాధాన్యత ఏర్పడింది. కాగా గాంధీ తన జీవితంలో అనేక ఊతకర్రలను ఉపయోగించారు. అయితే ఆయన దండి మార్చ్‌లో ఉపయోగించిన ఊతకర్ర ఆ ఉద్యమానికి ప్రతీకగా మారింది. ఇది గాంధీ ఊతకర్రగా ప్రసిద్ధి చెందింది. ఈ కర్ర బలంగా ఉంటుంది. 54 అంగుళాల ఎత్తు కలిగిన వెదురు కర్ర ఇది. ఈ ప్రత్యేకమైన వెదురు కర్ణాటక తీర ప్రాంతంలోని మల్నాడులో మాత్రమే పెరుగుతుంది. 1948 జనవరి 30వ తేదీ వరకు అంటే గాంధీ హత్యకు గురయ్యే వరకు ఈ ఊతకర్ర గాంధీ దగ్గరే ఉంది. ప్రస్తుతం ఈ ఊతకర్ర న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఉన్న నేషనల్ గాంధీ మ్యూజియంలో ఉంది. ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లలో పెద్దపీట? -
రాజమౌళి అంత సక్సెస్ విశాల్ అందుకోవాలి
‘‘సినిమా కథకి ఎంత బడ్జెట్ అయినా, షూటింగ్‌కి ఎన్ని రోజులు పట్టినా చేయాలనే జబ్బు విశాల్‌కి ఉంది. ఆ జబ్బు మా అబ్బాయి రాజమౌళి నుంచి విశాల్‌కి అంటుకుంది (నవ్వుతూ). రాజమౌళి ఎంత సక్సెస్ అందుకున్నాడో మంచి మనసున్న విశాల్ కూడా అంతే సక్సెస్ అందుకోవాలి’’ అని ప్రముఖ రచయిత–దర్శకుడు, రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ అన్నారు. విశాల్, సునయన జంటగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాఠీ’. రానా ప్రొడక్షన్స్ పై రమణ, నంద నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ని విజయేంద్ర ప్రసాద్ రిలీజ్ చేశారు. విశాల్ మాట్లాడుతూ– ‘‘వినోద్ కుమార్ గురించి ‘లాఠీ’ విడుదలయ్యాక సిల్వర్ స్క్రీనే చెబుతుంది. రమణ, నంద చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. నా ప్రతి సినిమాలానే ‘లాఠీ’ని ఎంత మంది చూస్తారో టికెట్‌కి రూపాయి చొప్పున రైతులకు ఇస్తాను’’ అన్నారు. ‘‘లాఠీ’ యాక్షన్ అడ్వంచర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ’’ అన్నారు వినోద్ కుమార్. ‘‘ఈ సినిమాతో విశాల్‌కి జాతీయ అవార్డు వస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రమణ. మాటల రచయిత రాజేష్ ఎ.మూర్తి, పాటల రచయిత చంద్రబోస్ పాల్గొన్నారు. -
విశాల్‌తో ఇప్పటి వరకు నటించే అవకాశం రాలేదు: ఉదయనిధి స్టాలిన్
విశాల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘లత్తీ’(తెలుగులో లాఠీ). రానా ప్రొడక్షన్స్ పతాకంపై నటులు నందా, రమణ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి నవ దర్శకుడు వినోద్ కుమార్ దర్శకత్వం వహించారు. నటి సునైనా నాయకిగా నటించింది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆదివారం రాత్రి చెన్నైలోని ప్రసాద్ స్టడియోలో మూవీ టీజర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. చదవండి: యాక్టింగ్‌కి బ్రేక్ ఇస్తున్నా.. అయితే..!: నిత్యా మీనన్ ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడు లాఠీతో దెబ్బలు తినలేదన్నారు. అయితే ఈ చిత్రం షటింగ్ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ మినహా దెబ్బలు తిననివారు లేరన్నారు. చిత్ర టీజర్లో ‘ఊర్లో ఉండే పోకిరీలు, పొరంబోకులు అందరూ నన్ను చంపడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరూ తప్పించుకోలేరు. రండిరా’ అని తాను చెప్పిన డైలాగు బాగా నచ్చిందన్నారు. నడిగర్ సంఘం నూతన భవనంలో కరుణానిధి, స్టాలిన్ల పేర్లను పొందుపరచాలనే కోరికను ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ వద్ద విశాల్ వ్యక్తం చేశారు. చదవండి: చివరిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నావ్.. నీళ్లు నమిలిన విజయ్ అనంతరం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. లాఠీ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. విశాల్ కాల్ షీట్స్ కోసం తాము చాలా కాలంగా ప్రయత్నిస్తున్నామని, నందా, రమణ చాలా సులువుగా కాల్ షీట్స్ పొంది చిత్రం చేశారన్నారు. తాను విశాల్ మంచి స్నేహితులమని, కలిసే పాఠశాల, కళాశాలకు వెళ్లావారమన్నారు. ఆ సమయంలో జరిగిన విషయాలను చెప్పకూడదన్నారు. విశాల్ కలిసి చిత్రం చేయాల్సిందని అయితే అది ఇప్పటి వరకు జరగలేదనన్నారు. పోలీస్ అసిస్టెంట్ కమిషనర్‌గా, కమిషనర్‌గా అన్ని పాత్రలు పోషించి ప్రస్తుతం కానిస్టేబుల్ అయ్యారని చమత్కరించారు. విశాల్ నడిగర్ సంఘం భవన నిర్మాణాన్ని పూర్తిచేసి, త్వరగా పెళ్లి చేసుకోవాలని అన్నారు. -
విశాల్ ‘లాఠీ’ టీజర్ లాంచ్ (ఫోటోలు)
-
విశాల్ ‘లాఠీ’ మూవీ డబ్బింగ్ స్టార్ట్
నటుడు విశాల్ కథానాయకుడి గా నటిస్తున్న తాజా చిత్రం లాఠీ. నటి సునయ ననాయికగా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ ఓరి యంటెడ్ కథా చిత్రాన్ని రాణా ప్రొడక్షన్స్ పతాకంపై విశాల్ మిత్రులు, నటులు, రమణ, నంద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వినోద్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, బాలసుబ్రమణియం ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రంలో విశాల్ చాలా కాలం తరువాత పోలీసు అధికారిగా నటిస్తున్నారు. దీనిని తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుద ల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోందని, విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1271266370.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: బజ్ క్రియేట్ చేసిన టాప్ 10 ఓటీటీ ఒరిజినల్స్ ఇవే.. -
రైతులపై విరిగిన లాఠీ
- పరిహారం కోసం కదంతొక్కిన కర్షకులు - ఓర్వకల్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర - కలెక్టరేట్‌లోనికి దూసుకెళ్లేందుకు యత్నం - లాఠీలకు పనిచెప్పిన పోలీసులు కర్నూలు(అగ్రికల్చర్): నష్ట పరిహారం కోసం ఆందోళన చేస్తున్న సోలార్ బాధిత రైతులపై పోలీసులు విరుచుక పడ్డారు. లాఠీలతో చితక బాదారు. ఒక మహిళతో సహా నలుగురు గాయపడడంతో కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.ఓర్వకల్లు మండలం గని, శకునాల గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న సోలార్ పవర్ ప్లాంట్ వల్ల భూములు కోల్పోతున్న రైతులు పరిహారం కోసం కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం ఈ రెండు గ్రామాలో రైతులతో పాటు దేవనూరు, సున్నంపల్లి, బ్రాహ్మణపల్లి, తిప్పాయిపల్లి గ్రామాల రైతులు కలిశారు. సోలార్ పవర్ ప్లాంట్ భూనిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో ఓర్వకల్లు నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వచ్చారు. వందల మంది రైతులు కలెక్టరేట్‌లోకి దుసుకెళ్లేందుకు యత్నింగా..పోలీసులు మెయిన్‌గేటు మసివేశారు. ఆగ్రహించిన రైతులు గేట్లు ఎక్కి కలెక్టర్ చాంబర్‌వైపు పరుగులు తీశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతోపాటు లాఠీలు ఝుళిపించారు. మొయిన్గేటు దాటేంతవరకు రైతులను తరిమారు.లాఠీ దెబ్బలకు నాగన్న, రామకృష్ణ, హుసేన్, రాములమ్మలు గాయపడ్డారు. లాఠీచార్జ్‌కి భయపడి పరుగులు తీయడంతో కొందరు కింద పడి స్వల్ప గాయాలపాలయ్యారు. అనంతరం రైతు సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో రైతులు మెయిన్‌గేటు దగ్గర బైఠాయించారు. జిల్లా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్ వచ్చి హామీనిచ్చినా రైతులు అంగీకరించలేదు. కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవనాధారమైన సాగు భూములను లాక్కొని పరిహారం ఇవ్వకపోతే వారు ఎలా బతకాలని రైతులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు షడ్రక్ మాట్లాడుతూ.. గని, శకునాల గ్రామాల్లో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులందరికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు భూములతో సమానంగా ప్రభుత్వం నుంచి పట్టాలు పొంది సాగు చేసుకుంటున్న భూములకు పరిహారం ఇవ్వాలన్నారు. సాగులో లేరనే సాకుతో ప్రభుత్వ పట్టా భూములకు నష్టపరిహారం ఇచ్చేందుకు నిరాకరించడం దారుణమన్నారు. రైతు సంఘాల నేతలు రమేష్, నాగేశ్వరరావు, సోమన్న, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన లాఠీదెబ్బ
–విచక్షణ రహితంగా కొట్టిన సంజామల పోలీసులు –మనోవేదనతో బాధితుడు గుర్ర ప్ప మృతి – మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువుల ఆందోళన – పచ్చనేతల సపోట్తోనే ఎస్ఐ హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని ఆరోపణ మండలంలో పోలీసుల అరాచకాలు మితిమీరాయి. అధికారపార్టీ నేతల అండతో హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా సంజామల ఎస్ఐ విజయభాస్కర్‌నాయుడు కేసులు నమోదు చేసి చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. విచక్షణ రహితంగా లాఠీతో కొట్టి ఒకరి ప్రాణం తీశారు. కానాల గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో పోలీసుల తీరుపై ప్రజల్లో నిరసన పెల్లుబికింది. సంజామల: కానాల గ్రామానికి చెందిన గుర్రప్ప (50)కు తిరుపాలు, శేఖర్ అన్నదమ్ములు. ఈ ఇద్దరి మధ్య పొలంలోని బోరు విషయంలో తగాదా నెలకొంది. ఇరువురికి సర్దుబాటు చేసే ప్రయత్నంలో గుర్రప్ప తన తమ్ముడు తిరుపాలు, అతని భార్యను మందలించాడు. ఇందుకు అతడిపై కేసు పెట్టేలా అధికారపార్టీ నేతలు గుర్రప్ప తమ్ముడిని పురమాయించారు. అన్నదమ్ముల మధ్య నెలకొన్న సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన ఎస్ఐ నేతల సిఫారసుకు పెద్దపీట వేశారు. గుర్రప్పను ఈనెల 27న స్టేషన్‌కు తీసుకొచ్చి లాఠీతో విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో కాలు వాచి నడవడానికి వీలులేని పరిస్థితి. తాను ఏ తప్పు చేయకున్నా తనను ఎస్ఐ కొట్టాడని భార్య, బంధువులు, సన్నిహితులతో చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు. రోజు చికిత్స చేయించుకుంటున్నా పోలీసులు చేసిన గాయాల మాన కపోగా నొప్పి ఎక్కువ కావడంతో మనోవేదనకు గురయ్యాడు. బాధపడుకుంటూ రాత్రి ఇంట్లో నిద్రపోయిన అతను తెల్లవారుజామున చూసే సరికి మతిచెంది ఉన్నాడు. మృతికి పోలీసుల దెబ్బలే కారణం పోలీసుల దెబ్బలకే గుర్రప్ప చనిపోయాడని భార్య నాగేశ్వరమ్మ, బంధువులు ఆరోపిస్తూ మృతదేహాన్ని పోలీస్‌స్టేçÙన్కు తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున స్టేషన్‌కు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీసీ నేత కాటసాని రామిరెడ్డి, ఎంపీపీ గౌరుగారి ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ చిన్నబాబు, మండల పార్టీ నాయకుడు బత్తుల రామచంద్రారెడ్డి, కానాల గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత పాలూరు పద్మావతమ్మ, మద్దూరు వీరశేఖర్‌రెడ్డి, బాబాపకద్దీన్ తదితరులు ఆందోళన ప్రాంతానికి చేరుకున్నారు. గుర్రప్ప మృతిని తట్టుకోలేని గ్రామస్తులు పోలీస్‌స్టేçÙన్ను ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్ఐ పోలీస్‌ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశాడు. హుటాహుటిన ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వరరెడ్డి, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, శిరువెళ్ల సీఐలు కేశవరెడ్డి, ఓబులేసు, ప్రభాకర్‌రెడ్డి, డివిజన్ పరిధిలోని ఎస్ఐలు మంజునాథ్, పులిశేఖర్, మధుసూదన్, నాగేంద్రప్రసాద్, చంద్రశేఖర్‌రెడ్డి, అధిక సంఖ్యలో పోలీసులు స్టేషన్ చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.తక్షణమే ఎస్ఐను సస్పెండ్ చేసి, సంఘటనపై న్యాయవిచారణ జరిపించాలని కుటుంబసభ్యులు, బంధువులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పట్టుబట్టారు. గుర్రప్ప మతిపై విచారించి ఎస్ఐపై చర్యలు తీసుకుంటానని డీఎస్పీ హామీవ్వడంతో వారు శాంతించారు. -
బదిలీలపై అధికారపార్టీ కర్రపెత్తనం!
సాక్షి ప్రతినిధి, కడప: ‘మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు’ అన్నట్లుగా ఉంది జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల పరిస్థితి. ఎంపీడీఓ బదిలీల్లో కర్రపెత్తనం కోసం తాపత్రయ పడుతున్నారు. జెడ్పీ పాలకమండలి చేపట్టిన బదిలీలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ప్రభుత్వంచే ఉత్తర్వులు ఇప్పించారు. అందుకు జిల్లా కలెక్టర్‌ను పావుగా వాడుకున్నారు. వెరసి జిల్లాలో 26 మంది ఎంపీడీఓల బదిలీలు నిలిచిపోయాయి. జిల్లా పరిషత్ పాలకమండలిని కోల్పోయినా, కర్రపెత్తనం కోసం తెలుగుదేశం పార్టీ నేతలు పడుతున్న తాపత్రయం అడుగడుగునా కనిపిస్తోంది. జెడ్పీ పాలకపక్షం పారదర్శకంగా చేపట్టిన ఎంపీడీఓల బదిలీలపై అధికారపార్టీ నేతలు కన్నెర్ర చేశారు. మండలాల్లో పైచేయి సాధించాలనే ఉద్దేశంతో జెడ్పీ సీఈఓ ద్వారా పైరవీలు తీవ్రతరం చేశారు. సాధ్యమైనంత వరకూ అధికారపార్టీ పెత్తనానికి అనుగుణంగా నిర్ణయాలున్నప్పటికీ, ఒకరిద్దరు ఎంపీడీఓల బదిలీల్లో ప్రతిష్టకు పోయి ఏకంగా పంచాయతీరాజ్ కమిషనర్చే బదిలీలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులిప్పించారు. తెరవెనుక చక్రం తిప్పిన మేడా.... ‘నేను ప్రభుత్వ విప్‌ను.. నేను చెప్పినట్లు ఎంపీడీఓల బదిలీలు చేయరా.. ఎలా కొనసాగిస్తారో చూస్తాను’. అంటూ పలుమార్లు సీఈఓ మాల్యాద్రిపై రాజంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఫోన్లో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన సిఫార్సు మేరకే రాజంపేట నియోజకవర్గంలో ఒంటిమిట్ట మినహా మిగిలిన మండలాల్లో ఎంపీడీఓలను నియమించినట్లు తెలుస్తోంది. అయితే సిద్ధవటం ఎంపీడీఓగా విజయకుమారి నియామకం వివాదాస్పదమైనట్లు తెలుస్తోంది. మేడా సిఫార్సు లెటర్ ఆధారంగా కడపలో నివాసం ఉంటున్న ఆయన సన్నిహితుడు పట్టుపట్టడంతో ఆమెను అక్కడ నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. అరుుతే స్థానిక మండల తెలుగుదేశం నేతలు అభ్యంతరం చెప్పారు. దీంతో దిక్కుతోచని స్థితికి చేరుకున్న ఆయన మొత్తం బదిలీల నియామకాలపైనే ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే మేడాకు రాయచోటి నియోజకవర్గంలోని ఇరువురు జెడ్పీటీసీలు తోడయ్యారు. మిమ్మల్ని నమ్మి వెంట వచ్చినందుకు ఒక ఎంపీడీఓను మార్పించలేరా? అంటూ తెలుగుదేశం పార్టీ నేతల్ని నిలదీసినట్లు తెలుస్తోంది. దాంతో మొత్తం వ్యవహారానికి చెక్ పెట్టాలనే దిశగా అధికారపార్టీ నేతలు పథక రచన చేసి సఫలీకృతులయ్యారు. కలెక్టర్ నివేదిక ఆధారంగా..... జిల్లా పరిషత్ పాలకమండలి నిర్వహించిన ఎంపీడీఓల బదిలీల్లో అక్రమాలు (మనీ అండ్ మెటీరియల్) చోటు చేసుకున్నాయని, ఇష్టారాజ్యంగా ప్రక్రియ చేపట్టారని పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్‌కు జిల్లా కలెక్టర్ కేవీ రమణ నివేదిక సమర్పించారు. అంతేకాకుండా ఐదుగురు ఎంపీడీఓలను సొంత డివిజన్లో నియమించారని తెలిపారు. కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లాలో నిర్వహించిన ఎంపీడీఓల బదిలీలను నిలుపుదల చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. ఆ మేరకు బదిలీ అయిన ప్రాంతంలో జాయిన్ కారాదంటూ సోమవారం వేకువజాము నుంచే రెవెన్యూ యంత్రాంగం ద్వారా ఎంపీడీఓల సెల్‌కు మెసేజ్‌లు, డీఆర్వో కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయి. బదిలీల ఉత్తర్వులను ప్రభుత్వం నిలిపివేసిందని, కొత్త పోస్టింగ్‌ల్లో చేరవద్దంటూ ఆదేశాలిచ్చారు. జెడ్పీ చరిత్రలో తొలిసారి.... జిల్లా పరిషత్‌లో పాలన మొత్తం పాలకమండలి నేత ృత్వంలోనే నిర్వహించాలి. ఇప్పటి వరకూ జిల్లా పరిషత్ పరిధిలోని బదిలీలను ఛెర్మైన్ నేత ృత్వంలోనే చేపట్టారు. తొట్టతొలిసారి జెడ్పీ ఛెర్మైన్ నేత ృత్వలో నిర్వహించిన బదిలీలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జెడ్పీ ఛైర్మన్ గూడూరు రవి సైతం నిబంధనలకు అనుగుణంగా, పొరుగు జిల్లాల పాలకమండలి పాటించిన విధివిధానాలను అనుసరించి బదిలీ ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. అయితే విపక్షపార్టీ పాలక మండలిలో ఉండటమే అధికారపార్టీ నేతలకు కంటగింపుగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెపైచ్చు జిల్లా ప్రథమ పౌరుడిననే విషయం కూడా పట్టించుకోకుండా తనను అవమానిస్తున్నారని స్వయంగా జెడ్పీ ఛెర్మైన్ గూడూరు రవి మీడియాకు వెల్లడించడం విశేషం. ఇప్పటికైనా పాలకులు ప్రజాస్వామ్యానికి విలువనివ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు.