ప్రాణం తీసిన లాఠీదెబ్బ
ప్రాణం తీసిన లాఠీదెబ్బ
Published Tue, Sep 6 2016 9:55 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
–విచక్షణ రహితంగా కొట్టిన సంజామల పోలీసులు
–మనోవేదనతో బాధితుడు గుర్ర ప్ప మృతి
– మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువుల ఆందోళన
– పచ్చనేతల సపోట్‌తోనే ఎస్‌ఐ హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని ఆరోపణ
మండలంలో పోలీసుల అరాచకాలు మితిమీరాయి. అధికారపార్టీ నేతల అండతో హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలే లక్ష్యంగా సంజామల ఎస్‌ఐ విజయభాస్కర్‌నాయుడు కేసులు నమోదు చేసి చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. విచక్షణ రహితంగా లాఠీతో కొట్టి ఒకరి ప్రాణం తీశారు. కానాల గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో పోలీసుల తీరుపై ప్రజల్లో నిరసన పెల్లుబికింది.
సంజామల: కానాల గ్రామానికి చెందిన గుర్రప్ప (50)కు తిరుపాలు, శేఖర్ అన్నదమ్ములు. ఈ ఇద్దరి మధ్య పొలంలోని బోరు విషయంలో తగాదా నెలకొంది. ఇరువురికి సర్దుబాటు చేసే ప్రయత్నంలో గుర్రప్ప తన తమ్ముడు తిరుపాలు, అతని భార్యను మందలించాడు. ఇందుకు అతడిపై కేసు పెట్టేలా అధికారపార్టీ నేతలు గుర్రప్ప తమ్ముడిని పురమాయించారు. అన్నదమ్ముల మధ్య నెలకొన్న సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన ఎస్‌ఐ నేతల సిఫారసుకు పెద్దపీట వేశారు. గుర్రప్పను ఈనెల 27న స్టేషన్‌కు తీసుకొచ్చి లాఠీతో విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో కాలు వాచి నడవడానికి వీలులేని పరిస్థితి. తాను ఏ తప్పు చేయకున్నా తనను ఎస్‌ఐ కొట్టాడని భార్య, బంధువులు, సన్నిహితులతో చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు. రోజు చికిత్స చేయించుకుంటున్నా పోలీసులు చేసిన గాయాల మాన కపోగా నొప్పి ఎక్కువ కావడంతో మనోవేదనకు గురయ్యాడు. బాధపడుకుంటూ రాత్రి ఇంట్లో నిద్రపోయిన అతను తెల్లవారుజామున చూసే సరికి మతిచెంది ఉన్నాడు.
మృతికి పోలీసుల దెబ్బలే కారణం
పోలీసుల దెబ్బలకే గుర్రప్ప చనిపోయాడని భార్య నాగేశ్వరమ్మ, బంధువులు ఆరోపిస్తూ మృతదేహాన్ని పోలీస్‌స్టేçÙన్‌కు తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున స్టేషన్‌కు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీసీ నేత కాటసాని రామిరెడ్డి, ఎంపీపీ గౌరుగారి ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ చిన్నబాబు, మండల పార్టీ నాయకుడు బత్తుల రామచంద్రారెడ్డి, కానాల గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నేత పాలూరు పద్మావతమ్మ, మద్దూరు వీరశేఖర్‌రెడ్డి, బాబాపకద్దీన్ తదితరులు ఆందోళన ప్రాంతానికి చేరుకున్నారు. గుర్రప్ప మృతిని తట్టుకోలేని గ్రామస్తులు పోలీస్‌స్టేçÙన్‌ను ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్‌ఐ పోలీస్‌ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశాడు. హుటాహుటిన ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వరరెడ్డి, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, శిరువెళ్ల సీఐలు కేశవరెడ్డి, ఓబులేసు, ప్రభాకర్‌రెడ్డి, డివిజన్ పరిధిలోని ఎస్‌ఐలు మంజునాథ్, పులిశేఖర్, మధుసూదన్, నాగేంద్రప్రసాద్, చంద్రశేఖర్‌రెడ్డి, అధిక సంఖ్యలో పోలీసులు స్టేషన్ చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.తక్షణమే ఎస్‌ఐను సస్పెండ్ చేసి, సంఘటనపై న్యాయవిచారణ జరిపించాలని కుటుంబసభ్యులు, బంధువులు, వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు పట్టుబట్టారు. గుర్రప్ప మతిపై విచారించి ఎస్‌ఐపై చర్యలు తీసుకుంటానని డీఎస్పీ హామీవ్వడంతో వారు శాంతించారు.
Advertisement
Advertisement