విశాల్‌ ‘లాఠీ’ మూవీ డబ్బింగ్‌ స్టార్ట్‌ | Vishal Laththi Movie Dubbing Begins | Sakshi
Sakshi News home page

Vishal Laththi: ‘లాఠీ’ మూవీ డబ్బింగ్‌ స్టార్ట్‌

Published Mon, May 16 2022 9:44 AM | Last Updated on Mon, May 16 2022 9:51 AM

Vishal Laththi Movie Dubbing Begins - Sakshi

నటుడు విశాల్‌ కథానాయకుడి గా నటిస్తున్న తాజా చిత్రం లాఠీ. నటి సునయ ననాయికగా నటిస్తున్న ఈ భారీ యాక్షన్‌ ఓరి యంటెడ్‌ కథా చిత్రాన్ని రాణా ప్రొడక్షన్స్‌ పతాకంపై విశాల్‌ మిత్రులు, నటులు, రమణ, నంద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వినోద్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని, బాలసుబ్రమణియం ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రంలో విశాల్‌ చాలా కాలం తరువాత పోలీసు అధికారిగా నటిస్తున్నారు. దీనిని తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుద ల చేయనున్నట్లు యూనిట్‌ వర్గాలు తెలిపారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుపుకుంటోందని, విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.

చదవండి: బజ్‌ క్రియేట్ చేసిన టాప్‌ 10 ఓటీటీ ఒరిజినల్స్‌ ఇవే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement