ఎంత పెద్ద మనసు ఆ చిన్నారులది: వీడియో వైరల్‌ | Viral Video: Two Children Assisting Woman In Pushing Her Cart | Sakshi
Sakshi News home page

Viral Video: ఎంత పెద్ద మనసు ఆ చిన్నారులది!

Published Wed, Aug 10 2022 9:23 PM | Last Updated on Thu, Aug 11 2022 8:12 AM

Viral Video: Two Children Assisting Woman In Pushing Her Cart - Sakshi

మనలో చాలామంది చక్కగా అవతలి వాళ్లకు ఉచిత సలహలు, సూచనలు ఇచ్చేస్తారే తప్ప చేతల వరకు వచ్చేట్టేప్పటికి శూన్యం. అయినా సాయం చేయాలంటే డబ్బులుండాలి అనుకుంటారు గానీ మనకు చేతనైనంతలో ఏ చిన్న పని  సాయం చేసిన చాలు. దానికి డబ్బులతో పనిలేదు. కనీసం రోడ్డు మీద ఇబ్బంది పడుతున్న ఏ వ్యక్తి కైనా, ప్రమాదం బారిన గాయపడిన వ్యక్తి నైన కాస్త మంచినీళ్లు అందించో లేక చేయి అందించో సాయం చేసిన చాలు. కానీ చేయం పైగా మన కళ్ల ముందే ఇబ్బందిపడుతూ కనిపించిన మనకెందుకులే అని వెళ్లిపోతుంటారు. కానీ ఇద్దరు చిన్నారులు అందరిలా కాకుండా సాయం అందించి తమ పెద్ద మనసును చాటుకున్నారు.

వివరాల్లోకెళ్తే...రోడ్డు పై అరటిపళ్లు అమ్ముకునే ఒక మహిళ ఉంటుంది. ఆమె అరటిపళ్ల తోపుడు బండి పై పెట్టుకుని తోసుకుంటూ వెళ్తుంటుంది. ఐతే ఇంతలో ఆ బండి ఒక చోట కదలదు ఆ రోడ్డు బాగా ఎత్తుగా ఉంటుంది. ఆమె ఉన్నవైపు రోడ్డు పల్లంగా ఉండటంతో పైకి తొయ్యడం కష్టంగా ఉంటుంది. బండిమీద ఉన్న అరటిపళ్లు బరువుకి ముందుకి వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తుంటుంది.

దీంతో ఆమె చాలా ఇబ్బంది పడుతుంటుంది. పైగా మరోవైపు మంచి ఎండగా ఉండటంతో చెమటులు పట్టేసి బండిని తొయ్యలేక నానా అవస్తలు పడుతోంది. కనీసం రోడ్డు పై వెళ్తున్న పాదాచారులు గానీ, వాహన దారులుగానీ ఎవ్వరు సాయం చేసేందుకు ముందుకు రారు. ఐతే ఇంతలో అటుగా వెళ్తున​ ఇద్దరు చిన్నారులు ఈ మహిళ వద్దకు వచ్చి ఆ బండిని తోసి సాయం అందించారు.

దీంతో ఆమె ఒక్కసారిగా ఆనందపడి ఆ చిన్నారులిద్దరికి చెరోక అరటి పండు ఇస్తుంది. వారు కూడా ఆనందంగా తీసుకుని వెళ్లిపోతారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మీరు కూడా ఓలుక్కేయండి.

(చదవండి: ఆనంద్‌ మహింద్ర మనసు దోచిన 'కప్పు':ఫోటో వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement