భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి ఇంట్లో పనిచేసే ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నగరానికి చెందిన జీవన్ (25) జోషి ఇంట్లో పని చేస్తుంటాడు.
అతడు శుక్రవారం నాడు జోషి ఇంట్లోని సర్వెంట్ క్వార్టర్స్లో గల కిటికీకి ఉరేసుకుని చనిపోయాడు. అతడు రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తానేం చేస్తున్నానో తనకే తెలియదని అందులో అతడు రాసినట్లు పోలీసులు తెలిపారు. గత రెండేళ్లుగా జోషి ఇంట్లో జీవన్ పనిచేస్తున్నాడు.
మురళీ మనోహర్ జోషి పనిమనిషి ఆత్మహత్య
Published Sat, Sep 21 2013 12:05 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement