
సాక్షి, అమరావతి : ఈ ఏడాది జూలైలో నిర్వహించిన అర్చక పరీక్షకు సంబంధించిన ఫలితాలను మంత్రి వెల్లంపల్లి శ్రీనావాస్ గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘనతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కమిషనర్ పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. మొత్తం 7687 మంది అభ్యర్థులకు గానూ 4396 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. కాగా, పరీక్షలో ఫేయిలయిన వారికి సప్లిమెంటరీ నిర్వహిస్తామని వెల్లడించారు. 2013 తర్వాత రాష్ట్రంలో అర్చకులకు పరీక్షలు నిర్వహించలేదని , ఇక మీద ప్రతి ఏటా అర్చకులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అంతేగాక జగన్ ముఖ్యమంత్రి కాగానే అర్చకులకు పరీక్షలు నిర్వహించాలని సూచించినట్లు గుర్తుచేశారు. ఈ అర్చక పరీక్షల ద్వారా విదేశాల్లో విరివిగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడించారు. అర్చకత్వం చేసుకునేవారికి పట్టా లభించడంతో పాటు ఉద్యోగాలు పర్మినెంట్ అయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment