ఎంతైనా ఖర్చు పెట్టమని సీఎం చెప్పారు.. | Ministers Kannababu and Vellampalli Srinivas Examine Arrangements at Vijayawada Durga Temple | Sakshi
Sakshi News home page

దసరా ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రుల పరిశీలన

Published Fri, Sep 27 2019 12:32 PM | Last Updated on Fri, Sep 27 2019 1:42 PM

Ministers Kannababu and Vellampalli Srinivas Examine Arrangements at Vijayawada Durga Temple - Sakshi

సాక్షి, విజయవాడ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఇబ్బండి కలుగకుండా ఎంత ఖర్చైనా పెట్టి సౌకర్యాలు కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి ఆదేశించారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అలాగే ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా చూడాలని కోరారన్నారు. శుక్రవారం ఆయన... దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి దుర్గగుడిలో ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ఐదవ తారీఖు మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. పోలీస్‌, శానిటేషన్‌, గుడి సిబ్బంది, ఫైర్‌ సిబ్బందితో కలిసి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

125 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మోడల్‌ గెస్ట్‌ హౌస్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్‌ నిబంధనల అమలుతో పాటు వరదనీరు ఎక్కువగా ఉండడంతో ఘాట్లలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్లు తనిఖీ చేసిన తర్వాతే భక్తులకు ఆహార పదార్ధాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. సామాన్య భక్తుల శీఘ్ర దర్శనం కోసం ఈసారి విఐపి పాసులను కుదించినట్టు కన్నబాబు తెలిపారు. మరోవైపు ఉత్సవాల నాటికి చేస్తున్న పనులన్నీ పూర్తవ్వాలని సోమా కంపెనీని ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ మున్సిపల్ కమీషనర్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గగుడి ఈవో పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement