dhassara
-
దసరా ఉత్సవాల దృష్ట్యా దుర్గగుడి ఆలయ కమిటీ నిర్ణయాలు
సాక్షి,విజయవాడ: దసరా ఉత్సవాలు విజయవాడలో ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడి కూడా అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దుర్గగుడి ఆలయ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా టైం స్లాట్ ప్రకారమే దర్శనాలు ఉంటాయని తెలిపింది. రోజుకు 10 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉన్నట్లు పేర్కొంది. భక్తుల ఉచిత దర్శనాల కోసం 2 క్యూలైన్లు ఏర్పాటు చేయగా, ఆన్లైన్లో టైం స్లాట్ ప్రకారం రూ.100, రూ.300 దర్శన టికెట్లు అందుబాటులో ఉంచునుంది. కాగా ఆన్లైన్ టికెట్ల కోసం http://aptemples.ap.gov.in వెబ్సైట్ ఏర్పాటు చేశారు. చదవండి: ఆయనే విద్యార్థి.. ఆయనే గురువు -
ఎంతైనా ఖర్చు పెట్టమని సీఎం చెప్పారు..
సాక్షి, విజయవాడ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఇబ్బండి కలుగకుండా ఎంత ఖర్చైనా పెట్టి సౌకర్యాలు కల్పించాలని సీఎం వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి ఆదేశించారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అలాగే ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా చూడాలని కోరారన్నారు. శుక్రవారం ఆయన... దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి దుర్గగుడిలో ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ఐదవ తారీఖు మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. పోలీస్, శానిటేషన్, గుడి సిబ్బంది, ఫైర్ సిబ్బందితో కలిసి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. 125 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మోడల్ గెస్ట్ హౌస్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నిబంధనల అమలుతో పాటు వరదనీరు ఎక్కువగా ఉండడంతో ఘాట్లలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేసిన తర్వాతే భక్తులకు ఆహార పదార్ధాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. సామాన్య భక్తుల శీఘ్ర దర్శనం కోసం ఈసారి విఐపి పాసులను కుదించినట్టు కన్నబాబు తెలిపారు. మరోవైపు ఉత్సవాల నాటికి చేస్తున్న పనులన్నీ పూర్తవ్వాలని సోమా కంపెనీని ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ మున్సిపల్ కమీషనర్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గగుడి ఈవో పాల్గొన్నారు. -
అత్తారింట్లో పండుగ చేసుకున్న అల్లు అర్జున్
-
అత్తారింట్లో పండుగ చేసుకున్న అల్లు అర్జున్
నల్లగొండ: ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉండే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..దసరా పండుగకు బ్రేక్ తీసుకున్నాడు. బన్నీ ఈసారి దసరా పండుగను ఈ సారి తన అత్తగారి ఊళ్లో జరుపుకున్నాడు. స్నేహారెడ్డి అమ్మమ్మ స్వగ్రామం నల్లొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లికి కుటుంబ సమేతంగా వెళ్లాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ..అల్లు అర్జున్ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదల అయిన రుద్రమదేవి సినిమాలోని గోన గన్నారెడ్డి పాత్ర డైలాగ్స్ చెప్పాలంటూ గ్రామస్తులు కోరగా... డైలాగ్స్ వినిపించి వారి ముచ్చట తీర్చాడు. అలాగే పలువురు బన్నీతో సెల్పీలు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా వారిని అదుపు చేయటానికి స్నేహారెడ్డి కుటుంబసభ్యులు కష్టపడాల్సి వచ్చింది. -
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతీ ఒక్కరూ అత్యంత ఆనందంతో పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ సీఎంవో ఈ మేరకు ట్విట్టర్లో ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కేసీఆర్ ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లనున్నారు. సూర్యాపేట నుంచి కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ లో వెళతారు. ఆయనతో పాటు ముగ్గురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.