అత్తారింట్లో పండుగ చేసుకున్న అల్లు అర్జున్ | Hero Allu Arjun celebrates Dhassara at mother-in-law's native place | Sakshi
Sakshi News home page

అత్తారింట్లో పండుగ చేసుకున్న అల్లు అర్జున్

Published Fri, Oct 23 2015 12:23 PM | Last Updated on Sun, Sep 3 2017 11:22 AM

అత్తారింట్లో పండుగ చేసుకున్న అల్లు అర్జున్

అత్తారింట్లో పండుగ చేసుకున్న అల్లు అర్జున్

నల్లగొండ: ఎప్పుడూ షూటింగ్లతో బిజీ బిజీగా ఉండే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..దసరా పండుగకు బ్రేక్ తీసుకున్నాడు. బన్నీ ఈసారి దసరా పండుగను ఈ సారి తన అత్తగారి ఊళ్లో జరుపుకున్నాడు. స్నేహారెడ్డి అమ్మమ్మ  స్వగ్రామం నల్లొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లికి కుటుంబ సమేతంగా వెళ్లాడు.

ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ..అల్లు అర్జున్ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.  ఈ సందర్భంగా ఇటీవల విడుదల అయిన రుద్రమదేవి సినిమాలోని గోన గన్నారెడ్డి పాత్ర డైలాగ్స్ చెప్పాలంటూ గ్రామస్తులు కోరగా... డైలాగ్స్ వినిపించి వారి ముచ్చట తీర్చాడు. అలాగే పలువురు బన్నీతో సెల్పీలు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా వారిని అదుపు చేయటానికి స్నేహారెడ్డి కుటుంబసభ్యులు కష్టపడాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement