
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ఆయుష్ విభాగం అర్సానిక్ ఏఎల్బీ 30 హోమియో మందుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. కేబీఎన్ కాలేజీలో రాష్ట్ర దేవదాయశాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మందుల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ.. హోమియో మందుల వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందన్నారు.
కరోనా రాకుండా నిలువరించే శక్తి హోమియో మందులకు ఉంటుందని వెలంపల్లి తెలిపారు. ప్రతీ ఒక్కరూ హోమియో మందులను తప్పకుండా వాడాలని సూచించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవటంతో పాటు రాకుండా నిరోధించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.