కాల్మనీ కేసులను సీఐడీకి అప్పగించాలని బీజేపీ నేతలు దాసం ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
విజయవాడ: కాల్మనీ కేసులను సీఐడీకి అప్పగించాలని బీజేపీ నేతలు దాసం ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం వారిద్దరూ విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.
కాల్మనీ కేసుల పేరుతో పోలీసులు సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాల్మనీ కేసులపై అవసరమైతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు.