Call Money Cases
-
కాల్‌మనీ కేసుల్లో రూ.700 కోట్ల వ్యాపారం
సాక్షి, అమరావతి: కాల్‌మనీ కేసుల్లో మొత్తం రూ. 700 కోట్ల వ్యాపారం జరిగిందని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. శాసన మండలిలో కాల్ మనీ కేసులకు సంబంధించిన అడిగిన ప్రశ్నకు ఆమె మంగళవారం సమాధానమిచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 కాల్ మనీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. విజయవాడలో 14, పశ్చిమ గోదావరిలో మూడు, కడపలో ఒక కేసు నమోదైనట్టు వివరించారు. విజయవాడలో ఈ కేసులకు సంబంధించి మొత్తం 30 మందిని అరెస్టు చేశామన్నారు. వీరిలో ఏడుగురిపై రౌడీషీటు ఓపెన్ చేసినట్టు తెలిపారు. కాల్ మనీ వ్యవహారానికి వ్యతిరేకంగా గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం కాల్ మనీ కేసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. బీసీల కోసం 139 కార్పొరేషన్లు వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం మొత్తం 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌నారాయణ తెలిపారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా వెనుకబడిన కులాలకు సంబంధించిన అనేక మంది తమ సమస్యలు తెలుసుకున్నారని, వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర నూతన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో శాసనమండలి రేపటికి వాయిదా పడింది. శాసన మండలి సభ్యులు గవర్నర్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. -
కాటేస్తున్న ‘కాల్’నాగులు
అధికార పార్టీ అండ చూసుకుని ఉయ్యూరులో ‘కాల్’ నాగులు రెచ్చిపోతున్నారు.. అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులిచ్చి ముక్కుపిండి మరీ వసూలు చేస్తూ ప్రజల రక్తం పీలుస్తున్నారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ వికృత ఉదంతాలకు ప్రధాన కేంద్రంగా నిలిచిన పెనమలూరు నియోజకవర్గంలోనే మళ్లీ ఈ దందా ఊపందుకుంటోంది. అప్పట్లో ఈ వ్యవహారంలో ఈప్రాంత ప్రజాప్రతినిధి పేరు బాహాటంగా వినిపించడంతో సైలెంట్ అయిన ఆయన ఇప్పుడు అనుచరులతో దందాలు నడిపిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి... కృష్ణా, ఉయ్యూరు: ఉయ్యూరులో కాల్ నాగులు కాటేస్తున్నాయి. అధికార పార్టీ ముసుగులో దందా సాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఖాళీ ప్రామిసరీ నోట్లు.. తనఖాలు.. సేల్ డీడ్లు.. పెట్టుకుని వడ్డీలు కట్టలేక, తనువ చాలించేందుకు సిద్ధపడుతున్నా కనికరం లేకుండా తమ వద్ద ఉన్న ఆధార పత్రాలతో ఆస్తులను దిగమింగుతున్నారు. విజయవాడలో కాల్‌మనీ కలకలం కనుమరుగవ్వక ముందే ఉయ్యూరులో కాల్‌మనీ బాధలతో టెలీఫోన్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి రాంబాబు కుమార్తె ప్రశాంతి చెప్పిన పేర్లు, పోలీసులకు రాసిచ్చిన ఫిర్యాదులో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఒకప్పటి అనుచరుడు, ప్రస్తుతం ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఏఎంసీ మాజీచైర్మన్ వల్లభనేని నాని ముఖ్య అనుచరుడు ఏఎంసీ వైస్‌చైర్మన్‌గా ఉన్న జరగోతు నాగరాజుతో పాటు కొందరి టీడీపీ నేతల పేర్లు ఉండటంతో కాల్ మనీలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల బండారం మరోసారి బట్టబయలైంది. టీడీపీ నేతల దందాపైనే సర్వత్రా చర్చ నడుస్తుంది. నూటికి రూ.20 వడ్డీ.. ఉయ్యూరు పట్టణం కేంద్రంగా వడ్డీ వ్యాపారం జోరుగా జరుగుతుంది. నూటికి ఏకంగా రూ.10ల నుంచి రూ.20ల వరకు నూటికి వడ్డీలు వసూలు చేస్తూ పేదలు, వ్యాపారులు, ఉద్యోగుల సొమ్ము కొల్లగొట్టేస్తున్నారు. దాదాపు 50 మందికిపైగా వడ్డీ వ్యాపారులు పట్టణంలో వ్యాపారం సాగిస్తూ కోట్లు గఢించారు. వీరిలో 20 మంది నలుగురు ముగ్గురు కలిసి ఒక సిండికేట్‌గా ఏర్పడి కాల్‌మనీకి డబ్బులిచ్చి సెక్యూరిటీ కింద ఆస్తుల్ని సేల్ డీడ్ చేయించుకుంటున్న భయానక పరిస్థితి. వడ్డీకి తీసుకున్న ఏ వ్యక్తి అయినా సరే జీవితాంతం వడ్డీ తీర్చడంతోనే సరిపోతుంది. ఎన్నేళ్లు చూసినా అసలు అలాగే మిగిలిపోతుంది. కొంతమంది అధికార పార్టీలో ముఖ్యనేతలకు వడ్డీ వ్యాపారులు నజరానాలు ముట్టచెబుతూ తమ అక్రమ సామ్రాజ్యానికి అడ్డంలేకుండా దారులు వేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈకాల్ నాగుల వెనుక టీడీపీలోని ఒకరిద్దరు ముఖ్యనేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. పోలీసులకు కూడా నెలవారీ మామూళ్లు ముట్టచెబుతూ ప్రసన్నం చేసుకుంటుండబట్టే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మరకలు అంటకుండా..! కాల్‌మనీ వ్యవహారం వేడెక్కడంతో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌లు తీవ్రంగా స్పందించారు. పోలీస్ అధికారులకు ఫోన్‌చేసి ఎవరు కాల్‌మనీ దందాకు పాల్పడినా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసులు పెట్టి అరెస్టు చేయాలని ఆదేశించారు. కాగా, కాల్‌మనీ మరకలు తమకు అంటకుండా ఉండేందుకే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పోలీసులకు ఆదేశాలు ఇచ్చారే తప్ప, చిత్తశుద్ధి లేదని ప్రజలు, ప్రతిపక్ష నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
నెల్లూరులో కాల్ మని కేసులు
-
కాల్‌మనీ కేసులు.. కొత్త రూటు!
విజయవాడ : కాల్‌మనీ కేసులు కొత్త రూట్లోకి మళ్లుతున్నాయి. ఇప్పటి వరకు పోలీసులు కాల్‌మనీ కేసుల్లో నిందితులకు చుక్కలు చూపించారు. ఇప్పుడు రివర్స్‌లో నిందితులు టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా డబ్బులు వసూలు చేశారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి తీవ్రత పెరిగి మళ్లీ కాల్‌మనీ కేసులు చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాల క్రమంలో కొత్త లాబీయింగ్ మొదలైంది. అటు పోలీసులకు, ఇటు కాల్‌మనీ నిందితులకు మధ్యే మార్గంగా వారి మధ్య సయోధ్య కుదర్చటానికి ఒక మహిళ రంగంలోకి దిగింది. దీంతో కాల్‌మనీ కేసుల్లో కొత్త లాబీయింగ్ షురూ అయింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, హైదరాబాద్ స్థాయి ఉన్నతాధికారులకు సుపరిచితమైన ఈ మహిళ ఈ వ్యవహారంలో చక్రం తిప్పే యత్నాల్లో నిమగ్నమైనట్లు సమాచారం. ముఖ్యంగా నిందితుల నుంచి పోలీసులపై ఫిర్యాదు రూపంలో ఒత్తిడి రాకుండా ఉండటానికి, పోలీసుల నుంచి నిందితులపై ఒత్తిడి రాకుండా ఉండటానికి బలమైన కసరత్తు సాగుతోంది. గత ఏడాది డిసెంబర్లో కాల్‌మనీ - సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది తీవ్ర సంచలనంగా మారిన క్రమంలో ప్రభుత్వాన్ని కూడా కొంత ఇరకాటంలో పడేసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసు విషయంలో సీరియస్‌గా స్పందించారు. వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పలువురు కీలక నిందితులు చాలా కాలం తర్వాత లొంగిపోయారు. నిందితుల్లో ఒకరైన వెనిగళ్ల శ్రీకాంత్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఈ క్రమంలో గతంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన కానిస్టేబుల్ పొట్లూరి రమేష్‌ను ఇటీవల అవినీతి ఆరోపణలతో సస్పెండ్ చేశారు. దీంతో రమేష్‌ను, టాస్క్‌ఫోర్స్ ఏసీపీని లక్ష్యంగా చేసుకుని పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్‌కు వరుస ఫిర్యాదులు అందాయి. దీనిపై పోలీసుల విచారణ కూడా కొనసాగుతోంది. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొంత ఇరకాటంలో పడ్డారు. మరికొందరు బాధితులు కూడా ఫిర్యాదులకు సిద్ధమైనట్లు సమాచారం. సయోధ్య కోసం... పోలీసులపై వరుస ఫిర్యాదులు రావటం మంచి పరిణామం కాదనే ఉద్దేశంతో పలువురు అధికారులు.. పోలీసులతో వ్యవహారం తమకే ఇబ్బందనే ఉద్దేశంతో కాల్ మనీ నిందితులు.. సయోధ్య యత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. అందులో భాగంగానే మధ్యే మార్గంగా పరిష్కారం చేయటానికి అందరికీ ‘కావాల్సిన’ సదరు మహిళను రంగంలోకి దించినట్లు తెలి సింది. గతంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసి ప్రస్తుతం స్టేషన్ సీఐగా విధుల్లో ఉన్న అధికారితో ఈ వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం. కాల్‌మనీ కేసుల్లో ఉన్న నిందితులకు ఇబ్బంది కలగించకుండా చూడాలని, తాను హైదరాబాద్ స్థాయిలో ఉన్న అధికారులతో కూడా మాట్లాడానని సహకరించాలని కోరి సదరు మహిళ కొంత మొత్తం ముట్టజెప్పినట్లు తెలిసింది. ప్రజాశక్తి నగర్లో ఒక అపార్టుమెంట్లో ఉండే సదరు మహిళ సీఐతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కబెడుతున్నట్లు సమాచారం. కాల్ కేసుల్లో కీలక నిందితులు, కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న అధికార పార్టీ నేతలకు ఇబ్బంది రాకుండా చూసుకోవటమే ఎజెండాగా ఆమె పనిచేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
'కాల్‌మనీ కేసులను సీఐడీకి అప్పగించాలి'
విజయవాడ: కాల్‌మనీ కేసులను సీఐడీకి అప్పగించాలని బీజేపీ నేతలు దాసం ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం వారిద్దరూ విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. కాల్‌మనీ కేసుల పేరుతో పోలీసులు సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాల్‌మనీ కేసులపై అవసరమైతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. -
‘కాల్’కేయులపై ఖాకీచకులు!
►కేసుల్ని అనువుగా మార్చుకుంటున్న పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నా కేసుల నమోదులో తాత్సారం ► పెరుగుతున్న కాల్‌మనీ కేసులు ► చట్టం ముసుగులో దందా ఇటీవల ఓ పోలీస్ అధికారి వాహనం జాతీయ రహదారిపై వెళ్తోంది. ఓ మద్యం ప్రియుడు ఆ.. వాహనానికి అడ్డుతగిలాడు. వెంటనే ఆ అధికారి మద్యం సేవించి రోడ్లపై చిందులేసే వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. తాగుబోతుల నుంచి ఇబ్బందుల్లేకుండా చేయాలన్న ఆలోచన మంచిదే అయినప్పటికీ ఆ సంఘటనను కిందిస్థాయి సిబ్బంది అనువుగా మార్చుకున్నారు. మందుబాబుల నుంచి భారీ వసూళ్లకు పాల్పడ్డారు. చట్టం పేరిట బెదిరింపులకు పాల్పడిన ఈ సంఘటన ఆ ఉన్నతాధికారినే ఆశ్చర్యపోయేలా చేసింది. దీంతో మందుబాబుల్ని ఏమీ అనొద్దని సిబ్బందికి చెప్పాల్సి వచ్చింది. జిల్లాలోని కొన్ని చోట్ల తెల్లకాగితాలపై ముందస్తు సంతకాలు తీసుకుని బాధితులు, ఫిర్యాదీల మధ్య తగాదాలు సెటిల్ చేసే పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారి గుర్తించారు. సివిల్ తగాదాల జోలికి వెళ్లొద్దని, చాలా కేసుల్లో సీఆర్పీసీ సెక్షన్ 41ను దుర్వినియోగం చేస్తున్నారని తేల్చారు. నిందితులకు ఏడేళ్లు దాటి జైలు శిక్ష పడే కేసుల్లోనూ సిబ్బంది అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని గుర్తించి సున్నితంగా హెచ్చరించారు. అనంతరం సిబ్బంది కూడా ఆ చర్యల్నీ తమకు అనువుగా మార్చుకుని జేబులు నింపుకునే పనిలో పడ్డారు. మళ్లీ అధికారి హెచ్చరించాల్సి వచ్చింది. తాజాగా రాష్ట్రాన్ని వణికించేస్తున్న కాల్‌మనీ-సెక్స్ ర్యాకెట్‌పై కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల్నీ సైతం జిల్లా పోలీసులు తమకు కావాల్సిన విధంగా మార్చేసుకుంటున్నారనే ఆరోపణలువస్తున్నాయి. వడ్డీ వ్యాపారులు, చిట్‌ఫండ్ నిర్వహకులు, ఫైనాన్షియర్లు నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారాలు చేసేవారిపై ఉక్కుపాదం మోపాలన్నది ప్రభుత్వ ఆలోచన. విజయవాడలో వెలుగుచూసిన కాల్‌మనీ సంఘటన రాాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పోలీసులు అనుమానం వచ్చినందరిపైనా విచారణ కొనసాగిస్తున్నారు. దీనివల్ల సాధారణ వడ్డీ తీసుకుంటున్నవారూ ఇబ్బంది పడాల్సివస్తోంది. సరిగ్గా ఇదే పోలీసులకు జేబులు నింపే వనరుగా మారింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నిబంధనల ప్రకారం ఏడేళ్లు దాటి శిక్ష పడే కేసుల్లోని నిందితులపైనే గట్టిచర్యలు తీసుకోవాల్సి ఉండగా పోలీసులు కొన్ని చోట్ల హద్దు మీరుతున్నారు. ఆయా ప్రాంతాల్లోని వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నవారి జాబితాను సేకరించి కేసుల పేరిట వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 10 కేసులు నమోదయ్యాయి. చాలా చోట్ల వ్యాపారుల ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. వాళ్లందరూ స్టేషన్‌కు రావాలంటూ హుకుం జారీచేయడం, ఫిర్యాదులొస్తే కేసులు పెట్టడం, కొందరికి వెంటవెంటనే బెయిల్ రావడం, మరికొందరికి రాకపోవడం వెనుక సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రభుత్వం, ఉన్నతాధికారులూ ఊరుకోవడం లేదని, తమకు అంతో ఇంతో ఇస్తే చర్యలు లేకుండా చూస్తామంటూ జేబులు నింపుకునే పనిలో కొంతమంది ఖాకీలు పడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. చర్యలపైనా అనుమానాలు విజయవాడ తరహా ఎక్కడా కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ ఉదంతాలు జిల్లాలో లేవు. అయినప్పటికీ ఆర్బీఐ నిబంధనల మేరకు అప్పు తీసుకున్నవారి నుంచి ప్రామిసరీ నోట్లు, సంతకాలతో కూడిన ఖాళీ కాగితాలు, స్టాంప్ పేపర్లు ఉండకూడదంటూ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ప్రజల్ని అప్రమత్తం చేయడం గానీ, కాల్‌మనీ వ్యవహారంపై చట్టం-శిక్ష గుర్చి అవగాహన కల్పించడం గానీ జరగలేదు. అసలు కాల్‌మనీ అంటే ఏమిటి? ఏఏ సెక్షన్లు నమోదు చేయాలి, నిందితులపై తీసుకునే చర్యలేంటనే విషయమై పోలీసులు ఎక్కడా చైతన్య కార్యక్రమాలు నిర్వహించలేదు. ఇదే విషయాన్ని పోలీసు సిబ్బంది ఆసరాగా తీసుకుని చిన్నచిన్న వడ్డీ వ్యాపారుల్ని వేధిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అజ్ఞాతంలోకి వ్యాపారులు కాల్‌మనీ పేరిట పోలీసులు వేధింపులకు పాల్పడడం, ఎక్కడ తమపై దాడులు చేస్తారేమోనని భయపడి చాలామంది వడ్డీ వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బకాయి వసూళ్లకూ రోడ్లమీదకు రావడం లేదు. ఇళ్లకు తాళాలు వేసేసి మరీ బయట ప్రాంతాల్లో తలదాచుకునేందుకు సిద్ధమైపోయారు. దీనివల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. కాగా, కాల్‌మనీ పేరిట వేధింపులకు పాల్పడుతున్నవారిపై చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చెబుతున్నా సిబ్బంది పట్టించుకోకుండా వ్యాపారులను స్టేషన్‌కు పిలిపించడం, విచారించడం, కాల్‌మనీ కేసులు పెడతామని బెదిరించడం వంటివి చేస్తున్నారు. ఇందుకోసం వేల రూపాయలు చేతులు మారుతున్నట్టు పోలీసు శాఖలోని కొంతమంది సిబ్బంది చెబుతున్నారు. ఉపేక్షించేది లేదు చట్టాన్ని అతిక్రమించేవారిపై కేసులు తప్పవు. కాల్‌మనీ పేరిట సిబ్బంది దందా చేస్తే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరికైనా అనుమానాలొస్తే నేరుగా నన్నుగాని, లేదా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్‌మనీ సెంటర్‌ను ఆశ్రయించవచ్చు. అత్యవసర పరిస్థితిలో అత్యవసర విభాగం నెంబర్ 100కు కాల్ చేయవచ్చు. అక్రమాలకు పాల్పడే సిబ్బందిపై చర్యలు తప్పవు. ఎ.ఎస్.ఖాన్. జిల్లా ఎస్పీ. -
కాల్‌యముళ్లను ఉపేక్షించం
మహిళలు, ఆడపిల్లలను వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ హెచ్చరించారు. కాల్‌మనీ కేసులు గుంటూరులో బయటపడితే ఊరుకోబోమని పేర్కొన్నారు. బుధవారం గుంటూరులోని తన కార్యాలయంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు.. - సాక్షి, గుంటూరు సాక్షి : పోలీస్ సిబ్బంది కొరత వల్ల అధికారులు, సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. కొరత ఏ మేరకు ఉంది? ఎప్పటిలోగా భర్తీ చేస్తారు? ఐజీ : రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది కొరత ఎక్కువగా ఉన్నమాట వాస్తవమే. గుంటూరు రేంజ్ పరిధిలో ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సుమారు 13 నుంచి 18 శాతం సిబ్బంది కొరత ఉంది. కొత్త సంవత్సరంలో సిబ్బంది కొరత తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సాక్షి : గుంటూరు రేంజ్ పరిధిలో కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదనలు ఏమయ్యాయి? ఐజీ : గుంటూరు రేంజ్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కడెక్కడ నూతన పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నాం. జనాభా, నేరాల సంఖ్య ఆధారంగా నూతన పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా జాగ్రత్త పడుతున్నాం. సాక్షి : తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు ఎంతవరకు వచ్చింది? ఐజీ : తుళ్లూరు నూతన పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, 674 పోస్టులు కొత్తగా మంజూరు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఫైనాన్స్ డిపార్టుమెంట్ అనుమతులు రాలేదు. దాదాపు వచ్చే నెలలో దీనికి పూర్తిస్థాయిలో అనుమతులు వస్తాయని భావిస్తున్నాం. సాక్షి : రాజధాని పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు ఎంతవరకు వచ్చింది? ఐజీ : దీనిపై ఏడాది క్రితమే ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కమిషనరేట్‌ను ఎలా ఏర్పాటు చేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. సాక్షి : గుంటూరు రూరల్ పోలీస్ కార్యాలయం ఏర్పాటు ఎంతవరకు వచ్చింది? ఐజీ : గుంటూరు రూరల్ పోలీస్ కార్యాలయం ఏర్పాటుకు నరసరావుపేట పట్టణంలోని 22 ఎకరాల ఎన్ఎస్పీ స్థలాన్ని ఇచ్చారు. అయితే, ఈ ఫైల్ వేగంగా కదిలినప్పటికీ క్యాబినెట్లో పెట్టి నిర్ణయం తీసుకోవాల్సి రావడంతో కొంత ఆలస్యమైంది. నరసరావుపేట మున్సిపాలిటీ శతవసంతాల వేడుకల సందర్భంగా శంకుస్థాపన వాయిదా పడింది. వచ్చేనెలలో డీజీపీ జేవీ రాముడు చేతులమీదుగా శంకుస్థాపన నిర్వహిస్తాం. రూ.20 కోట్లు వెచ్చించి నాలుగు నూతన భవనాలు నిర్మిస్తాం. సాక్షి : రేంజ్ పరిధిలో పలుచోట్ల అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక పోలీసులు సెలవుపై వెళ్తున్నారు, దీనిపై మీ స్పందన? ఐజీ : పోలీసులు మనోధైర్యాన్ని కలిగి ఉండాలి. మనవైపు తప్పు లేకుండా చూసుకుంటే.. ఎవరూ తప్పు చేయమని అడిగే సాహసం చేయలేరు. నిజాయితీగా పనిచేసే అధికారులకు మా అండదండలు ఎప్పుడూ ఉంటాయి. సాక్షి : సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు ఇబ్బందులకు గురవుతున్నారు, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఐజీ : సౌకర్యాలు లేకపోవడంతో కొంత ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. త్వరలో సెక్యూరిటీ అధికారులు, సిబ్బందికి భవనాలు నిర్మించే ఏర్పాటు చేస్తున్నాం. సీఎం రెస్ట్‌హౌస్ వద్ద గుంటూరు రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల డీఎస్పీలకు రొటేషన్ పద్ధతిలో విధులు కేటాయిస్తున్నాం.