'ఆ ఎమ్మెల్యేలను చేర్చుకోవటం అనైతికం' | former mla Vellampally srinivas slams about party defections | Sakshi

'ఆ ఎమ్మెల్యేలను చేర్చుకోవటం అనైతికం'

Apr 29 2016 3:04 PM | Updated on Mar 22 2019 6:17 PM

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి పార్టీల్లో చేరవచ్చునని మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు.

విజయవాడ: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి పార్టీల్లో చేరవచ్చునని మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

పార్టీ ఫిరాయింపులపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారన్నారు. వైఎస్ జగన్ ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేను రాజీనామా చేయించకుండా టీడీపీలోకి చేర్చుకోవడం అనైతికమని వెల్లంపల్లి శ్రీనివాస్ తప్పుబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement