పోలీసుల అదుపులో నిర్మాత బండ్ల గణేష్ | Film producer Bandla Ganesh arrested | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో నిర్మాత బండ్ల గణేష్

Published Thu, Oct 24 2019 8:17 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

పోలీసుల కళ్లు గప్పి చట్టం నుంచి తప్పించుకొని తిరుగుతున్న సినీ నిర్మాత బండ్ల గణేష్‌ను ఎన్‌బీడబ్ల్యూ కింద బంజారాహిల్స్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఓ చెక్‌ బౌన్స్‌ కేసులో కడప ప్రత్యేక జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఫస్ట్‌క్లాస్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అఫెన్సెస్‌ న్యాయమూర్తి సెపె్టంబర్‌ 18న గణేష్‌కు అరెస్ట్‌ వారంట్‌ జారీ చేశారు. ఫిలింనగర్‌లో నివసించే గణేష్‌కు వారెంట్‌ జారీ చేసేందుకు పోలీసులు ప్రయతి్నస్తుండగా తప్పించుకు తిరుగుతున్నాడు. బుధవారం జూబ్లీహిల్స్‌ పోలీసులు ఇచ్చిన నోటీసుకు సమాధానం చెప్పేందుకు పోలీస్‌స్టేషన్‌కు రాగా సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. నిందితుడిని గురువారం కడప కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement