
హైదరాబాద్ : బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆరోపిస్తూ యాంకర్ శ్రీముఖి, జెమినీ టీవీ నిర్వాహకులపై ఓ వ్యక్తి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ‘జూలకటక’ కార్యక్రమానికి శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణుడిని కించపరిచేలా చిత్రీకరించారని, కార్యక్రమ నిర్వాహకులతో పాటు యాంకర్ శ్రీముఖిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సికింద్రాబాద్‌కు చెందిన ఎం వెంకటరమణ శర్మ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శ్రీముఖిపై ఐపీసీ సెక్షన్ 505(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యాంకర్‌గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. పలు చిత్రాల్లో కూడా నటించారు. బుల్లితెర రాములమ్మగా ప్రేక్షకులకు దగ్గయ్యారు. అందంతోపాటుగా తనదైన కామెడీ టైమింగ్‌తో అభిమానులను అలరిస్తున్నారు. గతేడాది బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి.. రన్నరప్‌గా నిలిచారు.(చదవండి : విజయ్‌కు మద్దతు తెలిపిన నిర్మాతల మండలి)
Comments
Please login to add a commentAdd a comment