అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్లను ఊరికి వెళ్తూ పెట్‌క్లినిక్‌లో అప్పగిస్తే పోగొట్టారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్లను ఊరికి వెళ్తూ పెట్‌క్లినిక్‌లో అప్పగిస్తే పోగొట్టారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివరాలు... శ్రీనగర్‌కాలనీలో నివసించే ప్రభు త్వ ఉద్యోగి తులసి ఈనెల 13న ఊరికి వెళ్తూ తన 14 నెలల పగ్ జాతి కుక్కపిల్లను జాగ్రత్తగా చూడాలని చెప్పి శ్రీనగర్‌కాలనీలోని జీకే పెట్ క్లినిక్‌కు అప్పగించారు. రోజుకు రూ.250 చొ ప్పున రుసుం కూడా చెల్లించారు.
ఈనెల 17న క్లినిక్ సిబ్బంది ఆ కుక్కపిల్లలను వాకింగ్ కోసం రోడ్డుపైకి తీసుకెళ్లగా...స్కూల్ బస్సు రావడం తో బెదిరి పోయి మెడకున్న గొలుసును తప్పిం చుకొని పారిపోయింది. క్లినిక్ సిబ్బంది గాలిం చినా దాని ఆచూకీ దొరకలేదు. ఊరు నుంచి తిరిగొచ్చిన తులసి తన కుక్కపిల్ల అదృశ్యమైన వి షయం తెలుసుకొని పెట్ క్లినిక్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌కు వచ్చి తన కుక్కపిల్లను పోగొట్టిన పెట్ క్లినిక్ నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఎలా పరిష్కరించాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకున్నారు.