ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హిజ్రాలు శనివారం అర్ధరాత్రి ఆందోళన నిర్వహించారు. వెంకట్ అనే రౌడీ షీటర్ వేధింపుల నుంచి తమను కాపాడాలని పోలీసులను వేడుకొన్నారు. తమ నివాసాలపై మారణాయుధాలతో దాడి చేసి తరచూ డబ్బులు తీసుకెళ్తున్నాడని ఆవేదనవ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించడంలేదని వాపోయారు. గత్యంతరం లేకనే ధర్నా చేస్తున్నామని తెలిపారు. వెంకట్ నుంచి తమకు ప్రాణహాని ఉందనీ, అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రౌడిషీటర్‌పై చర్యలు తీసుకునేవరకు ఆందోళన విరమించమని తేల్చిచెప్పారు. నిందితునిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పడంతో హిజ్రాలు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment