ఫటాఫట్
కోలీవుడ్‌లో పూసిన అందం.. తన అభినయంతో టాలీవుడ్‌లో అభిమానులను సంపాదించుకుంది రెజీనా కాసాండ్రా. వెండితెరపై తళుకుబెళుకులతో మ్యాజిక్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. వరుస హిట్లతో బిజీ నటిగా మారింది. బేగంపేటలోని బిగ్ ఎఫ్‌ఎం శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా రెజీనాతో సిటీప్లస్ ఫటాఫట్..
..:: కోట కృష్ణారావు, సనత్‌నగర్
సిటీప్లస్: హాయ్ రెజీనా.. వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నట్లున్నారు?
రెజీనా: ఔను.. ప్రస్తుతం తెలుగులో హరిశంకర్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చేశాను. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను.
సిటీప్లస్: మీ మాతృభాష తమిళం కదా....తెలుగు బాగానే మాట్లాడుతున్నారు..?
రెజీనా: (నవ్వుతూ..) సినిమాల కోసమే నేర్చుకున్నాను. ఇష్టంగా నేర్చుకున్నాను.. అందుకే ఎంచక్కా వచ్చేసింది.
సిటీప్లస్: సినిమా కెరీర్ ఎలా మొదలైంది..?
రెజీనా: సినిమాలంటే మహా ఇష్టం. మొదట షార్ట్ మూవీస్‌లో నటించాను. 2009లో కందనాల్ ముందాల్ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. తర్వాత కన్నడంలో సూర్యకాంతి చేశాను.
సిటీప్లస్: టాలీవుడ్ ఎంట్రీ గురించి..
రెజీనా: ‘శివ మనసులో శ్రుతి’ తెలుగులో నా ఫస్ట్ మూవీ. అందులో ప్రిన్స్ మహేష్‌బాబు బ్రదర్ ఇన్ లా సుధీర్ బాబు హీరో. తర్వాత తెలుగులో రొటీన్ లవ్‌స్టోరీ, కొత్తజంట, రారా కృష్ణయ్య, పవర్, పిల్లా నువ్వు లేని జీవితం.. ఇలా వరుసగా అవకాశాలు వచ్చాయి.
సిటీప్లస్: ఎవరి సరసన నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు..?
రెజీనా: పవన్‌కల్యాణ్, మహేష్‌బాబు సరసన నటించాలని ఉంది. వారి సినిమాల్లో చాన్స్ వస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోను.
సిటీప్లస్: పెళ్లి ఎప్పుడు.. ఎలాంటి అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు..?
రెజీనా: (నవ్వుతూ..) అప్పుడేనా..! ఇంకా ఐదేళ్లు అగాలి. నా మనసును అర్థం చేసుకునే వ్యక్తి అయితే చాలు.
సిటీప్లస్: హైదరాబాద్‌తో మీ అనుబంధం గురించి..
రెజీనా: నా చిన్నతనం నుంచే హైదరాబాద్‌కు వస్తుండేదాన్ని. చార్మినార్, గోల్కొండ, ట్యాంక్ బండ్.. ఇవన్నీ ఎప్పుడో చూశాను. ఇక్కడ కల్చర్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. హిందూ, ముస్లింల సఖ్యతకు హైదరాబాద్ వారధిగా నిలుస్తోంది. అందుకే ఈ సిటీ అంటే నాకు చాలా ఇష్టం.
పవన్, మహేష్ సరసన నటించాలని ఉంది
Published Sat, Jan 31 2015 1:00 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
Advertisement
Advertisement