Big FM
-
దిగ్గజ ఎఫ్ఎమ్ సంస్థను కొనుగోలు చేయనున్న కంపెనీలు ఇవేనా..
ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ఇండియా లిమిటెడ్ (ఈఎన్ఐఎల్)లో భాగంగా ఉన్న రేడియో మిర్చితో పాటు రేడియో ఆరెంజ్... బిగ్ ఎఫ్ఎమ్ రేడియో నెట్‌వర్క్‌ను కొనుగోలు చేసేందుకు రూ.251 కోట్ల చొప్పున బిడ్ వేశాయని సమాచారం. దివాలా ప్రక్రియలో ఉన్న బిగ్ ఎఫ్ఎమ్ రేసులో హర్యానాకు చెందిన సఫైర్ ఎఫ్ఎమ్ కూడా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సఫైర్ ఎఫ్ఎమ్ కూడా బిగ్ ఎఫ్ఎమ్ కోసం రూ.251 కోట్ల రూపాయల బిడ్ వేసింది. రేడియో మిర్చి, ఆరెంజ్ ఎఫ్ఎమ్ , సఫైర్ ఎఫ్‌ఎమ్‌ల బిడ్ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లిస్తామని ప్రకటించాయి. తమ బిడ్ల విలువను మరింత పెంచాలని లెండర్లు అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కంపెనీ ఖాతాల్లో ఉన్న రూ.60 కోట్ల నగదు కూడా లెండర్లకే వెళ్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బిగ్ ఎఫ్ఎం ఖాతాల్లోని నగదును లెక్కలోకి తీసుకున్న తర్వాత, లెండర్లకు ఇంకా రూ. 578 కోట్లు రావాలి. ఇది దేశంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్. 1,200 పట్టణాలకు, 50 వేలకుపైగా గ్రామాలకు ప్రసారాలను అందిస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు దివాలా ప్రక్రియకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఇంకా బిగ్ఎఫ్ఎమ్ సంస్థ ఈ అంశంపై స్పందించాల్సి ఉంది. -
అమ్మకానికి అంబానీ రేడియో
ముంబై : తీవ్ర రుణ భారంతో ఇక్కట్లను ఎదుర్కొంటున్న రిలయన్స్ అనిల్ ధీరూభాయి అంబానీ (అడాగ్) గ్రూపు అధినేత అనిల్ అంబానీ, ఆ భారాన్ని తగ్గించుకునే దిశగా మరో ముందడుగు వేశారు. మ్యూచువల్ ఫండ్స్ సేవల సంస్థ రిలయన్స్ నిప్పన్ అస్సెట్ మేనేజ్మెంట్లో తన వాటాను మరో భాగస్వామి నిప్పన్ లైఫ్‌కు విక్రయించేందుకు ఇప్పటికే డీల్ కుదుర్చుకోగా, బిగ్ఎఫ్ఎం పేరుతో దేశవ్యాప్తంగా ఎఫ్ఎం చానళ్లను నిర్వహించే రిలయన్స్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ లిమిటెడ్ (ఆర్బీఎన్ఎల్) విక్రయం విషయంలోనూ పురోగతి సాధించారు. జాగరణ్ ప్రకాశన్ గ్రూపునకు ఆర్‌బీఎన్‌ఎల్‌ను రూ.1,050 కోట్లకు విక్రయించనున్నట్టు రిలయన్స్ క్యాపిటల్ సోమవారం ప్రకటించింది. కీలకం కాని వ్యాపారాలను విక్రయించాలన్న తమ వ్యూహంలో భాగమే ఈ లావాదేవీ అని రిలయన్స్ క్యాపిటల్ సీఎఫ్‌వో అమిత్‌బప్నా పేర్కొన్నారు. నిప్పన్ లైఫ్ అస్సెట్ మేనేజ్మెంట్లో వాటా విక్రయం ద్వారా రిలయన్స్ క్యాపిటల్‌కు రూ.6,000 కోట్లు సమకూరనున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతుల రాకలో జాప్యం కారణంగా గతంలో ఆర్‌బీఎన్‌ఎల్‌ను జీ గ్రూపుకు విక్రయించాలనే ఒప్పందం విఫలమైన విషయం విదితమే. తొలుత 24 శాతం వాటా... దైనిక్ జాగరణ్ పేరుతో హిందీ దినపత్రికను ప్రచురించే జాగరణ్ ప్రకాశన్‌కు రేడియో సిటీ పేరుతో ఎఫ్ఎం చానళ్లను నిర్వహించే మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ (ఎంబీఎల్) కంపెనీ ఉంది. దీని ద్వారా ఆర్‌బీఎన్‌ఎల్‌ను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. ఆర్‌బీఎన్‌ఎల్‌ను కొనుగోలు చేసే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపినట్టు ఎంబీఎల్ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆర్‌బీఎన్‌ఎల్‌లో తొలుత 24 శాతం వాటాను రూ.202 కోట్ల ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా ఎంబీఎల్ కొనుగోలు చేయనుంది. తర్వాత అన్ని నియంత్రణ సంస్థ ల అనుమతులకు లోబడి ఆర్‌బీఎన్‌ఎల్‌లో మిగిలిన వాటాను రూ.1,050 కోట్లకు సొంతం చేసుకోనుంచి. మొత్తం సంస్థ విలువ రూ.1,050 కోట్లు’’ అని రిలయన్స్ క్యాపిటల్ తన ప్రకటనలో పేర్కొంది. కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. బిగ్ఎఫ్ఎం నెట్వర్క్ కింద ఆర్‌బీఎన్‌ఎల్‌కు 58 ఎఫ్ఎం స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 40 ఎఫ్ఎం స్టేషన్లు ఈ ఒప్పందంలో భాగంగా ఎంబీఎల్‌కు వెళ్లనున్నాయి. దీంతో మొత్తం 79 రేడియో స్టేషన్లతో అతిపెద్ద ఎఫ్ఎం రేడియో నెట్‌వర్క్‌గా ఎంబీఎల్ అవతరించనుంది. ఇక బిగ్ఎఫ్ఎం కింద మిగిలిన 18 ఎఫ్ఎం స్టేషన్లను రెండో దశ లావాదేవీ కింద మరో రూ.150 కోట్లకు ఎంబీఎల్‌కు కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. ఆర్‌బీఎన్‌ఎల్‌కు లోగడ జీ గ్రూపు రూ.1,872 కోట్లను ఆఫర్ చేయగా, దాంతో పోలిస్తే జాగరణ్ ఇవ్వచూపిన రూ.1,200 కోట్లు తక్కువేనని తెలుస్తోంది. -
ఫేస్బుక్ లైవ్‌తో సెలబ్రిటీ హోదా
-
‘బిగ్’ కిడ్నాప్
బిగ్ ఎఫ్ఎం 92.7 ఆధ్వర్యంలో ‘బిగ్ జూనియర్ ఆర్జే హంట్’ మూడో సీజన్‌ను గురువారం ప్రారంభించారు. పిల్లల్లో ప్రతిభా పాటవాలు... వాక్చాతుర్యాన్ని గుర్తించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ‘శంకరాభరణం’చిత్ర హీరో నిఖిల్, హీరోయిన్ నందితలు పాల్గొన్నారు. ‘బిగ్ కిడ్నాప్’ పేరుతో చిన్నారులు వారిని తాళ్లతో బంధించారు. తమ ప్రతిభతో వారిద్దరూ మెప్పించడంతో విడిచిపెట్టారు. - సనత్‌నగర్ -
పవన్, మహేష్ సరసన నటించాలని ఉంది
ఫటాఫట్ కోలీవుడ్‌లో పూసిన అందం.. తన అభినయంతో టాలీవుడ్లో అభిమానులను సంపాదించుకుంది రెజీనా కాసాండ్రా. వెండితెరపై తళుకుబెళుకులతో మ్యాజిక్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. వరుస హిట్లతో బిజీ నటిగా మారింది. బేగంపేటలోని బిగ్ ఎఫ్ఎం శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా రెజీనాతో సిటీప్లస్ ఫటాఫట్.. ..:: కోట కృష్ణారావు, సనత్‌నగర్ సిటీప్లస్: హాయ్ రెజీనా.. వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నట్లున్నారు? రెజీనా: ఔను.. ప్రస్తుతం తెలుగులో హరిశంకర్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చేశాను. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. సిటీప్లస్: మీ మాతృభాష తమిళం కదా....తెలుగు బాగానే మాట్లాడుతున్నారు..? రెజీనా: (నవ్వుతూ..) సినిమాల కోసమే నేర్చుకున్నాను. ఇష్టంగా నేర్చుకున్నాను.. అందుకే ఎంచక్కా వచ్చేసింది. సిటీప్లస్: సినిమా కెరీర్ ఎలా మొదలైంది..? రెజీనా: సినిమాలంటే మహా ఇష్టం. మొదట షార్ట్ మూవీస్‌లో నటించాను. 2009లో కందనాల్ ముందాల్ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. తర్వాత కన్నడంలో సూర్యకాంతి చేశాను. సిటీప్లస్: టాలీవుడ్ ఎంట్రీ గురించి.. రెజీనా: ‘శివ మనసులో శ్రుతి’ తెలుగులో నా ఫస్ట్ మూవీ. అందులో ప్రిన్స్ మహేష్‌బాబు బ్రదర్ ఇన్ లా సుధీర్ బాబు హీరో. తర్వాత తెలుగులో రొటీన్ లవ్‌స్టోరీ, కొత్తజంట, రారా కృష్ణయ్య, పవర్, పిల్లా నువ్వు లేని జీవితం.. ఇలా వరుసగా అవకాశాలు వచ్చాయి. సిటీప్లస్: ఎవరి సరసన నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు..? రెజీనా: పవన్‌కల్యాణ్, మహేష్‌బాబు సరసన నటించాలని ఉంది. వారి సినిమాల్లో చాన్స్ వస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోను. సిటీప్లస్: పెళ్లి ఎప్పుడు.. ఎలాంటి అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు..? రెజీనా: (నవ్వుతూ..) అప్పుడేనా..! ఇంకా ఐదేళ్లు అగాలి. నా మనసును అర్థం చేసుకునే వ్యక్తి అయితే చాలు. సిటీప్లస్: హైదరాబాద్‌తో మీ అనుబంధం గురించి.. రెజీనా: నా చిన్నతనం నుంచే హైదరాబాద్‌కు వస్తుండేదాన్ని. చార్మినార్, గోల్కొండ, ట్యాంక్ బండ్.. ఇవన్నీ ఎప్పుడో చూశాను. ఇక్కడ కల్చర్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. హిందూ, ముస్లింల సఖ్యతకు హైదరాబాద్ వారధిగా నిలుస్తోంది. అందుకే ఈ సిటీ అంటే నాకు చాలా ఇష్టం. -
బిగ్ గ్రీన్ గణేషా
వినాయక చవితి సందర్భంగా బిగ్ ఎఫ్ఎం ఈ ఏడాది సైతం ‘గ్రీన్ గణేశ’ కార్యక్రమం చేపడుతోంది. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో 2008 నుంచి వినాయక చవితి సందర్భంగా ఏటా ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పద్నాలుగు ప్రధాన నగరాల్లో పాత న్యూస్పేపర్లను సేకరించి, వాటిని ప్రముఖ శిల్పులకు అందజేస్తోంది. పాత న్యూస్పేపర్లతో వారు ఆకర్షణీయమైన వినాయక విగ్రహాలను తయారు చేస్తారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, గోవా, షోలాపూర్, ఇండోర్, భోపాల్, గ్వాలియర్, సూరత్, బరోడా, మైసూరు, తిరుపతి, విశాఖపట్నం, మంగళూరు నగరాల్లో వినాయక విగ్రహాల తయారీ కోసం టన్నుల కొద్దీ పాత న్యూస్పేపర్లను ఇప్పటికే సేకరించారు. పర్యావరణ అనుకూలమైన ఈ కార్యక్రమానికి గుర్తింపుగా బిగ్ ఎఫ్ఎంకు 2012లో ఇండియా రేడియో ఫోరం అవార్డు కూడా లభించింది. -
గోల్డెన్ వాయిస్
పల్లె జానపదాలు.. అలనాటి ఆణిముత్యాలు.. ప్రజెంట్ మెలొడీస్... శుక్రవారం వెస్లీ కళాశాల భిన్నమైన పాటల సంద్రమైంది. బిగ్ ఎఫ్ఎం ఆధ్వర్యంలో జరిగిన ‘బిగ్ గోల్డెన్ వాయిస్ సీజన్-2’ ఫైనల్లో ఆరుగురు గాయకులు తవు సత్తా చాటారు. వరంగల్‌కు చెందిన సుహిత విజేతగా నిలిచింది. ప్రముఖ గాయని సునీత న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. బిగ్ ఎఫ్ఎం దేశవ్యాప్తంగా 44 రేడియో స్టేషన్లలో నిర్వహించిన ఈ పోటీల్లో 37 మంది విజేతల్ని ఎంపిక చేసింది. ముంబాయిలో జరిగే ఫైనల్స్‌లో పాల్గొనే 37 మందిలో సుహిత ఒకరు. ఇక అందులో గెలుపొందినవారికి బాలీవుడ్లో సింగర్‌గా అవకాశం దక్కుతుంది. ‘గాయకులుగా నిలదొక్కుకోవాలనే ఔత్సాహికులకు ఇది మంచి అవకాశం. ముంబైలో హైదరాబాద్ సత్తాను చాటి బాలీవుడ్‌లోనూ అవకాశం దక్కించుకోవాలని కోరుకుంటున్నా. ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి, మనసుకు సంగీతం ఎంతో హాయినిస్తుంది. అదే సంగీతం గొప్పదనం. అలాంటి సంగీతాన్ని పదికాలాలపాటు బతికించేందుకు బిగ్ ఎఫ్ఎం చేస్తున్న కృషి అభినందనీయం’ అని సునీత అన్నారు. - దార్ల వెంకటేశ్వరరావు