బిగ్ గ్రీన్ గణేషా | BIG FM to be organized a program of 'BIG Green Ganesha' for Vinayaka Chavithi | Sakshi
Sakshi News home page

బిగ్ గ్రీన్ గణేషా

Published Sun, Aug 24 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM

బిగ్ గ్రీన్ గణేషా

బిగ్ గ్రీన్ గణేషా

వినాయక చవితి సందర్భంగా బిగ్ ఎఫ్‌ఎం ఈ ఏడాది సైతం ‘గ్రీన్ గణేశ’ కార్యక్రమం చేపడుతోంది. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో 2008 నుంచి వినాయక చవితి సందర్భంగా ఏటా ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పద్నాలుగు ప్రధాన నగరాల్లో పాత న్యూస్‌పేపర్లను సేకరించి, వాటిని ప్రముఖ శిల్పులకు అందజేస్తోంది. పాత న్యూస్‌పేపర్లతో వారు ఆకర్షణీయమైన వినాయక విగ్రహాలను తయారు చేస్తారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, గోవా, షోలాపూర్, ఇండోర్, భోపాల్, గ్వాలియర్, సూరత్, బరోడా, మైసూరు, తిరుపతి, విశాఖపట్నం, మంగళూరు నగరాల్లో వినాయక విగ్రహాల తయారీ కోసం టన్నుల కొద్దీ పాత న్యూస్‌పేపర్లను ఇప్పటికే సేకరించారు. పర్యావరణ అనుకూలమైన ఈ కార్యక్రమానికి గుర్తింపుగా బిగ్ ఎఫ్‌ఎంకు 2012లో ఇండియా రేడియో ఫోరం అవార్డు కూడా లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement