Regina Cassandra Comments On Her Love Issue - Sakshi
Sakshi News home page

Regina Cassandra: అది అప్పుడే ముగిసిపోయింది.. ఇక జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో..

Published Fri, Sep 9 2022 7:38 AM | Last Updated on Fri, Sep 9 2022 8:41 AM

Regina Cassandra Comments on her Love Issue - Sakshi

చెన్నై బ్యూటీ రెజీనా తొలుత కోలీవుడ్‌లో నట పయనాన్ని ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్‌ తదితర దక్షిణాది భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005లో కండనాళ్‌ మొదల్‌ తమిళ చిత్రంతో కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం విజయంతో ఇక్కడ మరికొన్ని చిత్రాలు అవకాశాలను రాబట్టుకుంది. కానీ కోలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను అందుకోలేకపోయింది.

అయితే టాలీవుడ్‌లో ఈమె యువ కథానాయకులతో జత కట్టి మంచి పేరునే తెచ్చుకుంది. తెలుగులోనే ఎక్కువ చిత్రాలు చేస్తోంది. ఇటీవల అవకాశాలు తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. దీంతో ఈ అమ్మడు వెబ్‌సిరీస్‌ల పైన దృష్టి సారిస్తోంది. ఇటీవల తెలుగు ఆచార్య చిత్రంలో చిరంజీవి, రామ్‌చరన్‌లతో ఐటెం సాంగ్‌ చేసింది. కాగా ఈమె సినీ జీవితం సాఫీగానే సాగుతున్నా, వ్యక్తిగత జీవితం మాత్రం సంతృప్తిగా సాగటం లేదనే చెప్పాలి.

ముఖ్యంగా ప్రేమ వ్యవహారం ఈమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. తాజాగా రెజీనా పెళ్లికి సిద్ధమవుతుందనే ప్రచారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. దీనిపై స్పందించిన రెజీనా ఓ భేటీలో పేర్కొంటూ తన ప్రేమ 2020లోనే ముగిసిందని చెప్పింది. దాని నుంచి బయటపడటానికి కొంచెం సమయం పట్టిందని చెప్పింది. ప్రస్తుతం తాను ఎవరినీ ప్రేమించడం లేదని తెలిపింది.

ప్రేమ, పెళ్లి వంటి విషయాలపై మాట్లాడటానికే తనకు ఇష్టం లేదని అంది. అసలు జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తనకే తెలియదని అంది. ఎందుకంటే ఎదురువారిపై ఆధారపడకుండా సొంతంగా జీవించడం అనే అంశాన్ని చిన్నతనంలోనే తన తల్లి తనకు నేర్పిందాని వెల్లడించింది. ఈనేపథ్యంలో జీవితంలో తోడు కావాలా? వద్దా? అన్ని విషయాలు కూడా ఇకపై ఆలోచించనని రెజీనా పేర్కొంది. ప్రస్తుతం ఈ సంచలన నటి తమిళం, తెలుగు భాషల్లో తలా మూడు చిత్రాలు చేస్తూ బిజీగానే ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement