ఫ్లాష్‌బ్యాక్‌ ఫస్ట్‌లుక్‌: అనసూయను చూశారా? | Director Kalyan Krishna Launched Flashback First Look | Sakshi
Sakshi News home page

Flashback First Look: రెజీనా, అనసూయల ఫ్లాష్‌బ్యాక్‌ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది

Published Thu, Nov 25 2021 8:55 PM | Last Updated on Thu, Nov 25 2021 8:55 PM

Director Kalyan Krishna Launched Flashback First Look - Sakshi

Flashback Movie First Look: ప్రభుదేవా, రెజినా, అనసూయల కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఫ్లాష్‌బ్యాక్’. గుర్తుకొస్తున్నాయి అనేది ఉప శీర్షిక. అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్ మీద పి రమేష్ పిళ్లై నిర్మిస్తున్నారు. డాన్ సాండీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ లుక్‌ విడుదల చేశారు. స్టార్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల మూవీకి సంబంధించిన రెండు విభిన్న పోస్టర్లను విడుదల చేశారు. మొదటి దాంట్లో ప్రభుదేవా, రెజీనాల లవ్ ట్రాక్ చూపిస్తే. రెండో దాంట్లో అనసూయ తన లుక్‌తో ఆకట్టుకుంది. ఈ రెండు  పోస్టర్లకు  విశేషమైన స్పందన లభిస్తోంది.

‘ఈ చిత్రం యూత్‌ను ఇట్టే కట్టిపడేస్తుంది. ఇందులో హై ఎమోషన్స్ ఉంటాయి. అంతకు మించి కథను చెప్పే విధానం బాగుంటుంది. టైటిల్, ట్యాగ్ లైన్‌తోనే సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. సినిమాలో  ప్రతీ సీన్ అన్ని వర్గాల ప్రేక్షకులను  ఆకట్టుకుంటుంది. రెజీనా ఇందులో ఆంగ్లోఇండియన్ టీచర్‌ పాత్రలో కనిపిస్తారు. అనసూయ మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ రెండు పాత్రలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రభుదేవా పాత్ర చాలా కొత్తగా ఉండబోతోంది. అనసూయ పాత్ర సినిమాకు హైలెట్ కానుంది’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. 

శామ్ సీఎస్ అందిస్తున్న మ్యూజిక్ ప్రధాన బలం. చల్లా భాగ్యలక్ష్మీ, అనిరుధ్ శాండిల్య తెలుగులో పాటలు అందిస్తున్నారు. ద్విభాష చిత్రంగా రాబోతోన్న ‘ఫ్లాష్ బ్యాక్’కు తెలుగులో నందు తుర్లపాటి సంభాషణలు రచిస్తున్నారు. తమిళ డైలాగ్స్‌ను దర్శకుడే రాసుకున్నారు. నిర్మాతలు ఈ సినిమా సక్సెస్ మీద ఎంతో నమ్మకంగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement