
Prabhu Deva Next Action Entertainer Film Titled Rekla: డాన్సింగ్ స్టార్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా ప్రస్తుతం నటన పైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. హీరోగా వరుస చిత్రాలకు కమిట్ అవుతున్నారు. ఆయన నటించడానికి అంగీకరించిన తాజా చిత్రానికి రెక్లా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది ప్రభుదేవా నటిస్తున్న 58వ చిత్రం కావడం గమనార్హం. ఒలింపియా మూవీస్ పతాకంపై అంబేత్‌కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి వాల్టర్ చిత్రం ఫేమ్ అన్భు దర్శకత్వం వహించనున్నారు.
జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నటుడు ఆర్య బుధవారం తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ టైటిల్ లుక్ పోస్టర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండీగా మారి చిత్రంపై భారీ అంచనాలు నెలకునేలా చేస్తోందని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. కాగా ఇందులో నటించే ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాత పేర్కొన్నారు.