స్టార్ కొరియోగ్రాఫర్ సినిమా.. హీరోయిన్‌గా లియో భామ! | Prabhu Deva latest Movie Madonna Sebastian As A Heroine | Sakshi
Sakshi News home page

Prabhu Deva: ప్రభుదేవా కొత్త మూవీ.. హీరోయిన్‌గా లియో నటి!

Published Sun, Dec 17 2023 3:43 PM | Last Updated on Sun, Dec 17 2023 3:44 PM

Prabhu Deva latest Movie Madonna Sebastian As A Heroine - Sakshi

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కథానాయకుడిగా, దర్శకుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈయన దర్శకుడుగా కోలీవుడ్‌, టాలీవుడ్‌, బాలీవుడ్‌లోనూ రాణించారు. అయితే ప్రస్తుతం ప్రభుదేవా నటన పైనే దృష్టి సారిస్తున్నారు. అలరించడానికి వివిధ రకాల పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. అయినప్పటికీ ఈయనకు ఇటీవల సరైన హిట్టు పడలేదన్నది వాస్తవం. కాగా తాజాగా మంచి వినోదంతో కూడిన ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవాకు జంటగా నటి మడోనా సెబాస్టియన్‌ నటిస్తున్నారు.

వీరి కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం ఇది. ట్రాన్స్‌ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై రాజేంద్ర రాజన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శక్తి చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు ప్రభుదేవా, శక్తి చిదంబరం కాంబినేషన్‌లో చార్లీ చాప్లిన్‌ 1, 2 వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలు వచ్చాయి. కాగా వినోదానికి ప్రాముఖ్యతను ఇచ్చే దర్శకుడు శక్తి చిదంబరం. ఈ తాజా చిత్రాన్ని అలాంటి మంచి వినోదంతో కూడిన ప్రేమ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. 

కాగా ఈ చిత్ర టైటిల్‌ను చిత్ర వర్గాలు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. దీనికి జాలియో జింఖానా అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఇది నటుడు విజయ్‌ నటించిన బీస్ట్‌ చిత్రంలోని పాటలో వచ్చే పల్లవిలో పదం కావడం గమనార్హం. దీంతో ఈ చిత్ర టైటిల్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది. కాగా.. ఈ చిత్రంలో యోగిబాబు, నటి యాషిక ఆనంద్‌, అభిరామి, రెడిన్‌ కింగ్స్‌లీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement