కాదలన్ చిత్రంలో పెట్టరాప్ అనే పల్లవితో సాగే పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ పాటలో నటుడు ప్రభుదేవా, వడివేలు నటించారు. కాగా అదే టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రభుదేవా కథానాయకుడిగా నటించనున్నారు. దీనికి 'పాట్టు అడి.. ఆట్టం.. రిపీట్' అనే ట్యాగ్‌ను పెట్టారు. ఇందులో వేదిక హీరోయిన్‌గా నటించనున్నారు. చాలా గ్యాప్ తరువాత ఈమె తమిళంలో నటిస్తున్న చిత్రమిది.
ఇతర ముఖ్యపాత్రల్లో వివేక్ ప్రసన్న, భగవతి పెరుమాళ్, రమేశ్ తిలక్, రాజీవ్ పిళ్‌లై, కళాభవన్ షాజన్, మైమ్ గోపీ, రియాజ్‌ఖాన్ నటించనున్నారు. మలయాళ దర్శకుడు ఎస్‌జే.శీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బ్లూహిల్స్ ఫిలింస్ పతాకంపై జోబీ పి.శ్యామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురువారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. దీని గురించి దర్శకుడు తెలుపుతూ ఇది రొమాన్స్ కామెడీ,యాక్షన్ థ్రిల్లర్, మ్యూజికల్ ఎంటర్‌టెయినర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు.
చిత్ర రెగ్యులర్ షూటింగ్ జూన్ 15వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. చిత్రంలోని ముఖ్య సన్నివేశాలను పుదుచ్చేరి, చెన్నైలో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. చిత్రాన్ని ఇదే ఏడాదిలో విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. కాగా దీనికి డి.ఇమాన్ సంగీతాన్ని, జిత్తు దామోదరన్ చాయాగ్రహణం అందిస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment