Is Prabhu Deva-Himani Singh Blessed With Girl Child? - Sakshi
Sakshi News home page

Prabhu Deva: మూడేళ్ల కిందట రహస్యంగా రెండో పెళ్లి.. పాపకు జన్మనిచ్చిన ప్రభుదేవా భార్య!

Published Sun, Jun 11 2023 12:47 PM | Last Updated on Mon, Jun 12 2023 2:45 PM

Is Prabhu Deva, Himani Welcomes Girl Child? - Sakshi

ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌గా పేరు గడించిన కొరియోగ్రాఫర్‌, నటుడు, దర్శకుడు ప్రభుదేవా మరోసారి తండ్రి అయ్యాడట! 50 ఏళ్ల వయసులో తండ్రిగా ప్రమోషన్‌ పొందాడంటూ ఓ వార్త కోలీవుడ్‌లో తెగ వైరలవుతోంది. ప్రభుదేవా రెండో భార్య హిమానీ ఆడపిల్లకు జన్మనిచ్చిందని, సుందరం మాస్టర్‌ ఇంట ఆనందాలు అంబరాన్నంటాయనేది సదరు వార్త సారాంశం. మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది.

భార్య ఉండగా నయన్‌తో లవ్‌
కాగా ప్రభుదేవా 1995లో రామలతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రభుదేవా కోసం ఆమె హిందూ మతానికి మారింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్య ఉండగానే నయనతారతో ప్రేమాయణం సాగించాడు ప్రభుదేవా. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో 2011లో విడాకులు తీసుకున్నారు. ఈ విషయంపై ఓసారి రామలత మాట్లాడుతూ.. పచ్చని సంసారంలో నయనతార నిప్పులు పోసిందని, తను కనిపిస్తే చెంప పగలగొడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

రహస్యంగా రెండో పెళ్లి
అయితే ప్రభుదేవాకు నయనతారను పెళ్లి చేసుకోవాలన్న ఆశ కూడా అడియాసే అయింది. వీరి మధ్య కూడా భేదాభిప్రాయాలు తలెత్తడంతో బ్రేకప్‌ చెప్పుకున్నారు. తర్వాత నయన్‌ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ను పెళ్లి చేసుకుంది. ఆమె కంటే ముందే ప్రభుదేవా 2020లో ఓ యువతిని రహస్య వివాహం చేసుకున్నాడు. వెన్ను నొప్పితో బాధపడ్డ తనకు చికిత్స అందించిన ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ హిమానీ సింగ్‌ మెడలో మూడు ముళ్లు వేశాడు.

ప్రభుదేవాకు రెండో భార్య బర్త్‌డే విషెస్‌
పెళ్లయి మూడేళ్లవుతున్నా వీరిద్దరూ బయట ఎక్కడా పెద్దగా కలిసి కనిపించలేదు. ఈ మధ్య ఓ షోలో ప్రభుదేవా 50వ పుట్టినరోజు సెలబ్రేట్‌ చేయగా.. హిమానీ సింగ్‌ విషెస్‌ చెప్పిన వీడియోను ప్లే చేయడంతో మురిసిపోయాడు ఈ కొరియోగ్రాఫర్‌. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఓ పాప పుట్టిందని అంటున్నారు. దీనిపై ప్రభుదేవా స్పందించాల్సి ఉంది.

చదవండి: సౌత్‌ హీరోయిన్‌ అని చులకనగా చూశారు: హన్సిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement