రేడియో స్టేషన్లలో రెజీనా
అందాల తార రెజీనా కాసాండ్రా ఏంటి.. రేడియోకు వెళ్లడం ఏంటని అనుమాన పడుతున్నారా? ఇంకా విడుదల కావాల్సిన తన తాజా చిత్రం 'సుబ్రమణ్యం ఫర్ సేల్' ప్రమోషన్ కోసం ఆమె రేడియోసిటీ, రేడియో మిర్చి లాంటి ఎఫ్ఎం రేడియో స్టూడియోలకు వెళ్లారు. అక్కడి ఆర్జేలతో కలిసి సందడి సందడిగా ప్రేక్షకులను అలరించారు.
ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలతో పాటు రేడియో సిటీలో ఆర్జే పోటుగాడు, రేడియో మిర్చిలో ఆర్జే భార్గవి (బ్యాండ్ బాజా ఫేం) తదితరులు అడిగిన అనేక చిలిపి ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చారు. రేడియో స్టూడియోలకు వెళ్లడం తనకు ఎంతో సరదాగా అనిపించిందని, గడిచిన రెండు రోజుల్లో రెండు రేడియో స్టేషన్లకు వెళ్లి సినిమా సంగతులు పంచుకున్నానని రెజీనా తెలిపారు.
Tune into @myradiocity right now! On air with @RjPotugadu pic.twitter.com/wAZfJk1GWd
— ReginaCassandra (@ReginaCassandra) September 4, 2015
Tune into @MirchiTelugu (radio mirchi) right now. Catch me and @RJBhargavi talkin about #SubramanyamForSale pic.twitter.com/Yg8naFnIQv
— ReginaCassandra (@ReginaCassandra) September 3, 2015