fm radio stations
-
808 ఎఫ్ఎం రేడియో స్టేషన్లకు త్వరలో ఈ వేలం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 284 నగరాల్లో 808 ఎఫ్ఎం రేడియో స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం త్వరలోనే ఈ వేలం నిర్వహించనుందని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 113 నగరాల్లో 388 ఎఫ్ఎం స్టేషన్లు నడుస్తున్నాయని చెప్పారు. కవరేజీ పెంచేందుకు గాను మారుమూల ప్రాంతాల్లోనూ రేడియో టవర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కమ్యూనిటీ రేడియోలు సహా రేడియో స్టేషన్లకు లైసెన్స్ జారీ ప్రక్రియను సులభతరం చేశామన్నారు. టయర్–2, 3 నగరాల్లోనూ విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆలిండియా రేడియో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా దేశంలోని భౌగోళిక ప్రాంతాన్ని 59 శాతం నుంచి 66 శాతానికి, జనాభాలో 68 నుంచి 80 శాతం మందికి సేవలందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. మారుమూల, గిరిజన, వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లోని వారికి ఉచితంగా 8 లక్షల డీడీ ఫ్రీ డిష్ సెట్ టాప్ బాక్సులను అందజేయనున్నామని తెలిపారు. -
ఇకపై స్మార్ట్ ఫోన్లో టీవీ చూడొచ్చు..! ఎలా అంటే..?
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్ఎం రేడియో స్టేషన్ల వేలంతో పాటు ఓటీటీ ఫ్లాట్‌ఫారమ్‌లను ప్రారంభించడం, మొబైల్స్‌లోనే టీవీ కార్యక్రమాలను వీక్షించేలా ట్రయల్స్ నిర్వహించనుంది. ఇదే విషయాన్ని సమాచార, ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది రేడియో స్టేషన్లను వేలం వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. ఎఫ్ఎం రేడియోను టైర్ 2, టైర్ 3 నగరాలకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నట్లు బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ సొసైటీ ఎక్స్‌పోలో ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో ఎఫ్ఎం రేడియో స్టేషన్లు ఉన్నప్పటికీ దేశంలో 60 శాతం మాత్రమే ఈ సేవలు అందిస్తున్నాయని ఆయన అన్నారు. సరిహద్దు, వ్యూహాత్మక ప్రాంతాలతో సహా ప్రసార భారతి పరిధిని విస్తృతం చేయడానికి ప్రసార మౌలిక సదుపాయాలు, నెట్వర్క్ డెవలప్మెంట్ (బైండ్) స్కీమ్ కోసం ప్రభుత్వం నాలుగు సంవత్సరాల కాలంలో రూ. 2,500 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకం దేశంలో ప్రభుత్వ రంగ ప్రసారాలను పెంచడం, ఆల్ ఇండియా రేడియో (air), దూరదర్శన్ (dd)తో సహా ప్రసార భారతి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఐఐటీ-కాన్పూర్, సాంఖ్య ల్యాబ్‌లు టెలివిజన్ సిగ్నల్‌లను నేరుగా మొబైల్ ఫోన్లకు ప్రసారం చేసేలా పరిసర ప్రాంతాలలో ట్రాన్స్మిటర్లను ఇన్స్టాల్ చేసినట్లు చంద్ర చెప్పారు. అత్యాధికమైన టెక్నాలజీ సాయంతో నేరుగా మొబైల్స్‌లోకి టీవీ సిగ్నల్స్‌ను సేకరించవచ్చు. ఇందుకోసం మొబైల్ ఫోన్ వినియోగదారులు తమ మొబైల్ పరికరాలకు ప్రత్యేక డాంగిల్‌ను జత చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఫోన్లలో ప్రత్యేక చిప్‌ను ఇన్స్టాల్ చేసుకునేలా మొబైల్ తయారీదారులను ప్రోత్సహించాల్సి ఉంటుందని, తద్వారా డాంగిల్ లేకుండానే టెలివిజన్ సిగ్నల్స్ అందుతాయని అన్నారు. -
రేడియోతో.. ఎవేర్‌నైస్
సరదా కబుర్లూ, నవ్వించే ముచ్చట్లతో శ్రోతలకు చిరపరిచితమైన ఆర్జేలు.. లాక్‌డౌన్‌తో నగరవాసులకు మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు తమ ఆటపాటలను వినిపులకరించేవారితో పాటు తమను ఆప్యాయంగా పలకరించేవారు కూడా పెరిగారని సంతోషం వ్యక్తం చేస్తున్న ఆర్జేలు కరోనాపై అవగాహనకు తమవంతు కృషిచేస్తున్నామంటున్నారు. సాక్షి, సిటీబ్యూరో: మాట, పాటలతో నిత్యం అలరించే ఎఫ్ఎమ్లు కరోనా వారియర్స్‌గా తామూ పదం కదుపుతున్నారు. కార్యక్రమాలన్నీ కరోనా నేపథ్యంలో కొనసాగిస్తూ తమ చానెల్స్ ద్వారా శ్రోతలకు అవగాహన కల్పిస్తున్నారు. గతంతో పోలిస్తే ఎఫ్ఎమ్లు వినేవారితో పాటు తగినంత ఖాళీ సమయం ఉండటంతో తమతో సంభాషించడం కూడా పెరిగిందంటూ ఆర్జేలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అవగాహనకే ప్రాధాన్యం.. వందనం.. సింగిడి.. రిమ్జిమ్ హైదరాబాద్ తదితర కార్యక్రమాల్లో ఆర్జేలు వినోదానికి విజ్ఞానాన్ని కూడా జోడిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, డాక్టర్లు, పోలీస్ అవగాహన కల్పిస్తున్నారు. కోవిడ్–19పై స్పెషల్ బులెటిన్స్‌ను ప్రతి గంటకు ఆల్ ఇండియా రేడియో న్యూస్ విభాగం అందిస్తోంది. కరోనాపై ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను భవిష్యత్ ప్రణాళికలను, ఏర్పాట్లను ఆయా విభాగాల అధికారులు, మంత్రులతో చర్చలను ప్రసారం చేస్తున్నారు. కోవిడ్–19పై ప్రత్యేక క్యాంపెయిన్‌ను ఆకాశవాణి హైదరాబాద్ సోషల్ మీడియా(ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్)ల ద్వారా నిర్వహిస్తోంది. డ్యూటీలు నిర్వహిస్తున్న ఆర్జేలందరికీ మాస్క్‌లు, శానిటైజర్లను రేడియో చానెల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. నివృత్తి.. మా బాధ్యత.. చాలామందికి కరోనాపై ఎన్నోఅనుమానాలున్నాయి. వీలైనంత వరకూ వాటిని నివృత్తి చేయడం నా బాధ్యతగా ఫీలవుతున్నా. పలువురు నిపుణులతో నిరంతరం సంప్రదించి, వారితో లైవ్‌లో మాట్లాడించి వారి సందేహాలను నివృత్తి చేస్తున్నాం. – ఆర్జే అనూష రేడియోకి టీఆర్పీ బాగా పెరిగింది.. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం రేడియోకి టీఆర్పీ బాగా పెరిగింది. కరోనా టైంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచి ప్రసారాలు నిర్వహిస్తున్నాం. ఆర్జేలు ఎంతో ఉత్సాహంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. శ్రోతలకు, ఆర్జేలకు మధ్య ఓ అనుబంధం ఉంటుంది. – కామేశ్వరి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్,రెయిన్బో ఎఫ్ఎమ్ ఇమ్యూనిటీ టిప్స్ ఇస్తున్నాం.. ఈ టైంలో శారీరక, మానసిక ఆరోగ్యాలను ఎలా కాపాడుకోవాలి? మనలో వ్యాధి నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలి? అనే అంశాలపై ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం. అవి మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని లిజనర్స్ చెబుతుంటేసంతోషంగా ఉంది. – ఆర్జే లక్కీ బాధ్యతగా ఫీల్ అవుతున్నాం.. ఇప్పుడు ఇది మాకు కేవలం ఉద్యోగం కాదు.. ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఈ విపత్కర పరిస్థితుల్లో వారికి ఓ వైపు వినోదం అందిస్తూ మరోవైపు అవగాహన పెంచడం అనేది ఓ సామాజిక బాధ్యతగా భావిస్తున్నాం.ప్రేక్షకుల స్పందన వస్తోంది. – ఆర్జే డా.సురభి రమేష్ సార్థకత చేకూరుతోంది.. ఉల్లాసపరచడం తెలిసిన విషయమే.. అయితే దానితో పాటు కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవడం, పంచుకోవడం అనే కొత్త బాధ్యత స్వీకరించాం. ఇలాంటి సమయాల్లోనే మన వృత్తి ధర్మానికి సార్థకత చేకూరినట్టు అనిపిస్తోంది. – ఆర్జే సునీల్ -
రేడియో స్టేషన్లలో రెజీనా
అందాల తార రెజీనా కాసాండ్రా ఏంటి.. రేడియోకు వెళ్లడం ఏంటని అనుమాన పడుతున్నారా? ఇంకా విడుదల కావాల్సిన తన తాజా చిత్రం 'సుబ్రమణ్యం ఫర్ సేల్' ప్రమోషన్ కోసం ఆమె రేడియోసిటీ, రేడియో మిర్చి లాంటి ఎఫ్ఎం రేడియో స్టూడియోలకు వెళ్లారు. అక్కడి ఆర్జేలతో కలిసి సందడి సందడిగా ప్రేక్షకులను అలరించారు. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలతో పాటు రేడియో సిటీలో ఆర్జే పోటుగాడు, రేడియో మిర్చిలో ఆర్జే భార్గవి (బ్యాండ్ బాజా ఫేం) తదితరులు అడిగిన అనేక చిలిపి ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చారు. రేడియో స్టూడియోలకు వెళ్లడం తనకు ఎంతో సరదాగా అనిపించిందని, గడిచిన రెండు రోజుల్లో రెండు రేడియో స్టేషన్లకు వెళ్లి సినిమా సంగతులు పంచుకున్నానని రెజీనా తెలిపారు. Tune into @myradiocity right now! On air with @RjPotugadu pic.twitter.com/wAZfJk1GWd — ReginaCassandra (@ReginaCassandra) September 4, 2015 Tune into @MirchiTelugu (radio mirchi) right now. Catch me and @RJBhargavi talkin about #SubramanyamForSale pic.twitter.com/Yg8naFnIQv — ReginaCassandra (@ReginaCassandra) September 3, 2015