బాలకృష్ణుడు ఫస్ట్ లుక్ | Nara Rohit Balakrishnudu Fiirst Look | Sakshi
Sakshi News home page

బాలకృష్ణుడు ఫస్ట్ లుక్

Published Sat, Sep 23 2017 10:39 AM | Last Updated on Wed, Aug 29 2018 3:53 PM

Nara Rohit Balakrishnudu Fiirst Look - Sakshi

విలక్షణ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నారా రోహిత్. కెరీర్ తొలినాళ్ల నుంచి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ వస్తున్న రోహిత్ మల్టీ స్టారర్ చిత్రాలతోనూ అలరిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న నారావారబ్బాయి తన కొత్త సినిమాలో ఆరు పలకల దేహంతో కనిపించనున్నాడు. నారా రోహిత్ సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ నీలాంబరి తరహా పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు.

పవన్ మల్లెల దర్శకత్వంలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే కలర్ ఫుల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా నారా రోహిత్ స్టిల్ ను రివీల్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ ఫార్మల్ డ్రెస్ లో రోహిత్ సూపర్బ్ గా ఉన్నాడు. విజయదశమి సందర్భంగా బాలకృష్ణుడు టీజర్ రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement