

ఒకప్పుడు తెలుగులో వరస సినిమాలు చేసిన బ్యూటీ రెజీనా కసాండ్రా.

చెన్నైలో పుట్టి పెరిగిన ఈ చిన్నదాని పుట్టినరోజు నేడు (డిసెంబర్ 13)

2005 నుంచి ఇండస్ట్రీలో ఉంది అంటే దాదాపు 20 ఏళ్లుగా నటిస్తోంది.

టీనేజీలోనే యాక్టింగ్ మొదలుపెట్టింది. తొలుత తమిళంలో రెండు మూవీస్ చేసింది.

ఆ తర్వాత 'శివ మనసులో శృతి' మూవీ హీరోయిన్ అయిపోయింది.

తర్వాత కన్నడ, హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండేది.

'పవర్', 'అ', 'పిల్లా నువ్వు లేని జీవితం', 'ఎవరు' లాంటి హిట్ మూవీస్ చేసినా పెద్దగా ఈమెకు ఉపయోగపడేలేదు.

మూవీస్ అయితే చేస్తోంది గానీ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయిందని చెప్పొచ్చు.

నటన కెరీర్ పక్కనబెడితే అప్పట్లో సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్‍తో ఈమె రిలేషన్‌లో ఉందని రూమర్స్ వచ్చాయి.

కానీ హీరోలతో రిలేషన్ రూమర్స్ అన్నీ కూడా కొన్నాళ్లకు పుకార్లు మాత్రమే అని తేలాయి.

మధ్యలో ఓసారి 'అబ్బాయిలు.. మ్యాగీలా రెండే నిమిషాలు' అని స్టేట్‌మెంట్ ఇచ్చి కాంట్రవర్సీ అయింది.

33 ఏళ్లు వచ్చినా ఇంకా సింగిల్‌గానే ఉంటోంది రెజీనా. ప్రస్తుతం ఈమె మూడు హిందీ, ఓ తమిళ మూవీ చేస్తోంది.












