

విక్టరీ వెంకటేశ్.. ఈ పేరు చెప్పగానే అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి.

తెలుగులో అందరూ హీరోల అభిమానులకు నచ్చే వన్ అండ్ ఓన్లీ హీరో వెంకటేశ్.

పేరు వెంకటేశ్ అయినా సరే అందరూ వెంకీమామ అని పిలుచుకున్న ఈయన పుట్టినరోజు నేడు (డిసెంబరు)

యూఎస్‌లో ఎంబీఏ పూర్తి చేసిన వెంకటేశ్.. 'కలియుగ పాండవులు' మూవీతో అనుకోకుండా హీరో అయ్యాడు.

తండ్రి రామానాయుడు.. ప్రముఖ నిర్మాత కావడంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ సులువుగానే జరిగింది.

కానీ ఒక్కో సినిమాతో వెంకటేశ్ హిట్స్ కొట్టడంతో పాటు తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సాధించుకున్నాడు.

అక్కినేని నాగేశ్వరరావు 'ప్రేమ్ నగర్' సినిమాలో బాలనటుడిగానూ వెంకటేశ్ కనిపిస్తాడు.

క్రికెట్ అంటే చాలా ఇష్టం. టీమిండియా, ఐపీఎల్ మ్యాచ్‌లంటే స్టేడియంలో కచ్చితంగా వెంకీ ఉండాల్సిందే.

అధ్యాత్మిక చింతన ఎక్కువ. ఎన్నో భక్తి పుస్తకాలు చదివాడు. ఒక్కరోజు కూడా ధ్యానం చేయకుండా ఉండలేడు.

అత్యధిక నంది అవార్డులు అందుకున్న నటుడీయనే. ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నాడు.

ఎక్కువ రీమేక్ సినిమాలు చేయడంతో పాటు హిట్స్ కొట్టిన రికార్డ్ కూడా వెంకీమామ సొంతం.

వేరే హీరోలతో కలిసి పనిచేసేందుకు వెంకటేశ్ ఎప్పుడూ సిద్ధమే. పవన్, మహేశ్, కమల్ హాసన్.. ఇలా చాలామందితో పనిచేశారు.

ఫరా, టబు, దివ్య భారతి, గౌతమి, ప్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి.. ఇలా చాలామంది హీరోయిన్లు వెంకీ మూవీస్‌తోనే పరిచమయ్యారు.

రీసెంట్ టైంలో వెంకటేశ్‌కి హిట్స్ పడట్లేదు గానీ వెంకటేశ్ అంటే తెలుగు ప్రేక్షకులకి ఎప్పుడూ ప్రత్యేక అభిమానం.

అందుకే వెంకటేశ్ అంటే ఎప్పుడు స్పెషల్. ఈయన మరెన్నో పుట్టినరోజులు ఇలా జరుపుకోవాలని కోరుకుంటూ బర్త్ డే విషెస్.




