Saakini Daakini Movie Teaser Unleashed | Regina Cassandra | Nivetha Thomas - Sakshi
Sakshi News home page

Saakini Daakini Teaser: ఆకట్టుకుంటున్న ‘శాకిని-డాకిని’ టీజర్‌

Published Tue, Aug 23 2022 11:50 AM | Last Updated on Tue, Aug 23 2022 12:56 PM

Saakini Daakini Movie Teaser Unleashed - Sakshi

రెజీనా కసాండ్రా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘శాకిని డాకిని’. దక్షిణ కొరియా చిత్రం ‘మిడ్‌నైట్‌ రన్నర్‌’కి తెలుగు రీమేక్‌ ఇది. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. డి. సురేశ్‌ బాబు, సునీత తాటి, హ్యూన్వూ థామస్‌ కిమ్‌ నిర్మాతలు. సెప్టెంబర్‌ 16న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్‌.
(చదవండి: క్యూట్‌నెస్‌ ఓవర్‌లోడెడ్‌..మెరుపు తీగలా తయారైన హన్సిక!)

టీజర్‌ ప్రకారం శాలిని(నివేదా థామస్‌) ఫుడ్‌ లవర్‌కాగా, దామిని(రెజీనా)కి ఓసీడీ సమస్యతో ఉంది. ఇద్దరు పోలీసు అకాడమీలో ట్రైనీలుగా జాయిన్‌ అవుతారు. శిక్షణా శిబిరంలో ఇద్దరు తక్కువ పనితీరు కనబరుస్తున్నారు. అంతేకాదు అనవసరమైన విషయాల్లో తగాదాలు పెట్టుకుంటున్నట్లు టీజర్‌లో చూపించారు. ఓ నేరస్థుడు ఒక అమ్మాయిని తలపై కొట్టినట్లుగా ప్రధాన కథ ను చూపించడం జరిగింది. ఈ అమ్మాయిలు తగిన సమయంలో తమ నైపుణ్యాలను ఎలా చూపిస్తారనే దాని గురించి టీజర్ ఉంది.

టీజర్‌ను బట్టి చూస్తే, సినిమాలో వినోదం, యాక్షన్, బలమైన కథ, డ్రామా  ఉన్నట్లు తెలుస్తోంది. థ్రిల్లర్‌లను హ్యాండిల్ చేయడంలో దిట్ట అయిన సుధీర్ వర్మ ఈ సబ్జెక్ట్‌ని డీల్ చేయడంలో తనదైన మార్క్ చూపించాడు. ఈ చిత్రానికి రిచార్డ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్‌ కాగా,  మైకీ మెక్‌క్లియరీ సంగీతం అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement