Saakini Daakini Movie
-
‘శాకిని డాకిని' మూవీ ట్విట్టర్ రివ్యూ
రెజీనా కసాండ్రా, నివేదా థామస్ లీడ్ రోల్స్‌లో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాకిని డాకిని'.డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా నేడు(శుక్రవారం)విడుదలయ్యింది. యాక్షన్, డ్రామా, హాస్యం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక నేరాన్ని ఎలా పరిష్కరించగలిగారు? అనేది ఈ చిత్ర కథ. కొరియన్ చిత్రం 'మిడ్నైట్ రన్నర్స్' రీమేక్ అయిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘శాకిని డాకిని' చిత్రంపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఆ రివ్యూ ఏంటో మీరే చూసేయండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. కొన్ని సన్నివేశాల విషయంలో లాజిక్ మిస్ అయ్యిందని నెటిజన్లు పేర్కొన్నారు. అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకోలేక పోయారని,సెకండ్ హాఫ్ ఇంకాస్త బెటర్ గా ప్లాన్ చేసి ఉండవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. #SaakiniDaakini Movie Review: ⭐⭐⅓ A Decent 1st Half & A Disappointing 2nd Half Comedy Worked in Parts, But if failed in making audience engaging - Runtime less than 2hrs A Below Par Watch #SaakiniDaakiniReview@i_nivethathomas @ReginaCassandra — Thyveiw (@Thyveiw) September 16, 2022 #SaakiniDaakini Ok Ok Sunday Show Confirm 🥲 — Chandra Sekhar ᥫ᭡ (@kvvcsr1432) September 16, 2022 Showtime @i_nivethathomas @ReginaCassandra starrer #SaakiniDaakini Playing with subs pic.twitter.com/8EyKPZnxGB — வன்மமொழிவர்மன் (@naveenversion2) September 16, 2022 -
‘శాకిని డాకిని’ చిత్రంలో ఆ క్రైమ్ గురించి చెబుతున్నాం
‘‘ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరుగుతున్న ఓ పెద్ద నేరం గురించి ఇండియాలో ఎవరూ మాట్లాడటం లేదు. మా ‘శాకిని డాకిని’ చిత్రంలో ఆ క్రైమ్ గురించి చెబుతున్నాం కాబట్టి ప్రతి మహిళ ఈ చిత్రం చూడాలి’’ అని నిర్మాత సునీత తాటి అన్నారు. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ లీడ్ రోల్స్‌లో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాకిని డాకిని’. డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సునీత తాటి మాట్లాడుతూ– ‘‘గురు ఫిల్మ్స్‌పై నిర్మించిన 7వ చిత్రం ‘శాకిని డాకిని’. మహిళల సమస్యలపై మహిళలే మాట్లాడితే ఇంకా బాగా కనెక్ట్ అవుతారని లీడ్ రోల్స్‌లో రెజీనా, నివేదలను తీసుకున్నాం. ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక నేరాన్ని ఎలా పరిష్కరించగలిగారు? అనేది ఈ చిత్ర కథ. ఇదొక యూనివర్శల్ కథ.. అందరికీ నచ్చుతుంది. సుధీర్ వర్మ వేరే షూటింగ్లో ఉండటం వల్లే ‘శాకిని డాకిని’ ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు.. నేటి నుంచి పాల్గొంటారు. సురేశ్ బాబుగారితో అసోసియేట్ అవడం చాలా హ్యాపీ. మన చిత్రాలు కొరియన్, జపాన్ భాషల్లో చాలా రీమేక్ అవుతున్నాయి. థియేటర్లో సినిమా చూసినప్పుడు అందరం నవ్వుతాం.. ఏడుస్తాం. అదే ఓటీటీలో అయితే ఇంట్లో పర్సనల్‌గా అనుభూతి పొందుతాం. థియేటర్ అనుభూతే వేరు. మా బ్యానర్లో మరో నాలుగు కొరియన్ సినిమాలు రీమేక్ చేయనున్నాం.. వాటిలో సమంతతో ఓ సినిమా ఉంటుంది. డైరెక్టర్ బాపుగారంటే నాకు ఇష్టం. ఆయనలాంటి మూవీస్‌తో పాటు, ‘అవతార్’ లాంటి ఫ్యాంటసీ సినిమాలు డైరెక్ట్ చేయాలనుంది.. చేస్తాను’’ అన్నారు. -
‘శాకినీ డాకినీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా నడుస్తోంది. సెప్టెంబర్ నెలలో పెద్ద చిత్రాలేవి బాక్సాఫీస్ బరిలో లేకపోవడంతో.. ప్రతి వారం నాలుగైదు చిన్న చిత్రాలు విడుదలవుతున్నాయి. వచ్చే నెలలో దసరా ఉంటుంది. అప్పుడు పెద్ద చిత్రాల రద్దీ కారణంగా చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడం కష్టమే. అందుకే తమ చిత్రాలను సెప్టెంబర్ నెలలో విడుదల చేసి లాభాలను పొందాలని భావిస్తున్నారు చిన్న నిర్మాతలు. గతవారం నాలుగైదు చిత్రాలు విడుదల కాగా.. ఈ వారం కూడా భారీగానే చిన్న హీరోల చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. సెప్టెంబర్ రెండో వారంలో విడుదలకు సిద్దమైన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. ముత్తు తమిళ స్టార్ శింబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వెందు తనిందతు కాడు’. తెలుగు ఈ చిత్రం ‘ది లైప్ ఆఫ్ ముత్తు’పేరుతో ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గణేశ్ నిర్మించిన ఈ సినిమాకి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించాడు. సిద్ధి ఇద్నాని కథానాయికగా నటించిన ఈ సినిమాలో, రాధిక కీలకమైన పాత్ర పోషించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. నేను మీకు బాగా కావాల్సినవాడిని యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా, సంజనా ఆనంద్, సిద్ధార్థ్ మీనా హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోడి దివ్య ఎంటర్టైన్ మెంట్స్‌పై కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శాకినీ డాకినీ రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శాకిని డాకిని. దక్షిణ కొరియా చిత్రం ‘మిడ్నైట్ రన్నర్’కి తెలుగు రీమేక్ ఇది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదలవుతుంది. కే3 శివ కార్తీక్ దర్శకత్వంలో కిచ్చా సుదీప్ హీరోగా తెకెక్కిన చిత్రం కే3: కోటికొక్కడు . మడోనా సెబాస్టియన్, అఫ్తాబ్, రవిశంకర్, శ్రద్ధాదాస్ తదితురులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 16న థియేటర్స్‌లో విడుదల కానుంది. సకల గుణాభి రామ బిగ్ బాస్ ఫేమ్ వి జె సన్నీ, అషిమా హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వంలో సంజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం సకల గుణాభి రామ. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16న థియేటర్స్‌లో విడుదల కానుంది. అం అః సుధాకర్ జంగం, లావణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'అం అః'. ‘ఎ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రానికి శ్యామ్ మండల దర్శకత్వం వహిస్తున్నారు. రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 16న ఈ చిత్రం విడుదల కానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు.. సోనీలీవ్ రామారావు ఆన్ డ్యూటీ, సెప్టెంబర్ 15 కాలేజ్ రొమాన్స్(హిందీ సిరీస్-3, సెప్టెంబర్ 15 అమెజాన్ ఫ్రైమ్ విరుమన్( తమిళ చిత్రం), సెప్టెంబర్ 11 డిస్నీ+ హాట్‌స్టార్ విక్రాంత్ రోణ(తెలుగు) సెప్టెంబర్ 16 దహన్(హిందీ సిరీస్) సెప్టెంబర్ 16 నెట్‌ఫ్లిక్స్ జోగి(హిందీ), సెప్టెంబర్ 16 ఆహా డ్యాన్స్ ఐకాన్(రియాల్టీ షో), సెప్టెంబర్ 11 -
ఆకట్టుకుంటున్న ‘శాకిని-డాకిని’ టీజర్
రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘శాకిని డాకిని’. దక్షిణ కొరియా చిత్రం ‘మిడ్నైట్ రన్నర్’కి తెలుగు రీమేక్ ఇది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. డి. సురేశ్ బాబు, సునీత తాటి, హ్యూన్వూ థామస్ కిమ్ నిర్మాతలు. సెప్టెంబర్ 16న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. (చదవండి: క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్..మెరుపు తీగలా తయారైన హన్సిక!) టీజర్ ప్రకారం శాలిని(నివేదా థామస్) ఫుడ్ లవర్కాగా, దామిని(రెజీనా)కి ఓసీడీ సమస్యతో ఉంది. ఇద్దరు పోలీసు అకాడమీలో ట్రైనీలుగా జాయిన్ అవుతారు. శిక్షణా శిబిరంలో ఇద్దరు తక్కువ పనితీరు కనబరుస్తున్నారు. అంతేకాదు అనవసరమైన విషయాల్లో తగాదాలు పెట్టుకుంటున్నట్లు టీజర్లో చూపించారు. ఓ నేరస్థుడు ఒక అమ్మాయిని తలపై కొట్టినట్లుగా ప్రధాన కథ ను చూపించడం జరిగింది. ఈ అమ్మాయిలు తగిన సమయంలో తమ నైపుణ్యాలను ఎలా చూపిస్తారనే దాని గురించి టీజర్ ఉంది. టీజర్‌ను బట్టి చూస్తే, సినిమాలో వినోదం, యాక్షన్, బలమైన కథ, డ్రామా ఉన్నట్లు తెలుస్తోంది. థ్రిల్లర్లను హ్యాండిల్ చేయడంలో దిట్ట అయిన సుధీర్ వర్మ ఈ సబ్జెక్ట్‌ని డీల్ చేయడంలో తనదైన మార్క్ చూపించాడు. ఈ చిత్రానికి రిచార్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ కాగా, మైకీ మెక్‌క్లియరీ సంగీతం అందిస్తున్నారు.