Regina Cassandra To Act In Chatrapati Remake Movie - Sakshi
Sakshi News home page

సూపర్‌ హిట్‌ హిందీ రీమేక్‌లో ఆఫర్‌ అందుకున్న రెజీనా?

Published Mon, Jul 26 2021 10:27 AM | Last Updated on Mon, Jul 26 2021 1:25 PM

Regina Cassandra In Chatrapati Remake - Sakshi

రెజీనీ కసాండ్రా.. కొన్నాళ్ల క్రితం తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ చెన్నై చిన్నది ఈ మధ్యకాలంలో రేసులో వెనకబడింది. వరుస ఫ్లాపులతో టాలీవుడ్‌లో సినిమాలు తగ్టించిన ఈ బ్యూటీ ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తుంది. తాజాగా ఈ అమ్మడికి బాలీవుడ్‌లో బంపర్‌ ఆఫర్‌ వచ్చిందని సమాచారం. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో రెజీనాను ఫైనల్‌ చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. 2005లో ఎస్‌ఎస్‌ రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఛత్రపతి సినిమాను ప్రస్తుతం హిందీలో వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే హీరోయిన్‌ విషయంలో మొదటి నుంచి సస్పెన్స్‌ కొనసాగింది. ఇప్పటికే ఛత్రపతి రీమేక్‌ కోసం పలువురు స్టార్‌ హీరోయిన్లను సంప్రదించినా వారు సున్నితంగా ఆఫర్‌ తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఆ మధ్య అనన్య పాండే హీరోయిన్‌గా ఫైనలైజ్‌ అయ్యిందంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఇటీవలె హైదరాబాద్‌లో షూటింగ్‌ ప్రారంభించిన చిత్ర బృందం..రెజీనాను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement