
అల్లుడు శీను సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో బెల్లంకొండ నటించనున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ బ్యానర్‌లో తెరకెక్కునున్న ఈ మూవీ శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్‌చల్ అవుతున్నాయి.
2005లో తెలుగులో విడుదలైన ఛత్రపతి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా ఇది. ఛత్రపతి హిట్‌తో మాస్ ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. దాదాపు 16 ఏళ్ల అనంతరం ఈ సినిమా హిందీ రేమేక్ ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీకి సిద్ధమయ్యాడు బెల్లంకొండ. విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ అందించిన ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment