bellamkonda
-
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
బెల్లంకొండ హీరోయిన్ “యో...యో”
-
బెల్లంకొండను కాల్చినోడు సైకో కాదా ?
-
బాలీవుడ్‌పై ఆశలు పెట్టుకున్న బెల్లంకొండ.. ఛత్రపతి రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఛత్రపతి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌కు మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పుడీ సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేస్తున్నాడు. వి.వి వినాయక్ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను వేసవి కానుకగా మే12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. కండలు తిరిగిన దేహంతో బెల్లంకొండ శ్రీనివాస్ లుక్ అంచనాలను పెంచేస్తుంది. మరి ఈ సినిమాతో బెల్లంకొండ సక్సెస్ అందుకుంటారా? లేదా అన్నది చూడాల్సి ఉంది. The wait is over #Chatrapathi in cinemas on 12th May, 2023. Cannot wait to show you all our hardwork & this action-packed dhamaka.🔥 Written by the one and only #VijayendraPrasad, directed by #VVVinayak.@Penmovies #Bss9 pic.twitter.com/VSLYTWQkrT — Bellamkonda Sreenivas (@BSaiSreenivas) March 27, 2023 -
బెల్లంకొండ ఛత్రపతి హిందీ రీమేక్.. లాంఛ్ చేసిన రాజమౌళి
అల్లుడు శీను సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో బెల్లంకొండ నటించనున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కునున్న ఈ మూవీ శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్చల్ అవుతున్నాయి. 2005లో తెలుగులో విడుదలైన ఛత్రపతి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా ఇది. ఛత్రపతి హిట్‌తో మాస్ ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. దాదాపు 16 ఏళ్ల అనంతరం ఈ సినిమా హిందీ రేమేక్ ద్వారా బాలీవుడ్లో ఎంట్రీకి సిద్ధమయ్యాడు బెల్లంకొండ. విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ అందించిన ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బాలీవుడ్ రీమేక్.. బెల్లంకొండ బ్రదర్‌తో కృతిశెట్టి?
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ టాలీవుడ్ ఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఓ మూవీ షూటింగ్ దశలో ఉండగా ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా గణేష్ హీరోగా మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా 2006లో షాహిద్ కపూర్, అమృతారావు జంటగా నటించిన చిత్రం ‘వివాహ్’ అనే బాలీవుడ్ మూవీని తెలుగులో రీమేక్ చేయనున్నారు. దీనికి సంబంధించి రీమేక్ హక్కులను కూడా సొంతం చేసుకున్నారట. ఈ మూవీలో బెల్లంకొండ గణేష్‌కు జోడీగా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్గా చేయనున్నట్లు సమాచారం. తొలి చిత్రం ఉప్పెనతో సూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకున్న కృతిశెట్టి అయితే ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. దీంతో దీనికి సంబంధించి ఇప్పటికే సంప్రదింపులు జరిపారని, కృతి కూడా దీనికి పాజిటివ్‌గా రెస్పాండ్ అయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ మంగళూరు బ్యూటీ చేతిలో ఓ అరడజను సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ నాని హీరోగా తెరకెక్కుతోన్న శ్యామ్ సింగ రాయ్‌తో పాటు.. సుధీర్ బాబు నటిస్తోన్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లో నటిస్తోంది. అలాగే తెలుగు, తమిళ భాషల్లో ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. చదవండి : Krithi Shetty: ‘బేబమ్మ’కు ఓ కోరిక ఉందట.. నెరవేర్చేదెవరు? శాండల్ వుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు వీళ్లే! -
భర్త చేతిలో భార్య హతం
గుంటూరు : భర్త చేతిలో భార్య హత్యకు గురైన సంఘటన బెల్లంకొండ మండలంలోని చండ్రాజుపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వల్లాల లక్ష్మి, ఏడుకొండలు భార్యాభర్తలు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే భార్యను గొంతు నులిమి తానే హతమార్చినట్లు భర్త వల్లాల ఏడుకొండలు తెలిపారు. అనంతరం బెల్లంకొండ పోలీసుల సమక్షంలో ఏడుకొండలు లొంగిపోయాడు. ఈ ఘటనపై రాజుపాలెం ఇంచార్జి ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
థియేటర్ లో అగ్ని ప్రమాదం
బెల్లంకొండ: గుంటూరు జిల్లా బెల్లంకొండలో జరిగిన అగ్ని ప్రమాదంలో సినిమాహాల్ కాలిపోయింది. స్థానిక ప్రధాన సెంటర్లో ఉన్న గణేష్ టాకీస్ గత పదేళ్లుగా మూతబడి ఉంది. సోమవారం ఉదయం టాకీస్ పక్కనే ఉన్న చెత్తకుప్పకు నిప్పు అంటుకోవడంతో ఆ మంటలు వ్యాపించి సినిమా హాల్‌కు అంటుకున్నాయి. ఫర్నిచర్ సహా చాలా భాగం కాలిపోయింది. సుమారు రూ. 5 లక్షల నష్టం వాటిల్లిందని యజమాని అంటున్నారు. సమాచారం అందించినా ఫైరింజన్ రాకపోవటంతో మంటలను స్థానికులే ఆర్పి వేస్తున్నారు. -
ఆటో బోల్తా : ఒకరి మృతి
గుంటూరు: గుంటూరు జిల్లా బెల్లంకొండ సమీపంలోశనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. చౌటపాపాయపాలెం గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మిరప నారు తీసుకుని బెల్లంకొండకు ఆటోలో బయలుదేరారు. బెల్లంకొండ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా... మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్యాసింజర్ ట్రైన్లో దారుణం
గుంటూరు : నరసరావుపేట - పిడుగురాళ్ల ప్యాసింజర్ ట్రైన్లో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. వినుకొండ వెళ్తున్న వ్యక్తి నుంచి దుండగులు రూ. 10 వేల నగదు దోచుకున్నారు. అనంతరం ట్రైన్ నుంచి సదరు వ్యక్తిని తోసేశారు. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమీపంలోని స్థానికులు వెంటనే స్పందించి... ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అనంతరం రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని... బాధితుడిని దోపిడి దుండగులపై ఆరా తీస్తున్నారు. బాధితుడు గుంటూరు జిల్లా బెల్లంకొండకు చెందిన కోటేశ్వరరావు అని పోలీసులు చెప్పారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అత్యాచార ఆరోపణలతో ఏఎస్ఐపై కేసు నమోదు
గుంటూరు: ఓ మహిళను వేధించారన్న ఆరోపణలతో గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ ఏఎస్ఐ శ్రీనివాసరావుపై అత్యాచారం కేసు నమోదైంది. శ్రీనివాసరావుతో పాటు మరో వ్యక్తి తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అత్యాచార ఘటనను వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని సదరు మహిళ ఆరోపించింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
రెండు బైక్‌లు ఢీ: ఒకరి మృతి
బెల్లంకొండ: గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం వద్ద రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పాపాయిపాలెంకు చెందిన ఎన్. బ్రహ్మయ్య బైక్‌పై బెల్లంకొండ నుంచి స్వగ్రామానికి వస్తుండగా... ఎదురుగా మరో బైక్‌పై వస్తున్న వెంకటరావు ఢీకొన్నారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో బ్రహ్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వెంకటరావును సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బెల్లంకొండకు చేరుకున్న షర్మిళ
-
పెళ్లి బృందం వాహనాన్ని ఢీకొట్టిన లారీ
బెల్లంకొండ/ సత్తెనపల్లి, న్యూస్‌లైన్ : పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం బెల్లంకొండ మండలం కందిపాడు వద్ద చోటుచేసుకుంది. అచ్చంపేటలో జరిగే పెళ్లికి హాజరయ్యేందుకు గురువారం రెంటచింతల నుంచి బంధువులు తుఫాన్ వాహనంలో బయలుదేరారు. కందిపాడు వద్ద వీరి వాహనాన్ని ఇసుక లోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాచర్లకు చెందిన డ్రైవర్ షేక్ అబ్దుల్ అజీమ్తోపాటు రెంటచింతల వాసులు దాసిరెడ్డి పుల్లారెడ్డి, శీలం ఆంజనేయులు, పి.వెంకట్రామయ్య, పద్మా, జవ్వాజి తులశమ్మ, ఆకుల జయమ్మ, బచ్చు నాగరాజు, మామిడి అనసూర్యమ్మ, లక్ష్మీనాగేశ్వరిలకు గాయాలయ్యాయి. బాధితులను సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని స్థానిక ఎస్ఐ నజీర్‌బేగ్, హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు తదితరులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.