Bellamkonda Sreenivas 'Chatrapathi' Movie Locks Release Date - Sakshi
Sakshi News home page

Bellamkonda Sreenivas: బాలీవుడ్‌పై ఆశలు పెట్టుకున్న బెల్లంకొండ.. ఛత్రపతి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Mon, Mar 27 2023 1:50 PM | Last Updated on Mon, Mar 27 2023 2:57 PM

Bellamkonda Sreenivas Chatrapathi Movie Locks Release Date - Sakshi

‍ప్రభాస్‌-రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ఛత్రపతి సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌కు మాస్‌ ఇమేజ్‌ను తెచ్చిపెట్టిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పుడీ సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్‌ ఈ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేస్తున్నాడు. వి.వి వినాయక్‌ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాను వేసవి కానుకగా మే12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్‌ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. కండలు తిరిగిన దేహంతో బెల్లంకొండ శ్రీనివాస్‌  లుక్‌ అంచనాలను పెంచేస్తుంది. మరి ఈ సినిమాతో బెల్లంకొండ సక్సెస్‌ అందుకుంటారా? లేదా అన్నది చూడాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement