Chatrapati
-
రిజర్వేషన్ల పితామహుడు..
భారత దేశంలో దళితులు, బీసీల వంటి సామాజికంగా వెనుకబడిన వర్గాలవారి ఉన్నతికి ప్రభుత్వ పరంగా ఇప్పుడు కొనసాగిస్తున్న అనేక సదుపాయాలు, హక్కులను 19వ శతాబ్దంలోనే తన కొల్హాపూర్ సంస్థాన ప్రజలకు అందించినవాడు సాహు మహరాజ్. 1894 ఏప్రిల్ 2న సింహాసనం అధిష్టించిన సాహు, వెనుకబడిన కులాల వారందరికీ పాఠశాలలు, వసతి గృహాలు ప్రారంభించి విద్యాబోధనను ఒక ఉద్యమంగా నడిపాడు.1902 జులై 26, భారతదేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వం, ప్రభుత్వోద్యోగాలన్నింటిలో వెనుకబడిన వర్గాల వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులను జారీ చేసింది. గ్రామ పరిపాలన రంగంలో వంశపారం పర్యంగా వచ్చే ముఖ్యులైన పటేల్ (పాటిల్), పట్వారీ (కులకర్ణి) వ్యవస్థని 1918లో రద్దు చేశారు.1919 సెప్టెంబర్ 6న అంటరానితనం పాటించడం నేరమని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. 1920 మే 3వ తేదిన వెట్టిచాకిరీ వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం చేశారు. అంబేడ్కర్ అస్పృశ్యుల హక్కుల సాధన కోసం స్థాపించిన ‘మూక్ నాయక్’ పత్రికకు ఆర్థిక సాయం చేశారు. 1920లో అంబేడ్కర్ ఇంగ్లాండ్ వెళ్లి చదువుకునేందుకు ఆర్థిక సహాయం చేశాడు. బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించాడు. 1919 జూన్‌లో బాల్య వివాహాల రద్దు చట్టం వచ్చింది.1919 జులై 12న కులాంతర, వర్ణాంతర వివాహాలను చట్టబద్ధం చేస్తూ చట్టం తెచ్చాడు. విడాకులు మంజూరు చేయడంలో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగస్టు 2న విడాకుల చట్టం చేశాడు. 1920 జనవరి 17న జోగిని, దేవదాసీ వ్యస్థను రద్దు చేశాడు. ప్రభుత్వం దేవదాసీల పునరావాసానికి చర్యలు తీసుకున్నాడు. 1918లో తన రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ సహకార సంఘాలను ఏర్పాటు చేశాడు. మహారాజుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రిజర్వేషన్ల పితామహుడు సాహు మహరాజ్ 1922 మే 6న మరణించాడు. – సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా (నేడు సాహు మహరాజ్ జయంతి) -
బాలీవుడ్‌పై ఆశలు పెట్టుకున్న బెల్లంకొండ.. ఛత్రపతి రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఛత్రపతి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌కు మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పుడీ సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేస్తున్నాడు. వి.వి వినాయక్ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను వేసవి కానుకగా మే12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. కండలు తిరిగిన దేహంతో బెల్లంకొండ శ్రీనివాస్ లుక్ అంచనాలను పెంచేస్తుంది. మరి ఈ సినిమాతో బెల్లంకొండ సక్సెస్ అందుకుంటారా? లేదా అన్నది చూడాల్సి ఉంది. The wait is over #Chatrapathi in cinemas on 12th May, 2023. Cannot wait to show you all our hardwork & this action-packed dhamaka.🔥 Written by the one and only #VijayendraPrasad, directed by #VVVinayak.@Penmovies #Bss9 pic.twitter.com/VSLYTWQkrT — Bellamkonda Sreenivas (@BSaiSreenivas) March 27, 2023 -
రాజమౌళి ఫుట్‌బాల్ ఆడేస్తాడని రానాకి ముందే చెప్పా: ప్రభాస్
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న షో అన్‌స్టాపబుల్ 2. ఆహా వేదికగా ప్రసారం అవుతున్న ఈ షోలో రీసెంట్గా డార్లింగ్ ప్రభాస్ సందడి చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులు ప్రభాస్‌కు సంబంధించిన ఎపిసోడ్ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ గురువారం(డిసెంబర్ 29న) ఆహాలో ప్రసారమైంది. ఈ సందర్భంగా ప్రభాస్ తన సినిమా విశేషాలు, డేటింగ్ రూమర్స్, పర్సనల్ లైఫ్ గురించిన ఎన్నో ఆసక్తిర విషయాలను పంచుకున్నాడు. చదవండి: రొమంటిక్ సీన్స్‌లో హీరోల ప్రవర్తన అలా ఉంటుంది: తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు ఈ క్రమంలో రాజమౌళితో బాహుబలి చిత్రంపై బాలయ్య ప్రభాస్‌ను ప్రశ్నించాడు. ఛత్రపతి సినిమాతోనే రాజమౌళి గురించి తెలుసుండాలి కదా? అయినా బుద్ది రాలేదా? మళ్లీ ఆయనతో బాహుబలి సినిమా చేశావు? అంటూ చమత్కరించాడు. దీనికి ప్రభాస్ స్పందిస్తూ.. ‘‘ఛత్రపతి’ సినిమాతోనే రాజమౌళి గారి గురించి నాకు తెలిసిపోయింది. ఆయన విషయంలో నాకు అనుభవం ఉంది. కానీ, రానాకే అప్పటికి ఇంకా ఏం తెలియదు. బాహుబలి మేం ఫైనల్ అయ్యాక రాజమౌళి అంటే ఏంటో చెప్పాను. ఇక ‘మనవాడు కాస్త ఫుట్ బాల్ ఆడుకుంటాడు’ అని షూటింగ్‌కి ముందే నేను రానాకి చెప్పాను. చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ బట్టర్ఫ్లై మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.. కాకపోతే అలాంటి సినిమాలో మళ్లీ మళ్లీ ఛాన్స్ రాదు కాబట్టి బాహుబలి సినిమా చేశాను. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఛత్రపతి’ సినిమా షూటింగు మొదలైన నాలుగు రోజులకే రాజమౌళిగారు చాలా గొప్ప మనిషి అనే విషయం నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను ఆయనకి మంచి స్నేహితుడినైపోయాను. ఆ సినిమా విరామ సన్నివేశాలు షూట్ చేసేటప్పుడు సెట్ మొత్తం జనాలు. వాళ్లందరి ముందు డైలాగ్ చెప్పడానికి సిగ్గుగా అనిపించింది. అదే విషయాన్ని జక్కన్నతో చెప్పి ఈ సీన్ వరకూ మూకీగా యాక్ట్ చేశాను. అక్కడ ఉన్న వాళ్లందరూ రిహార్సల్స్ అనుకున్నారు. అలా జక్కన్న నేను ఏది అంటే అది చేసే ఫ్రీడమ్ ఇచ్చారు’’ అని పేర్కొన్నాడు. -
ఆ యాక్షన్ సీన్లో ప్రభాస్‌ను విలన్ నిజమైన కర్రతో కొట్టాడట, ఆ తర్వాత..
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ ఉన్న సంగతి తెలిసిందే. రేపు(మార్చి 11) ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో వారం ముందుగా మూవీ ప్రమోషన్లో పాల్గొంటున్న ప్రభాస్ ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా రాజమౌళి డైరెక్షన్లో తాను తొలిసారి నటించిన చత్రపతి మూవీలో ఆర్ట్ డైరెక్టర్ చేసిన ఓ పనిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. చదవండి: సమంతపై దారుణమైన ట్రోల్స్.. చీచీ ఇలా దిగజారిపోతున్నావేంటి? కాగా ఈ మూవీకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ రవిందర్.. రాధేశ్యామ్‌కు కూడా పని చేశాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ చత్రపతిలో ఆర్ట్ డైరెక్టర్ రవిందర్ చేసిన పనిని గుర్తు చేసుకున్నాడు. చత్రపతిలో సముద్రం ఒడ్డున ప్రభాస్ విలన్ కాట్రాజ్ల ఫైట్ సీన్ ది బెస్ట్ యాక్షన్ సీన్‌గా నిలిచింది. ఈ సన్నివేశంలో ప్రభాస్‌ను విలన్ కర్రతో కోడతాడు. దీని కోసం విలన్ కాట్రాజ్కు సముద్రం ఉప్పుతో చేసిన నిజమైన కర్రను ఇచ్చారట. కానీ ఈ విషయం ప్రభాస్‌కు, విలన్ సుప్రిత్కు తెలియదు. దీంతో విలన్ సుప్రీత్ డూప్ కర్ర అనుకుని తన వీపుపై గట్టిగా కొట్టాడని చెప్పాడు. చదవండి: నేను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా: మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ దాంతో తన వీపు పగిలిపోయిందంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు ప్రభాస్. అయితే ఇదే విషయాన్ని ఆర్ట్ డైరెక్టర్ రవిందర్‌ను అడగ్గా.. పర్ఫెక్షన్ కోసం అంటూ సమాధానం ఇచ్చాడట. కాగా 2005లో రాజమౌళి డైరెక్షన్ వచ్చిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. అప్పట్లోనే ఈ మూవీ రూ. 27 కోట్లు వరకు షేర్ వసూలు చేసిందట. అప్పటి వరకు లవర్ భాయ్‌గా కనిపించిన ప్రభాస్‌కు చత్రపతితో మాస్ ఇమేజ్ వచ్చింది. -
భీమిలి బీచ్‌లో ‘ఛత్రపతి’
సాక్షి,భీమునిపట్నం(విశాఖపట్నం): భీమిలి బీచ్‌లో శుక్రవారం షూటింగ్ సందడి నెలకొంది. తెలుగులో ప్రభాస్ నటించిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో అదే పేరుతో తీస్తున్న సినిమా షూటింగ్ జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను దర్శకుడు వి.వి.వినాయక్ తెలిపారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా, బెల్లంకొండ సురేష్ నిర్మాత. హీరోయిన్ ముసరత్ బంచా, హీరో తల్లిగా భాగ్యశ్రీ నటిస్తుండగా ఇంకా శరత్ ఖేలేఖర్, రాజేష్‌శర్మ, రాంజేంద్ర గుప్తా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 10 వరకు ఇక్కడ షూటింగ్ నిర్వహిస్తారు. వినాయక్‌ను కలిసిన మంత్రి ముత్తంశెట్టి షూటింగ్లో ఉన్న దర్శకుడు వినాయక్‌ను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక్ తనకు మంచి మిత్రుడని తెలిపారు. స్వయం కృషితో గొప్ప దర్శకునిగా ఎదిగారని భీమిలిలో జరిగే ఈ సినిమా కచ్చితంగా మంచి హిట్ అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇది ఆయనకు హిందీలో తొలి సినిమా అని అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుని గుర్తింపు పొందుతారని అన్నారు. చదవండి: Allu Arjun-Priyamani: ప్రియమణిపై ‘హాట్’ కామెంట్స్ చేసిన బన్నీ -
బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన రెజీనా!..హీరో ఎవరంటే
రెజీనీ కసాండ్రా.. కొన్నాళ్ల క్రితం తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ చెన్నై చిన్నది ఈ మధ్యకాలంలో రేసులో వెనకబడింది. వరుస ఫ్లాపులతో టాలీవుడ్లో సినిమాలు తగ్టించిన ఈ బ్యూటీ ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తుంది. తాజాగా ఈ అమ్మడికి బాలీవుడ్లో బంపర్ ఆఫర్ వచ్చిందని సమాచారం. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో రెజీనాను ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. 2005లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఛత్రపతి సినిమాను ప్రస్తుతం హిందీలో వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే హీరోయిన్ విషయంలో మొదటి నుంచి సస్పెన్స్ కొనసాగింది. ఇప్పటికే ఛత్రపతి రీమేక్ కోసం పలువురు స్టార్ హీరోయిన్లను సంప్రదించినా వారు సున్నితంగా ఆఫర్ తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఆ మధ్య అనన్య పాండే హీరోయిన్గా ఫైనలైజ్ అయ్యిందంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఇటీవలె హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభించిన చిత్ర బృందం..రెజీనాను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. -
బెల్లంకొండ ఛత్రపతి హిందీ రీమేక్.. లాంఛ్ చేసిన రాజమౌళి
అల్లుడు శీను సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో బెల్లంకొండ నటించనున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కునున్న ఈ మూవీ శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్చల్ అవుతున్నాయి. 2005లో తెలుగులో విడుదలైన ఛత్రపతి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా ఇది. ఛత్రపతి హిట్‌తో మాస్ ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. దాదాపు 16 ఏళ్ల అనంతరం ఈ సినిమా హిందీ రేమేక్ ద్వారా బాలీవుడ్లో ఎంట్రీకి సిద్ధమయ్యాడు బెల్లంకొండ. విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ అందించిన ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హిందీ కోచింగ్‌కి వెళ్తున్న బెల్లంకొండ.. ఎందుకో తెలుసా?
Chatrapathi: యంగ్ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’హిందీ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్ గడ ఈ రీమేక్‌ని నిర్మిస్తున్నారు. 2005లో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో సేమ్ రిజల్ట్‌ను బాలీవుడ్‌లోనూ రిపీట్ చేయాలని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ సినిమా షూటింగ్ జూలై రెండో వారంలో ప్రారంభంకానుంది. అయితే లాక్డౌన్ సమయాన్ని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ షూటింగ్లో పాల్గొనేందుకు మరింత బాగా సంసిద్దుడైయ్యాడు. సినిమాలో తన లుక్, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండాలని డిసైడైన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఇందుకోసం ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. సరైన పద్దతిలో కసరత్తులు చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మజిల్స్ విషయం స్పెషల్ కేర్ తీసుకున్నాడు. అంతే కాదు...‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో తన వాయిస్‌కు తనే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. హిందీ భాషపై అవగాహన ఉన్నప్పటికీ మరింత పట్టుసాధించేందుకు, ఉచ్ఛారణ పరంగా మరింత స్పష్టత ఉండాలని భావించి ఫేమస్ హిందీ కోచ్ ఇంతియాజ్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారట. బెల్లకొండ సాయి శ్రీనివాస్ కష్టానికి ఏ మేర ఫలితం లభిస్తుందో చూడాలి. -
బెల్లంకొండ రిక్వెస్ట్: అనన్య ఓకే చేస్తుందా?
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఛత్రపతి’ రీమేక్‌లో నటిస్తున్నాడు. దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సాయి శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం హీరోయిన్ల వేట కానసాగుతోంది. ఇందుకోసం ఇప్పటికే కొందరు స్టార్ హీరోయిన్లను కూడా సంప్రదించినట్లు సమాచారం. అయితే తాజాగా బెల్లంకొండకు జోడీగా హీరోయిన్ అనన్య పాండేను సంప్రదించారట చిత్ర బృందం. ఇందుకోసం ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యారట. మరి ఈ ఆఫర్‌కు అనన్య గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అనన్య పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తుంది. 2005లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను వసూలు చేసిన విషయం తెలిసిందే. కాగా సాయి శ్రీనివాస్‌ను హీరోగా అల్లుడు శీను సినిమాతో వీవీ వినాయక్ టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో ఛత్రపతి రీమేక్ తెరకెక్కనుండటం విశేషం. చదవండి : (ఆ నటుడితో బిగ్‌బీ మనవరాలు ప్రేమాయణం.. స్పందించిన తండ్రి) (కంగనాపై ఆర్జీవీ ట్వీట్, ఆ వెంటనే డిలీట్!) -
ఛత్రపతి రీమేక్‌లో సాయి శ్రీనివాస్
తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఛత్రపతి’ సినిమా హిందీలో రీమేక్ అవుతోంది. దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. 2005లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను వసూలు చేసిన విషయం తెలిసిందే. కాగా సాయి శ్రీనివాస్‌ను హీరోగా అల్లడు శీను సినిమాతో వీవీ వినాయక్ టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో ఛత్రపతి రీమేక్ తెరకెక్కనుండటం విశేషం. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. చదవండి: (సీఎం జగన్‌కు ధన్యవాదాలు: ఎస్పీ చరణ్) -
ఒక్క అడుగు...
సినిమా వెనుక స్టోరీ - 28 కొందరు కలుసుకోవాలంటే కాలం వెంటనే అనుకూలించదు. ఏవేవో అవాంతరాలు తెచ్చి పెడుతుంది. కానీ, ఒకసారి కలవడమంటూ జరిగితే మాత్రం ఆ బంధం ఎప్పటికీ విడనంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. ప్రభాస్ - రాజమౌళి విషయం అంతే. ప్రభాస్ ‘ఈశ్వర్’ సినిమా చేస్తున్న టైమ్‌లో, రాజమౌళి ‘స్టూడెంట్ నం.1’ చేసి ఖాళీగా ఉన్నాడు. ప్రభాస్‌తో సినిమా చేయాలని రాజమౌళి ఉబలాటపడ్డాడు. కుదర్లేదు. ‘సింహాద్రి’ తర్వాత కూడా ట్రై చేశాడు. అప్పుడూ కుదర్లేదు. ఈసారి మాత్రం రాజమౌళి బలంగా సంకల్పించుకున్నాడు. అటువైపు ప్రభాస్ కూడా. ఈసారి వీళ్లనాపే శక్తి లేనే లేదు. కీరవాణి ఫ్యామిలీకి భోగవల్లి ప్రసాద్ చాలా క్లోజ్. సినిమాలకు అతీతమైన బంధం వాళ్లది. భోగవల్లి ప్రసాద్ ఏ సినిమా చేసినా దాదాపుగా కీరవాణి మ్యూజిక్ చేయాల్సిందే. తన ముందు ఎదిగిన రాజమౌళి ఇండస్ట్రీలో టాప్ డెరైక్టర్ కావడం చూసి భోగవల్లి ప్రసాద్ చాలా ఆనందపడిపోయారు. రాజమౌళితో సినిమా చేయాలని ముచ్చట పడ్డారాయన.రాజమౌళికి కూడా ఓకే. ‘‘ఎంత బడ్జెట్ అయినా ఫర్లేదు’’ అని చెప్పేశాడాయన. ఇంత స్వేచ్ఛ ఇస్తే ఎవరికైనా టెన్షనే. రాజమౌళి బరువైన బాధ్యతతో ప్రాజెక్ట్‌కి రూపకల్పన చేస్తున్నాడు. ప్రభాస్ సినిమాలన్నీ వరుసపెట్టి చూస్తున్నాడు రాజమౌళి. ఏ హీరోతో సినిమా చేసినా, అతను అంతకుముందు చేసిన సినిమాలన్నీ చూసి, పాత్రల తీరు, వాటిలో ఆడియన్స్‌కి ఏం నచ్చాయనే విషయాలన్నీ రీసెర్చ్ చేయడం రాజమౌళికి అలవాటు. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ‘అడవిరాముడు’లో బర్త్‌డే సీన్లో ఆర్తి అగర్వాల్‌తో ప్రభాస్ ‘‘నువ్విచ్చిన ఈ గిఫ్ట్‌ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’’ అని చెబుతాడు. అక్కడ ప్రభాస్ ఎక్స్ప్రెషన్ రాజమౌళికి చాలా నచ్చేసింది. చేస్తే ఇతనితో హై లెవెల్ ఎమోషనల్ సినిమా చేయాలని ఆ క్షణమే డిసైడైపోయాడు. నాన్న విజయేంద్రప్రసాద్‌తో కూర్చున్నాడు రాజమౌళి. ఇద్దరి మధ్య డిస్కషన్స్. ‘‘ఈ పదేళ్లలో తల్లీ కొడుకుల సెంటిమెంట్‌తో సినిమా రాలేదు. ఆ ప్యాట్రన్‌లో మంచి కథ కావాలి నాన్నా’’ అడిగాడు మౌళి. ఆయనకు వెంటనే ‘ఛత్రపతి’ సబ్జెక్ట్ గుర్తుకొచ్చింది. దానికో ఫ్లాష్‌బ్యాక్ ఉంది. 1988లో ఓ రాత్రిపూట విజయేంద్రప్రసాద్ వీడియో ప్లేయర్ ఆన్ చేశారు. ఓ వీహెచ్ఎస్ క్యాసెట్ ప్లే చేశారు. ‘స్కార్ ఫేస్’ అనే హాలీవుడ్ సినిమా అది. సౌండ్ సరిగ్గా రావడం లేదు. సరిగ్గా అర్థం కాకపో యినా, అందులోని సెంటిమెంట్ ఆయన్ను కదిలించింది. అప్పటికప్పుడు ఓ స్టోరీ ఐడియా స్ఫురణకొచ్చేసింది. గాఢనిద్రలో ఉన్న భార్యను లేపి ఉత్సాహంగా ఆ కథ మొత్తం చెప్పేసి, తర్వాత ప్రశాంతంగా నిద్రపోయారాయన. ఆవిడ మాత్రం నిద్రపోలేదు. ఆ కథలోని సెంటిమెంట్‌కి ఆవిడకు ఏడుపాగలేదు. ఇదే కథను తర్వాత ఆఫీసులో డిస్కస్ చేస్తుంటే, పద్మాలయా సంస్థలో డెరైక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే గోపి విన్నాడు. ‘‘ఏం కథండీ బాబూ... ‘ఛత్రపతి’ అని టైటిల్ పెట్టండి. అదిరిపోతుంది’’ అన్నాడు. ‘నిజమే... ఈ కథకు ‘ఛత్రపతి’ టైటిల్ కరెక్ట్’ అనుకున్నారు విజయేంద్రప్రసాద్. ‘ఛత్రపతి’ అనగానే మరాఠా యోధుడు శివాజీ గుర్తొస్తాడు. తల్లి జిజియాబాయి, శివాజీకి ధైర్యం నూరిపోసి సూపర్ హీరోని చేసింది. ఈ కథలోనూ హీరోకి తల్లి మాటలే స్ఫూర్తి. టైటిల్ అలా సెట్ అయ్యింది. అక్కడితో ఆ కథకు ఫుల్స్టాప్ పడింది. రాజమౌళికి ‘ఛత్రపతి’ కథ విప రీతంగా నచ్చేసింది. ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కొన్ని మార్పులూ చేర్పులూ చేసుకున్నాడు. రాజమౌళి ఏ కథ చేసినా అందులో సూపర్ హీరోయిజం కచ్చితంగా ఉంటుంది. ఇందులో కూడా బాగా వర్కవుటయ్యింది. అలాగే కామెడీ కూడా బాగా రావాలని రాజమౌళి తపన. శంకర్ సినిమా ‘అపరిచితుడు’ అప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. దానికి పేరడీ చేస్తే? రాజమౌళి ఆలోచన. కో-డెరైక్టర్ కణ్నన్ దానికి పోపు చల్లాడు. ‘అప్రతిష్ఠుడు’ అంటూ చేసిన ఎపిసోడ్ బాగా వచ్చింది. ఇక స్క్రిప్ట్ లాక్. ఎం.రత్నంతో డైలాగ్స్ రాయించారు. హీరోయిన్గా శ్రీయ, మెయిన్ విలన్‌గా ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ ఓకే. ఇంకో విలన్ కావాలి. ‘సై’లో విలన్‌గా మొదట అనుకున్న నరేంద్ర ఝా గుర్తొచ్చాడు. బాజీరావ్‌గా అతను ఖరార్. కాట్రాజు పాత్రకు ప్రభాస్‌లా ఒడ్డూ పొడవున్నవాడు కావాలి. చాలామందికి స్క్రీన్ టెస్ట్ చేశారు. ఫైనల్‌గా సుప్రీత్ సెలెక్ట్ అయ్యాడు. ‘సై’లో విలన్ గ్యాంగ్‌లోని పదిమందిలో అతనొకడు. ఇందులో ఇంపార్టెంట్ కేరెక్టర్. కానీ ఇంకా స్ట్రాంగ్‌గా తయారవ్వాలి. 4 నెలలు జిమ్‌కెళ్లి 8 కేజీలు పెరిగాడు సుప్రీత్. తల్లి పాత్రకు భానుప్రియ అయితే బెటర్. కానీ ఆవిడేమో అమెరికా వెళ్లే హడావిడిలో ఉన్నారు. రాజమౌళి ఒక్కసారి కథ వినమని బతిమిలాడాడు. భానుప్రియ కథ విని ‘‘నేనీ సినిమా చేస్తున్నా’’ అని చెప్పేశారు. ప్రభాస్ బ్రదర్‌గా షఫీని ఫిక్స్ చేశారు. ‘సై’కి పని చేసిన సెంథిల్‌కే కెమెరామ్యాన్ పోస్ట్. ఆ సినిమాకి ఎలాంటి షాట్స్ కావాలో చెప్పి చేయించుకున్నాడు. స్క్రిప్ట్ ఇచ్చేసి ‘నీ ఇష్టం... ఎలా తీస్తావో’’ అనేశాడు. ఆర్ట్ డెరైక్టర్ రవీందర్ ఈ టీమ్‌లో కొత్తగా జాయినయ్యాడు. ఇక పెద్దన్న కీరవాణి ఎలానూ పెద్ద అండ. పాటలన్నీ రెడీ. ‘ఎ’ వచ్చి ‘బి’పై వాలే’ పాటను బాలీవుడ్ సింగర్ అద్నాన్ సామీతో పాడించాలనుకున్నారు. దానికి తగ్గట్టే పాట శ్రుతిని అడ్జస్ట్ చేశారు. ఆ టైమ్‌కి అద్నాన్ ఫారిన్లో ఉండటంతో కీరవాణి తన వాయిస్‌తో ట్రాక్ చేశారు. చివరకు ఇదే బావుందని ఉంచేశారు. ‘అగ్ని స్ఖలన సందిగ్ధరిపు వర్గ ప్రళయ రథ ఛత్రపతి’ పాటను కీరవాణి తండ్రి శివశక్తి దత్తా రాశారు. వైజాగ్ సముద్రం. భారీ క్రేన్‌తో ప్రభాస్‌ని సముద్రం మధ్యలో వేలాడదీశారు. ఇది ఫస్ట్ డే ఫస్ట్ సీన్. భోగవల్లి ప్రసాద్కైతే ఒకటే కంగారు. ప్రభాస్, రాజమౌళి మాత్రం చాలా కూల్‌గా పనిచేసుకుంటూ వెళ్లిపోతున్నారు. వైజాగ్ పోర్ట్ ఏరి యాలోనే శరణార్థుల కాలనీ సెట్ వేశారు. అక్కడే మేజర్ పోర్షన్ తీసేశారు. పీటర్ హేన్స్ హాలీవుడ్ స్టాండర్డ్‌లో యాక్షన్ సీన్స్ డిజైన్ చేశాడు. కష్టమంతా కెమెరామ్యాన్ సెంథిల్దే. రాజమౌళి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అందుకే కష్టపడుతున్నాడు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నా, సాఫ్ట్‌లుక్ రావడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే బ్రౌన్ టింట్ అప్లయ్ చేశాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు వాడే కెమెరా టెక్నిక్స్ యూజ్ చేయలేదు. ‘స్లీపింగ్ హాలో’ అనే హాలీవుడ్ సినిమాలో వాడిన సాఫ్ట్ బాక్స్ టెక్నిక్‌ని ఓ ఫైట్ సీక్వెన్స్‌లో ఉపయోగించారు. వీడియో మేకింగ్‌లో వాడే సాఫ్ట్ బాక్స్‌లను తెప్పించి వాటిని ఆన్ చేశారు. 40 అడుగుల ఐరన్ ఫ్రేమ్‌కి లైట్స్ బిగించారు. బెలూన్ లైట్స్‌ని పెద్ద క్రేన్ సాయంతో 100 అడుగుల ఎత్తులో ఉంచి, వాటిని శాటిన్ క్లాత్‌తో కవర్ చేశారు. ఆ లైటింగ్‌లో ఆ ఫైట్ సీక్వెన్స్ తీశారు. ‘ఎ వచ్చి బిపై వాలే’లో కొంత పోర్షన్ లైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో తీశారు. హీరో హీరోయిన్స్, డ్యాన్సర్ల కాస్ట్యూమ్స్ కూడా లైట్ కలర్. కొరియోగ్రాఫర్ లారెన్స్ బ్యాక్‌గ్రౌండ్ మారుద్దామన్నారు. సెంథిల్ మాత్రం కొత్తగా ఉంటుందని చెప్పారు. నిజంగానే పాట కొత్తగా వచ్చింది. భోగవల్లి ప్రసాద్ రోజూ హ్యాపీగా లొకేషన్‌కి వస్తున్నారు. అసలు టెన్షన్ రాజమౌళిది. చెప్పిన బడ్జెట్ దాటకూడదు. అందుకే ప్రతివారం బడ్జెట్ ఫిగర్స్ అన్నీ చూస్తూండేవాడు. ఎక్కడా పెరగడానికి వీల్లేదు. అలాగని ఎక్కడా తగ్గకూడదు. అంతా పర్ఫెక్ట్ ప్లానింగ్. ప్రీ ప్రొడక్షన్‌కు 4 నెలలు... ప్రొడక్షన్‌కు 7 నెలలు... పోస్ట్ ప్రొడక్షన్‌కు 1 నెల... అంతా అనుకున్నట్టే జరుగుతోంది. వైజాగ్, హైదరాబాద్, మైసూరు (1 పాట), నెల్లూరు (క్లైమాక్స్)ల్లో దిగ్విజయంగా షూటింగ్ పూర్తయ్యింది. 1.6 లక్షల అడుగుల ఫుటేజ్ వచ్చింది. దాన్ని 15,000 అడుగులకు ఫైనల్ కట్ చేశారు. కాస్త వల్గర్‌గా ఉందని వేణుమాధవ్ కామెడీ బిట్ ఒకదాన్ని తీసేశారు. నేరేషన్‌కు అడ్డుపడుతుందని కోట శ్రీనివాసరావు బాత్ టబ్ సీన్‌ని తీసేశారు. షఫీది పెక్యులియర్ వాయిస్. అందుకే ఎవరితోనైనా డబ్బింగ్ చెప్పించాలనుకున్నారు. కానీ ఆ కేరెక్టర్‌కి ఆ రిథమ్ కరెక్ట్ అనిపించి, షఫీతోనే చెప్పించేశారు. ఫైనల్ వెర్షన్ కీరవాణి చేతిలో పెట్టారు. ఆయన ఈ సినిమా మూడ్‌ని ఎలివేట్ చేస్తూ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అవుట్‌పుట్ అదిరిపోయింది. సినిమా లెవెలే మారిపోయింది. ఎంత కంట్రోల్ చేసినా బడ్జెట్ 12.5 కోట్లు అయ్యింది. అయినా సినిమా మీద నమ్మకంతో భోగవల్లి ప్రసాద్ సొంతగా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ మంచి ఆఫర్లు రావడంతో రెండు ఏరియాలు ఉంచుకుని మిగతావి అమ్మేశారు. 2005 సెప్టెంబర్ 30. ‘ఛత్రపతి’కి ఫస్ట్ డే డివెడైడ్ టాక్. కానీ రాజమౌళి టీమ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. జనరల్‌గా రాజమౌళి ఇండస్ట్రీ టాక్‌ను పట్టించుకోరు. తనకు తెలిసిన సోర్స్‌ల ద్వారా ఆడియన్స్ టాక్ తెలుసుకుంటారు. ‘ఛత్రపతి’ స్లో పాయిజన్‌లా ప్రేక్షకులకు ఎక్కుతోందని రూఢి అయిపోయింది. ‘తన కోసం తాను బతికేవాడు మనిషి. నలుగురి కోసం బతికేవాడు ఛత్రపతి’ అనే బేసిక్ థీమ్ ప్రేక్షకులకు నచ్చేసింది. 54 కేంద్రాల్లో వంద రోజులాడింది. ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్‌గా వచ్చే షార్క్ ఫైట్ గ్రాఫిక్స్ విషయంలోనే అందరికీ అసంతృప్తి. అది ఊహించిన విధంగా రాలేదు. దాంతో రాజమౌళి దాన్ని మళ్లీ రీప్లేస్ చేయించారు. చిరంజీవి ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి, రాజమౌళిని ఇంటికి పిలిచి మూడు గంటలు మాట్లాడారు. ఈ సినిమా తర్వాత భోగవల్లి ప్రసాద్‌ను అందరూ ‘ఛత్రపతి’ ప్రసాద్ అని పిలవడం మొదలుపెట్టారు. ప్రభాస్ రేంజ్ ఈ ‘ఒక్క అడుగు’తో కొత్త పుంతలు తొక్కడం మొదలుపెట్టింది. ఇక రాజమౌళి గురించి ఏం చెప్పాలి? ఒట్టేసి ఒక మాట, ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పినా చెప్పకపోయినా... ఇది రాజమౌళి సృష్టించిన వండర్! వెరీ ఇంట్రస్టింగ్ * ‘ఛత్రపతి’ టైటిల్ సజెస్ట్ చేసిన గోపీ చాలాకాలం క్రితమే చనిపోయారు. వాళ్ల ఫ్యామిలీకి కొంత పారితోషికం ఇవ్వాలని విజయేంద్రప్రసాద్ ప్రయత్నించి, ఆచూకీ కనుక్కోలేకపోయారు. * ఉత్తమ సంగీత దర్శకునిగా కీరవాణి, ఉత్తమ సహాయనటిగా భానుప్రియ నంది పురస్కారాలు గెలుచుకున్నారు. * ‘హుకుమత్కి జంగ్’ పేరుతో హిందీలో అనువాదమైంది. కన్నడంలో ‘ఛత్రపతి’గా, బెంగాలీలో ‘రెఫ్యూజీ’గా రీమేక్ అయ్యింది.