
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఛత్రపతి’ రీమేక్‌లో నటిస్తున్నాడు. దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సాయి శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం హీరోయిన్‌ల వేట కానసాగుతోంది. ఇందుకోసం ఇప్పటికే కొందరు స్టార్ హీరోయిన్లను కూడా సంప్రదించినట్లు సమాచారం. అయితే తాజాగా బెల్లంకొండకు జోడీగా హీరోయిన్ అనన్య పాండేను సంప్రదించారట చిత్ర బృందం. ఇందుకోసం ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యారట.
మరి ఈ ఆఫర్‌కు అనన్య గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అనన్య పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తుంది. 2005లో ఎస్‌ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను వసూలు చేసిన విషయం తెలిసిందే. కాగా సాయి శ్రీనివాస్‌ను హీరోగా అల్లుడు శీను సినిమాతో వీవీ వినాయక్ టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఛత్రపతి రీమేక్ తెరకెక్కనుండటం విశేషం.
చదవండి : (ఆ నటుడితో బిగ్‌బీ మనవరాలు ప్రేమాయణం.. స్పందించిన తండ్రి)
(కంగనాపై ఆర్జీవీ ట్వీట్, ఆ వెంటనే డిలీట్!)
Comments
Please login to add a commentAdd a comment