
తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఛత్రపతి’ సినిమా హిందీలో రీమేక్ అవుతోంది. దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. 2005లో ఎస్‌ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను వసూలు చేసిన విషయం తెలిసిందే. కాగా సాయి శ్రీనివాస్‌ను హీరోగా అల్లడు శీను సినిమాతో వీవీ వినాయక్ టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఛత్రపతి రీమేక్ తెరకెక్కనుండటం విశేషం. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. చదవండి: (సీఎం జగన్‌కు ధన్యవాదాలు: ఎస్పీ చరణ్)
Comments
Please login to add a commentAdd a comment