Bellamkonda Sreenivas Takes Up Hindi Classes For His Bollywood Debut - Sakshi
Sakshi News home page

హిందీ కోచింగ్‌కి వెళ్తున్న బెల్లంకొండ.. ఎందుకో తెలుసా?

Published Tue, Jun 29 2021 3:41 PM | Last Updated on Tue, Jun 29 2021 4:52 PM

Bellamkonda Sreenivas Taking Hindi Classes for Chatrapathi Remake - Sakshi

Chatrapathi: యంగ్‌ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ ‘ఛత్రపతి’హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.  వీవీ వినాయక్‌ దర్శకత్వంలో పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై జయంతిలాల్‌ గడ ఈ రీమేక్‌ని నిర్మిస్తున్నారు. 2005లో ప్రభాస్‌ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో సేమ్‌ రిజల్ట్‌ను బాలీవుడ్‌లోనూ రిపీట్‌ చేయాలని బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ సినిమా షూటింగ్‌ జూలై రెండో వారంలో ప్రారంభంకానుంది. అయితే లాక్‌డౌన్‌ సమయాన్ని బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ షూటింగ్‌లో పాల్గొనేందుకు మరింత బాగా సంసిద్దుడైయ్యాడు.

సినిమాలో తన లుక్, బాడీ లాంగ్వేజ్‌ పర్‌ఫెక్ట్‌గా ఉండాలని డిసైడైన బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ఇందుకోసం ఇంట్లోనే జిమ్‌ ఏర్పాటు చేసుకున్నారు. సరైన పద్దతిలో కసరత్తులు చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మజిల్స్‌ విషయం స్పెషల్‌ కేర్‌ తీసుకున్నాడు. అంతే కాదు...‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో తన వాయిస్‌కు తనే డబ్బింగ్‌ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌. హిందీ భాషపై అవగాహన ఉన్నప్పటికీ మరింత పట్టుసాధించేందుకు, ఉచ్ఛారణ పరంగా మరింత స్పష్టత ఉండాలని భావించి ఫేమస్‌ హిందీ కోచ్‌ ఇంతియాజ్‌ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారట.  బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ కష్టానికి ఏ మేర ఫలితం లభిస్తుందో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement